ఈ బ్లాగులో వ్రాస్తున్న సంగతులను చదువుతున్న వారికి నా కృతజ్ఞతలండి.
ఇప్పుడు వ్రాస్తున్న సంఘటన ఒక యోగి ఆత్మ కధ గ్రంధములో చెప్పబడింది.
ఇది కేవలానంద గారు చెప్పిన ......... బాబాజీ జీవితంలో జరిగిన ఒక సంఘటన.
ఒకనాటి రాత్రి బాబాజీ శిష్యులు పవిత్రమయిన వైదిక క్రతువు ఒకటి చెయ్యడానికి, భగభగా పెద్ద మంట మండుతున్న హోమకుండం చుట్టూ కూర్చుని ఉన్నారు. ఉన్నట్టుండి గురువుగారు ,మండుతున్న కట్టె ఒకటి తీసుకొని, హోమకుండానికి పక్కనే ఉన్న ఒక శిష్యుడి భుజం మీద కొట్టారు.
స్వామీ, ఎంత క్రూరం ! అన్నారు ఆక్షేపణగా, అక్కడే ఉన్న లాహిరీ మహాశయులు.
అయితే ఇతను, తన పూర్వ కర్మ ఫలానుసారంగా నీ కళ్ళముందే కాలి బూడిద అయిపోతూంటే చూస్తూంటావా ?
ఈ మాటలతో బాబాజీ, శిష్యుడి వికృత భుజమ్మీద ఉపశమనదాయకమయిన తమ చెయ్యి వేశారు. ' ఈ రాత్రి నిన్ను బాధాకరమయిన మృత్యువు నుంచి తప్పించాను. నిప్పు సెగ వల్ల ఈ కొద్దిపాటి బాధతో కర్మనియమం నెరవేరింది ' అన్నారాయన.
ఇది చదివాక నాకు ఏమనిపించిందంటేనండి....మనము సత్ప్రవర్తనవల్ల, ప్రేమ భక్తి వల్ల గురువు మరియు భగవంతుని కృపను పొందగలిగితే, మన పూర్వ కర్మ ఫలానుసారంగా అనుభవించవలసి వచ్చే రాబోయే పెద్దబాధలనుండి వారు మనలను రక్షించే అవకాశం ఉంది అని..
గురువు యొక్క కృపకు పాతృలైన వారు ఎంతటి పరిస్థితినైనా నిరాయాసంగా ఎదుర్కొన గలరు.
ReplyDeleteకామెంట్స్ కొద్దిసేపటి క్రితం మాత్రమే చూసినందువల్ల జవాబివ్వటం ఆలస్యమయినందుకు నిజంగా చాలా బాధగా ఉందండి. దయచేసి క్షమించండి. మీ అభిప్రాయములు తెలిపినందుకు ధన్యవాదములండి.
ReplyDelete