దీపావళి పండుగ వస్తే టపాసులు కాల్చుకోవచ్చని పిల్లలు బాగా సరదాపడతారు.( చాలామంది పెద్దవాళ్ళు కూడా సరదా పడతారు. )
అయితే టపాసుల ధరలు కూడా అన్ని వస్తువుల ధరలలాగే రోజురోజుకీ మరింత పైకి వెళ్ళిపోతున్నాయి.
అన్ని వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కొద్దోగొప్పో డబ్బు ఉన్నవాళ్ళే ఈ ధరలు చూసి లబోదిబోమంటున్నారు. ఇక తక్కువ ఆదాయం గలవారు ఏం తింటారో ? ఎలా బ్రతుకుతారో ?
ఇంకో విషయం ఏమిటంటే , నరకాసురుల వంటి రాక్షసులు బయటే ఉంటారు అనుకుంటాము.
ఇలాంటి నరకాసురులు బయట మాత్రమే ఉండరు. మనలోనూ ఉంటారు.
మనలోని అత్యాశ, అహంకారం, అసూయ, వంటి దుర్గుణాలే మనలోని నరకాసురులు.
మనలోని నరకాసురులను వధించటం కూడా అత్యంత కష్టమయిన పనే.
మన మనస్సే కదా మన మాట వింటుందని అనుకోవటానికి లేదు. ఒకోసారి దానిష్టప్రకారం అది నడుస్తుంది.
మన మనస్సు మన మాట వినకపోవటమేమిటో అంతా వింతగా అనిపిస్తుంది కదా !.
మనలోని దుర్గుణాలే మనకూ, సమాజానికీ కూడా కష్టాలను తెచ్చిపెడతాయి.
అందుకని మనలోని దుర్గుణాలను పారద్రోలటానికి బాగా ప్రయత్నించాలి.
ఎంత ప్రయత్నించినా మన మనస్సు మన మాట వినకపోతే భగవంతుని శరణు వేడాలి....
దుబ్బు దుబ్బు దీపావళి మళ్ళీ వచ్చే నాగుల చవితి.
ReplyDeleteమీకు మీ ఇంటిల్లిపాదికి దీపావళి శుభాకాంక్షలు.
కృతజ్ఞతలండి.
ReplyDeleteమీకు మీ కుటుంబసభ్యులకు , మరియు అందరికీ దీపావళి, నాగులచవితి పండుగల సందర్భంగా శుభాకాంక్షలండి..