koodali

Monday, October 10, 2011

మాంసము.......మానవాహారము కాదు.

 

ఈ క్రింది విషయాలు ఒక ప్రముఖ వైద్యులు వ్రాసిన పుస్తకంలోనివండి.

భగవంతుడు ఆయా జీవరాశుల నివాసములు, పరిసరములు, వాతావరణము, అంగసౌష్ఠవములను బట్టి విభిన్న ఆహారములను నియమించటం జరిగింది.


భగవంతుని సృష్టి ఎంతో అద్భుతమైనది .


జీవరాశులలో శాకాహారులు, తృణాహారులు, ఫలాహారులు, మాంసాహారులు, ఉభయాహారులు ఇలా వివిధశాఖలుగా ఏర్పడి ఉన్నాయి,..

మాంసాహారులైన జంతువులకు అందుకు తగినట్లుగా వాడికోరలు అవి ఉంటాయి.ఉదా... సింహము, పులి, నక్క, వగైరాలు.

భగవంతుడు వాటికి మాంసాహారానికి అనువైన అంతరావయములను, జీర్ణాదిరసములను అమర్చారు.

మాంసము త్వరగా కుళ్ళిపోతుంది.అది ప్రేగులలో నిలువయుండుట వల్ల అనేక రోగక్రిములు ప్రవేశించే అవకాశమున్నది.

కనుక త్వరగా జీర్ణమై మలము వెలువరించబడుటకు గానూ ,కుఱుచైన జీర్ణకోశము, మలకోశముల ఏర్పాటు జరిగింది.

వాటి ప్రేగుల నిడివి జంతువులను బట్టి ఉంటాయి., ఉదా.... పెద్దపులి, సింహము వంటి వాటికి 10 అడుగుల పొడవు మాత్రము ఉంటాయి.

అందువల్ల ఈ మృగములు మాంసమును భుజించిన ఐదారుగంటలకే మలవిసర్జన చేస్తాయట.

అదే మానవుల జీర్ణమండలము, జీర్ణాదిరసములను పరిశీలించినప్పుడు అవి మాంసాహారమునకు విరుద్ధముగా ఏర్పాటై ఉన్నాయి.

మానవ జీర్ణమండలము దాదాపు 30 అడుగుల పొడవుంటుందట.

అందువల్ల 24 గంటలకు గానీ మలవిసర్జన జరుగదు ,

మాంసము 24 గంటలు ప్రేవులలో ఉండటం వల్ల అది కుళ్ళిపోయి దుర్వాయువులు వస్తాయి.

ఆ గాస్ వల్ల గాస్ట్రిక్ ట్రబుల్, అల్సర్, నులిపురుగులు వంటివి ఎక్కువగా వచ్చే అవకాశముందని చెబుతున్నారు.

ఇంకా అనేక వ్యాధులు వచ్చే అవకాశముందటున్నారు. రక్తం పులిసి చెడిపోయి యూరిక్ యాసిడ్ గా తయారవుతుందట.

అంతేకాక , రక్తం చిక్కబడిపోవటం . అందువల్ల కీళ్ళనొప్పులు, గుండెజబ్బులు, మూత్రపిండాలలో రాళ్ళు వంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

మాంసాహారము తమోగుణమును కలిగిస్తుంది.. అందువల్ల ఉద్రేకము, కోపము, అశాంతి వంటివి పెరుగుతాయి.

అందుకని శాకాహారమే మానవులకు మంచిదని చెప్పారు .

ఎక్కువగా పండ్లు ,పచ్చి కూరగాయలు వంటివి తినాలి..

మితిమీరి వండిన ఆహారపదార్ధాలు , ఎక్కువకాలం ఫ్రిజ్లలో నిలువ ఉన్నవీ వంటి
ఆహారపదార్ధాలు తినకూడదు.

యిలా ఎన్నో విలువైన విషయాలను చెప్పటం జరిగింది.



2 comments:

  1. మీరు రాసింది.., ఆ రాసిన వైద్యులని కమ్మకొడుతున్నట్టుగా ఉందండీ..!

    ReplyDelete
  2. అయ్యో ! నేను మామూలుగానే రాశానండి. ఇలా అపార్ధం చేసుకుంటారనుకోలేదు. వీలయినంతవరకు సరి చేస్తాను.. కృతజ్ఞతలండి..

    ReplyDelete