koodali

Wednesday, October 5, 2011

భక్తి యోగములో కొంత భాగము..............4

 

ఓం.

కోరికలు లేనివాడును, బాహ్యాభ్యంతర శుద్ధి గలవాడును , కార్యసమర్ధుడును , ( సమయస్ఫూర్తి గలవాడును ), తటస్థుడును , దిగులు ( దుఃఖము ) లేనివాడును , సమస్తకార్యములందును కర్తృత్వమును వదలినవాడును ,
( లేక సమస్త కామ్యకర్మలను , శాస్త్ర నిషిద్ధ కర్మలను త్యజించిన వాడును ) నాయందు భక్తి గలవాడును , ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు.

ఎవడు సంతోషింపడో , ద్వేషింపడో ,శోకమును బొందడో , ఎవడు శుభాశుభములను వదలినవాడో , అట్టి భక్తుడు నాకు ఇష్టుడు.

శత్రువు నందును, మిత్రునియందును, మానావమానములందును , శీతోష్ణసుఖదుఃఖములందును సమముగ నుండువాడును , దేనియందును సంగము
( ఆసక్తి, మనస్సంబంధము ) లేనివాడును, నిందాస్తుతులందు సమముగ నుండువాడును, మౌనముతో నుండువాడును ( లేక మననశీలుడును ), దేనిచేతనైనను ( దొరికినదానితో ) తృప్తిని బొందువాడును, నిర్దిష్టమగు నివాసస్థానము లేనివాడును ( లేక గృహాదులందాసక్తి లేనివాడును ), నిశ్చయమగు బుద్ధి గలవాడును , భక్తితో గూడియుండువాడునగు మనుజుడు నాకు ఇష్టుడు.

ఎవరైతే శ్రద్ధావంతులై, నన్నే పరమగతిగ నమ్మి
( నాయందాసక్తి గలవారై )ఈ అమృతరూపమగు
( మోక్షసాధనమైన ) ధర్మమును ( ఇప్పుడు ) చెప్పబడిన ప్రకారము అనుష్ఠించుదురో అట్టి భక్తులు నాకు మిక్కిలి ఇష్టులు.

గీతా మాహాత్మ్యములో కొంత భాగము. ......

భూదేవి విష్ణు భగవానుని గూర్చి యిట్లు ప్రశ్నించెను.....

ఓ భగవానుడా ! పరమేశ్వరా ! ప్రభూ ! ప్రారబ్ధము అనుభవించువానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు ?

విష్ణువు చెప్పెను....

ఓ భూదేవీ ! ప్రారబ్ధ మనుభవించుచున్నను , ఎవడు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడైయుండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే నంటబడక ఈ ప్రపంచమున సుఖముగ నుండును..

( వ్రాసిన దానిలో ఏమైనా అచ్చుతప్పులు వంటి పొరపాట్లు వచ్చినచో దైవం దయచేసి క్షమించవలెనని వేడుకుంటున్నానండి..).
...........................

శ్రీకృష్ణ పరమాత్మకు అనేక వందనములు.

ఆదిశక్తి అయిన పరమాత్మకు అనేక వందనములు.

అందరికి దసరా పండుగ శుభాకాంక్షలండి.
....................................

ఈ లోకంలో ఎన్నో ఆకర్షణలు, ఎన్నో ఆటంకాలు., ఇంకా ఎన్నో పరీక్షలు .

కానీ, దైవం దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.

అలాగే, నిశ్చలమైన భక్తి ఉంటే దైవం దయ ఉన్నట్లే.

అందుకే, నిశ్చలమైనభక్తిని అనుగ్రహించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.


2 comments:

  1. మీకు దసరా పండుగ శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. కృతజ్ఞతలండి. మీకు మరియు అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు.

    ReplyDelete