koodali

Friday, June 25, 2010

కొన్ని యాత్రా విశేషాలు ........




ఫోటోస్ మేము శ్రీ అమర్ నాధ్, మాతా వైష్ణవీ దేవీ యాత్రలు చేసినప్పటివండి. ఫోటోస్ ను మేము మళ్ళీ సెల్ల్ ఫోన్ తోతీసి ఇక్కడ పెట్టడం వల్ల అంతబాగా కనిపించటం లేదండి. మూడవ ఫోటో వైష్ణవి దేవి గుడి ఉన్న ప్రాంతము .


మాతా వైష్ణవీదేవీ దర్శనం క్యూ లైన్ లో త్వరత్వరగాపంపించటం వల్ల, ఇంకా కొన్ని కారణాలవల్ల మేము అమ్మవార్లను అంత బాగా చూడలేకపోయాము. మనకు అంతవరకేప్రాప్తం అని సరిపెట్టుకున్నాము .వైష్నవీ దేవీ దర్శనము అయ్యాక అక్కడకు కొంతదూరంలో భైరన్ టెంపుల్ ఉంటుంది. అక్కడ దర్శనము చేసుకుంటెనేగాని యాత్ర పూర్తి అయినట్లు కాదంట. ఇలా అని అమ్మవారి వద్ద భైరన్ నాధ్ వరాన్నికోరుకోవటం
జరిగిందట. మేము ఈ గుడికి కూడా వెళ్ళాము లెండి. 


అమర్నాధ్ వెళ్ళటానికి ఇప్పుడు రెండు దారులు ఉన్నాయండి. ఒకటి పహల్గాం ద్వారా, రెండు బాల్టాల్ ద్వారా .. ....బాల్టాల్ ద్వారా గుహ దగ్గర. .... ,పహల్గాం నుండి గుహ దూరమే కానీండి పహల్గాం రూట్ ట్రెడిషనల్ రూట్ అట. మేము ఈ రూట్ ద్వారానే వెళ్ళాము.........


. అమర్నాధ్ గుహ ముఖ ద్వారం దగ్గరదగ్గర రెండు అంతస్తుల మేడ అంత ఎత్తు ఉంటుంది. గుహలోపల చాలా విశాలముగా ఉంటుంది .అమరనాధుని రూపం చక్కగా ఏర్పడిందండి. . క్యూలో దర్శనం అయ్యాక ప్రక్కకువచ్చి గుహలో ఎక్కువసేపే ఉన్నాము.


గుహలో చాలా భాగం బండ రాళ్ళతో పరిచారండి. కాళ్ళ క్రింద చాలా చల్లగాఉంటుంది. గుహలో అంత చల్లగా ఉన్నా ఒక రాతి పలక దగ్గర మాత్రం చాలా చాలా వేడిగా ఉంటుందట. విషయంఅక్కడి వారికి కూడా చాలామందికి తెలియదని ఒక పుస్తకములో చదివాను. కానీ తీరా అక్కడికి వెళ్ళాక విషయమేమర్చిపోయాను.  

ఇలాంటప్పుడు ఏమని అనిపిస్తుందంటేనండీ మనం ఎంత తాపత్రయపడినా మనకు ఎంత ప్రాప్తమోఅంతే ప్రాప్తిస్తుందని. మేము కేవలం దైవ భక్తితో మాత్రమే కాక లౌకికపరమైన కోరికలతో కూడా యాత్రలుచేశాములెండి.



ఇంకో విషయం చెప్పాలండి ..... రోజుల్లో చాలా దేవాలయాల్లో క్యూ లైన్లలో త్వరత్వరగా దర్శనంచేసుకోవాల్సి వస్తోందికదా ... మనలో చాలామందికి ఒక అలవాటుంది. గుడిలో దేవుని వద్దకు వెళ్ళగానే కళ్ళుమూసుకుని దేవునికి నమస్కరించటము చేస్తుంటాము. దీనివల్ల దైవం ముందు ఉన్న కొద్దిసమయములో దేవునిసరిగ్గా చూడలేము.
అలా కాకుండా కొద్దిసేపు దేవుని చక్కగా చూడాలి. కావాలంటే తరువాత ప్రక్కకు వచ్చికళ్ళుమూసుకుని దైవాన్ని ప్రార్దించుకోవచ్చు.  

 ఇంకో విషయం దైవదర్శనం చేసుకునేటప్పుడు వీలైనంతవరకు వేరేఆలోచనలు లేకుండా దైవదర్శనం చేసుకుంటే భగవంతుని చక్కగా చూడగలం.


అమర్నాధ్ యాత్ర కు చాలామందిఆడవాళ్ళు, చిన్నపిల్లలు కూడా వచ్చారండి. కొంతమంది కాళ్ళు సరిగ్గా లేనివాళ్ళు కూడా కర్రల సహాయంతో లేకచేతులసహాయంతో మంచులో వెళ్ళటం చూశాక మాకు ఏమనిపించిందంటేనండి .... మాదీ ఒక భక్తేనా అని... వాళ్ళుఅంత కష్టపడుతూ కూడా యాత్ర చేస్తున్నారు కదా అని.


అక్కడి పర్వతాలలోని నీరు మినరల్ వాటర్ కన్నా చాలాస్వచ్చంగా ఉంటుంది. శ్రీ బాబా అమర్ నాధ్ యాత్రా, మాతా వైష్నవీ దేవీ యాత్రలు జీవితంలో అధ్బుతమయినయాత్రలు. నేనయితే జన్మలో చూస్తానని ఎప్పుడూ అనుకోలేదండి. ఏదో భగవంతుని దయ అంతే. నేను మాకుదగ్గరలోని దేవాలయానికే ఎప్పటినుంచో వెళ్ళలేకపోతున్నాను



. అయితే ఇలాంటి యాత్రలు కుదిరితే వెళ్ళటము మంచిదేకాని కొన్ని కారణాలవల్ల కుదరనప్పుడు మనం బాధ పడకూడదు. ఏమంటే తీర్ధయాత్రలు చేసి దైవపూజ చెయ్యటంఎంతగొప్పో, మన మనస్సులో, ఇంట్లో దైవ పూజ చెయ్యటం కూడా అంతే గొప్ప.
నిజమయిన భక్తునికి హృదయంలోనే భగవంతుడు కొలువై ఉంటాడట.


భగవంతుని నిజరూపదర్శనం, స్వప్నదర్శనం పొందిన గొప్ప వాళ్ళు ఎంతోమందిఉన్నారు.
కావలసింది దైవం నందు ప్రేమభక్తి మాత్రమే. ..... ...........

 

2 comments:

  1. నిజమయిన భక్తునికి హృదయంలోనే ఆభగవంతుడు కొలువై ఉంటాడట.

    చాలా చక్కగా చెప్పారు.

    ReplyDelete
  2. చాలా కృతజ్ఞతలు సార్.

    ReplyDelete