Wednesday, August 18, 2010
ఈర్ష్య, అసూయ వల్ల చివరికి మిగిలేది....................
పాండవులు, కౌరవులు ............. పాండవులు ధర్మపరులు. దుర్యోధనుడు అసూయాపరుడు. ఎప్పుడూ పాండవులకు హాని చేయటానికే ప్రయత్నించేవాడు. తమకు న్యాయముగా లభించిన తమవాటా రాజ్యమును పాండవులు చక్కగా అభివృధ్ధి చేసుకున్నారు. దాని అభివృధ్ధిని చూసి దుర్యోధనుడు ఎప్పుడూ ఈర్ష్యపడేవాడు.
వనవాసం, అజ్ఞాతవాసం ముగిసిన తరువాత ధర్మం ప్రకారం వారి రాజ్యం వారికి ఇవ్వకపోగా ,పాండవులు అడిగిన అయిదు ఊళ్ళను కూడా వారికి ఇవ్వటానికి ఒప్పుకొనలేదు. సూదిమొన మోపినంత ప్రదేశాన్ని కూడా వారికి ఇవ్వనని అనటం వల్లనే పాండవులకు యుధ్ధం చేయక తప్పలేదు... చివరికి ఏమి జరిగిందో అందరికి తెలుసు.....
పైన వ్రాసిన దానితో సంబంధం లేని టాపిక్ అయినా ఇంకో విషయం కూడా వ్రాయాలనిపిస్తోందండి. ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఆధునికత మరియు సంపాదన మోజులో విలువలను పట్టించుకోవటంలేదు. ఇది చాలా బాధాకరమైన విషయం. వీరు భావిభారత పౌరులైన ............ వారి పిల్లలకు ఏ విధంగా విలువలను నేర్పుతారు ? అప్పుడు సమాజం ఏమవ్వాలి ?
మనం తప్పులను చేస్తాం, కానీ తప్పు తెలుసుకుని మంచిగా మారితే భగవంతుడు తప్పక క్షమిస్తారు. నేను చిన్నప్పుడు దేవుడు లేరని చెప్పే మా టీచర్ మాటలు విని ఆ దైవం యొక్క చిత్రాన్ని కాలితో త్రొక్కటం జరిగింది. ఆ తరువాత తప్పు తెలుసుకున్నాను, ఇవన్నీ ఇంతకు ముందు ఒక వ్యాసంలో వ్రాసాను లెండి.
అంత తప్పు చేసిన నన్నే ఆ దైవం క్షమించారు.
ఎవరైనా సరే మంచిగా మారితే ఆ దైవం తప్పక క్షమిస్తారు. .
Subscribe to:
Post Comments (Atom)
పశ్చాత్తాపాన్ని మించిన శిక్షలేదు. మన తప్పు తెలుసుకుని దానిని సరిదిద్దుకున్ననాడు మనమే ఒకరికి ఆదర్శప్రాయులం అవుతాము. భగవంతునికి కోపతాపాలు లేవు. అతడు ప్రేమ స్వరూపుడు. మన మనసులోని మలినమే మనల్ని భయపెడుతుంది. మంచితనమే ఆనందాంబుధిలో తేలిస్తుంది.
ReplyDeleteకామెంట్ల ఆటుపోటులకు దూరంగా నిర్విరామంగా సాగించే మీ బ్లాగు చాలా బాగుంది. మీ ఆధ్యాత్మిక చింతన అభినందనీయం. :)
nijame anDi....
ReplyDeleteనేను ఈ మధ్య ఊరు వెళ్ళి రావటం వల్ల రిప్లై వ్రాయటం లేటయింది సార్. అందుకు సారీ అండి. మీరు అన్నట్లు భగవంతుడు ఎంతో దయామయుడు. ఇంకా బ్లాగ్ బాగుందని అన్నందుకు థాంక్స్ అండి, కానీ ఈ బ్లాగ్ చదువుతున్న మీకు, ఇంకా మిగతా వారికి తెలిసిన విషయ పరిజ్ఞానం ముందు నాకు తెలిసింది చాలా తక్కువ అండి. ఆధ్యాత్మిక చింతన విషయంలో కూడా నేనెంత. మీ బ్లాగ్ లో కలలను గురించిన ఆర్టికల్ ఇంకా వేరే వ్యాసములు చాలా బాగున్నాయి సార్...... ..
ReplyDeleteనేను ఈ మధ్య ఊరు వెళ్ళి రావటం వల్ల రిప్లై వ్రాయటం లేటయింది సార్. అందుకు సారీ అండి. మీకు వ్యాసం నచ్చినందుకు థాంక్స్ అండి. మీ బ్లాగ్ లో కవిత్వం బాగుందండి. ఈ రోజుల్లో యువత కవిత్వంతో పాటు ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలనుకోవటం మంచి పరిణామం.
ReplyDelete