నాకు ఇలా వ్రాయాలనిపిస్తోందండి. ప్రపంచములో ఎన్ని మతములున్నా దైవము మాత్రము ఒకటే. ఉదా......ఇప్పుడు సూర్యుడు అందరికీ ఒక్కడే. కానీ రకరకాల పేర్లతో పిలుస్తాము కదా....చంద్రుడు అందరికీ ఒక్కడే. .. అలాగే దైవం కూడా అందరికీ ఒక్కడే.
ఒక యోగి ఆత్మ కధలో పెద్దలు అన్ని మతముల యొక్క గొప్పతనమును గురించి చెప్పటం జరిగింది. హిందు, క్రిస్టియన్, ముస్లిం, సిక్కు, బౌధ్ధం , ఇలా అన్ని మతములు గొప్పవే. ఎందుకంటే అందరి దైవం ఒక్కటే కాబట్టి.
అన్ని మతములలోను ఎన్నో మహిమలు చూపినవారు ఉన్నారు. ప్రపంచములో దైవశక్తి యొక్క గొప్పదనము ఇలాంటి వాటి ద్వారా నిరూపించబడుతుంది. ఒక యోగి ఆత్మ కధలో ఎంతోమంది హిందూ యోగులు చూపిన మహిమల గురించి చెప్పబడింది.
గిరిబాల అనబడే ఒక సాధ్వి ఆహారం స్వీకరించక ఎన్నో సంవత్సరములు గడిపినారట. దాని గురించి ఆమెను అడిగినప్పుడు ఆమె ఏమంటారంటే ............ మానవుడు ఆత్మ అని నిరూపించటానికి , ఇంకా అతడు దివ్యమైన ప్రగతి సాధించటం ద్వారా , అన్నం వల్ల కాక భగవంతుని శాశ్వత కాంతి వల్ల బతకగలుగుతాడు అని నిరూపించటానికి ... అని చెప్పటం జరిగింది. .
గిరిబాల వంటివారికి , అనేకపూర్వ జన్మల దైవాంకిత జీవనం ఉండి ఉంటుంది.
నాకు ఇంకా ఏమనిపించిందంటే మనం అందరం భగవంతుని పిలిచే పేర్లలో కూడా ఎంతో పోలిక ఉందని. ఉదా.....పరమ్+ఏశా = పరమేశా. ఏసా అన్న ధ్వని అనిపిస్తోంది కదండీ.
...జగద్+ఈశా == జగదీశా. ఇందులోని ఈశా అన్న పదాన్ని తిరగవేసి చదివితే శాయీ అని వస్తుంది. అంటే సాయీ, సాయీ....అలా ... వాల్మీకి మహర్షి మహర్షిగా మారకముందు రామ నామాన్ని మరా,మరా అని పలికినట్లు.
ఇంకా కృష్ణ, కృష్, క్రీస్తు ఇలా పోలిక ఉంది కదండీ. ఇక సాయి బాబా వారి కధలోని కొంతమంది హిందువుల పేర్లు నానా సాహెబ్ డేంగలే, బాపూ సాహెబ్ బుట్టీ, కాకా సాహెబ్ దీక్షిత్. కాకాసాహెబ్ దీక్షిత్ బ్రాహ్మణులు. ఇవన్నీ విచిత్రంగా ఉన్నాయి.

జగన్మాత దర్శనాన్ని పొందిన శ్రీ రామ కృష్ణ పరమహంస వారు ఇతర మతముల వారిని గౌరవించేవారట. రామకృష్ణ మఠంలో అన్ని మతములవారికి ప్రవేశముంటుంది.
నాకు ఏమనిపిస్తుందంటే అన్ని మతముల వారు ఎవరి పధ్ధతిలో వారు దైవాన్ని కొలుచుకుంటూ గొడవలు లేకుండా అందరూ మంచిగా ఉంటే బాగుంటుంది కదా అని.
అందరికీ ఒక్కడే దేవుడు
ReplyDeleteకొందరికి రహీము కొందరికి రాముడు
ఏ పేరున పిలిచినా దేవుడు ఒక్కడే దేవుడొక్కడే [[అందరికీ]]
పూలలో ఉన్నాయి వేలరకాలు
పక్షులలో ఉన్నాయి లక్షవిధాలు
రేకులు ఉంటేనే పువ్వంటాము
రెక్కలు ఉంటేనే పక్షంటాము
మతాలు ఏవైనా కులాలు వేరైనా
మంచిమనసు ఉంటేనే మనిషంటాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
పై వేషం చూసి నీవు భ్రమపడరాదు
మేడిపండు మెరుగంతా మేలిమికాదు
ఎక్కడో దేవునికై ఎందుకు వెదికేవు?
పక్కనున్న మానవుని ఎందుకు మరిచేవు?
మానవసేవే మాధవ సేవ
బాధపడే సోదరులను ఆదుకునేను
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
కష్టపడే నీతిపరుని కడుపు నిండదు
దోచుకునే దొరగారికి తృప్తి ఉండదు
స్వార్ధపరుల ఆట మనం కట్టిస్తాము
శ్రమజీవుల కష్తఫలం ఇప్పిస్తాము
అహింస బోధిస్తాం ప్రశాంతి సాధిస్తాం
లోకంలో ఆకలే లేకుండా చేస్తాము
మనుషులమై మనమంతా కలిసుంటాము [[అందరికీ]]
1970 ఒకే కుటుంబం-దాశరథి-ఎస్.పి.కోదండపాణి-ఘంటసాల.
http://nrahamthulla.blogspot.com/2010_05_01_archive.html
చదివినందుకు చాలా థాంక్స్ సార్. మీరు పంపిన పాట కూడా బాగుందండి. క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ?
ReplyDeleteకొన్ని సార్లు సమయం సందర్భం గమనించకుండా వ్యాఖ్యలు మనసులోనుంచి బయటకు వస్తాయి.చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో స్థానిక మసీదులో ఇఫ్తార్ కు వెళ్ళి నమాజు చేసి ఇది నా పూర్వజన్మ సుకృతం అన్నారు.ముస్లిములు పూర్వజన్మను నమ్మరు.ఆ పదం మసీదులో వాడాల్సిన అవసరం లేదు.అయినా అనేశారు,దాన్ని సహృదయంతో ముస్లిములు స్వీకరించారు.నిజమే మీరు చెప్పినట్లు క్రితం జన్మలో ఎవరు ఏ మతంలో, ఏ ప్రాంతములో ఎలా పుట్టారో ఎవరికి తెలుసు ? వచ్చే జన్మలో హిందువులు ముస్లిములుగానూ,ముస్లిములు హిందువులుగానూ కూడా పుట్టొచ్చు.
ReplyDeleteసారీ సార్.... ..నేను మీరు రెండోసారి వ్రాసిన కామెంట్ ను చూడలేదండి. ఇన్ని రోజుల తర్వాత వెనకటి కామెంట్స్ చూస్తుంటే మీ కామెంట్ కనిపించిందండి. నాకు ముస్లిం మతములో పూర్వజన్మలను నమ్మరన్న విషయము ఇప్పటివరకూ తెలియదండి. మీరు నేను వ్రాసినదాన్ని అపార్ధం చేసుకోరని భావిస్తున్నానండి. ..
ReplyDelete