koodali

Friday, January 25, 2013

కొన్ని విషయాలు.




 కొన్ని  విషయాలు.........

ఈ  రోజుల్లో  ఎక్కువమంది  బియ్యం,  లేక  గోధుమతో  చేసిన  ఆహారాన్ని  వాడుతున్నారు,. ఇప్పుడు  పొట్టు  తీసి  బాగా  పాలిష్  చేసిన  తెల్లబియ్యన్నే  ఆహారంగా  వాడుతున్నారు,  ఈ  తెల్ల  బియ్యం వాడకం  వల్ల  మధుమేహం  వంటి  వ్యాధులు  పెరుగుతున్నాయట.  ఇలా  బాగా  పాలిష్  చేయటం  వల్ల  పోషకాలు  కూడా  ఉండవు.  


పాలిష్  చేయని  బియ్యం  ఆరోగ్యానికి  మంచిది.  అయితే,   ఈ  బియ్యంతో  వండిన   అన్నాన్ని   ఎక్కువమంది  ఇష్టపడరు.   పాలిష్  చేయని  బియ్యాన్ని  ఇడ్లీలకు,  దోసెలకు  వాడుకోవచ్చు. పాలిష్  చేయని  బియ్యాన్ని  పిండి  పట్టించి  జంతికలు  వంటివి  చేసుకోవచ్చు.

    కొంతకాలం  క్రిందట  చిరుధాన్యాలైన  రాగులు,  సజ్జలు,  జొన్నలు,  వంటివి  కూడా  ఎక్కువగానే  వాడేవారట.   వరిని  పండించటానికి  చాలా  నీరు  అవసరం. ఈ  తృణధాన్యాలను  పండించటానికి  ఎక్కువ  నీరు  అవసరం  లేదు.  



తృణధాన్యాలతో  కూడా   ఎన్నో  రకాల  వంటలను  చేస్తున్నారు.  జొన్న  రవ్వతో  ఉప్మా  చేసుకోవచ్చు.  
 మినప్పప్పు +  బియ్యం + గుప్పెడు  జొన్నలు  నానబెట్టి  రుబ్బి  దోసెలు  వేసుకోవచ్చు. 
రాగి  పిండితో  సూప్  తయారుచేసుకోవచ్చు. 
 గోధుమ  పిండితో  పాటు రెండు,  మూడు   రకాల  తృణధాన్యాలను  కలిపి  పిండి  పట్టించి , చపాతీలను  తయారుచేసుకోవచ్చు.
పకోడీ, సజ్జబూరెలు .... వంటివి కూడా  చేసుకోవచ్చు.


 వరి,  గోధుమతో  పాటు  చిరుధాన్యాలను  వాడటాన్ని  అలవాటు  చేసుకుంటే    ఎన్నో  ఉపయోగాలున్నాయి. 


 ఆరోగ్యం  బాగుంటుంది  +  వరిని  పండించటానికి  అవసరమయ్యే  నీటి  వాడకం  తగ్గుతుంది  +  వర్షాధార  ప్రాంతాలలో  చిరుధాన్యాలను  పండించే  రైతులకు  ప్రోత్సాహం  లభిస్తుంది. 

రాగులు,  సజ్జలు,  జొన్నలు,  వంటి  చిరుధాన్యాల   మొక్కలకు  ఎక్కువగా  చీడపీడలు  ఆశించవట.  

ఇలా  ఎన్నో  ఉపయోగాలున్నాయి  కాబట్టి,   తృణధాన్యాలను  కూడా   వాడటం  అలవాటుచేసుకోవాలి.


2 comments:

  1. మేము తృణధాన్యాలు ఎక్కువగా వాడతాం. రాగులు, జొన్న వగైరా, ఆరోగ్యానికి మంచిది,తేలికగా జీర్ణమవుతాయి కూడా. మంచిమాట చెప్పేరు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, మీరన్నట్లు రాగులు, జొన్న వగైరా, ఆరోగ్యానికి మంచిది, తేలికగా జీర్ణమవుతాయి కూడా.

      పూర్వం వేసవికాలంలో రాగుల జావను మజ్జిగలో కలిపి త్రాగేవారు. జొన్నన్నం కూడా తినేవారట.

      ఈ రోజుల్లో చంటి పిల్లలకు బజారులో దొరికే రెడీమేడ్ ఆహారాన్ని పెడుతున్నారు. ఇలాంటి రెడీమేడ్ ఫుడ్ కన్నా , ఇంట్లో తయారు చేస్తే మంచిది.

      చెన్నైలో కొన్ని రకాల ధాన్యాలను కొద్దికొద్దిగా కలిపి ఒక పాకెట్ గా అమ్ముతారు.

      అంటే కొద్దిగా బియ్యం, పెసలు, కందులు, మొక్కజొన్న, రాగులు, జొన్నలు, సొయా... ఇలా...... అమ్ముతారు.

      వీటిని కొని తెచ్చుకుని వేయించి పొడి చేసి జావగా చేసి చంటి పిల్లలకు తినిపిస్తారు. ఈ జావ పిల్లలకు చాలా బలవర్ధకమైనది.

      ఈ జావ పెద్దలకు కూడా మంచిదేనండి.

      Delete