ఒక యోగి ఆత్మ కధ లో ఒక దగ్గర ఇలా చెప్పబడింది. ......... దేవుడొక్కడే తప్పులేని సలహా ఇస్తాడు; ఆయన తప్ప మరెవ్వరు మొయ్యగలరు ఈ బ్రహ్మాండ భారాన్ని ? అని...
ఇక నిన్నటితో ఈ సంవత్సరపు అమర్ నాధ్ యాత్ర పూర్తి అయింది. ఈ అమర్‌నాధ్ గుహ పురాణకాలం కన్నా ఎప్పటినుండో ఉన్న గుహ అట. కానీ ఈ కాలంలో మరల కొత్తగా ఒక ముస్లిం సోదరుని వల్ల కనిపెట్టబడింది. నాకయితే ఏమనిపించిందంటే భగవంతుడు అందరికి ఒక్కటే అని, అన్ని మతములవారు గొడవలు లేకుండా సుఖంగా ఉండాలని దీని ద్వారా మనము తెలుసుకోవచ్చని అనిపించిందండి.
బుధ అమర్ నాధ్ యాత్రలో అక్కడి ముస్లిం సోదరులు కూడా సహకారాన్ని అందిస్తారట. బాబా అమర్ నాధ్ యాత్రకు మేము వెళ్ళినప్పుడు అక్కడి వారి సహకారాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాము.
బుధ్ధ అమర్నాధ్ టెంపుల్ పూంచ్ టౌన్ కు దగ్గరలో ఉంటుందట.. ఈ గుడి మేము చూడలేదు. మేము వెళ్ళిన అమర్ నాధ్ గుహ హిమాలయములలో కాశ్మీర్ కు దగ్గరగా ఉంటుంది. ఈ గుహలో శివలింగం మంచుతో ఏర్పడుతుంది. .. అమర్నాద్ యాత్ర అంటే ఇక్కడకు వెళ్లి మంచు లింగాన్ని దర్శించు కుంటాము.
నాకు అప్పుడప్పుడు మన గుళ్ళు, అక్కడి విశేషాలు కలలో వస్తాయి. అరుదుగా ఇతర మతములవారికి సంబంధించిన విశేషాలు కూడా కలలో వస్తాయి. చాలా మంది భక్తులు కూడా భగవంతుని గురించి తమ తమ అనుభవాలను తెలుపుతున్నారు కదా...
మనము మానవులే గొప్ప అనుకుంటాము కానీ జంతువులు, పక్షులు కూడా భక్తిని కలిగి ఉండటం చూస్తూనే ఉన్నాము. కొంత కాలం క్రితం ఒక వానరం ఒక అంజనేయస్వామి వారి విగ్రహం వద్ద కొన్ని రోజులు నిరాహారంగా ఉండి ఆ తరువాత మరణించటం విన్నాము కదా.
ఒక వరాహం ఒక గుడి చుట్టూ నీరసంతో పడిపోతూ కూడా , ప్రదక్షిణలు చేయటం మేము టి.వి. లో చూశాము. ఒక ఎలుక కూడా గుడిలో ప్రదక్షిణలు చేసింది. ఇంకా ఒక దర్గాలో ఒక పావురం కూడా భక్తులు ఆహారాన్ని అందించినా తినకుండా అలాగే నిలబడి ఉండటం మీడియాలో చూపించారు.
ఇలా ఎన్నో వింతలు జరుగుతున్నాయి. అంతా ఆ భగవంతుని దయ....
No comments:
Post a Comment