అందరికి నా నమస్కారములు అండి. ఇంతకు ముందు రాసిన వ్యాసం గురించి ఒక బ్రదర్ కామెంట్స్ రాస్తూ ధర్మ బధ్ధ సుఖములు అంటే ఏమిటి అని అడిగారండి. నేనేమో నాకేదో పెద్ద పాండిత్యం ఉన్నట్లు దాని గురించి రాస్తూ ...ఇతర ప్రాణులను బాధ పెట్టకుండా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలగటం అనేవి ధర్మబధ్ధమైన సుఖములు" అని కూడా రాశానండి.
కానీ తరువాత ఆలోచిస్తే నేను రాసినది సరయినదిగా నాకు అనిపించలేదు. మనము ఆహారం కోసం మొక్కలనయినా బాధపెడతాము కదా అనిపించింది. అంటే ధర్మంలో కూడా హింస ఉంటుందా....ఇలా ఎన్నో ఆలోచనలు...
ఈ ఆలోచనలు మీతో చెప్పాలని ఇలా రాస్తున్నానండి . ధర్మం గురించి పెద్దలు అనంతకాలముగా ఎన్నోవిధాలుగా చెబుతూనేఉన్నారు. వర్ణాశ్రమధర్మములు, కులధర్మములు, .... ఇలా ఎన్నోరకముల ధర్మములు ఉన్నాయి. ధర్మము యుగమును బట్టి మారుతుంది. ధర్మం సందర్భమును బట్టికూడా మారుతుంది.
ధర్మబధ్ధమైన సుఖములు అంటే పెద్దలు చెప్పిన ధర్మం ప్రకారం కర్మలను చేస్తూ సుఖాలను అనుభవించటం. ఇతరులు ఏపని చేస్తే మనము బాధపడతామో దానిని సాధ్యమయినంతవరకు ఇతరుల పట్ల చెయ్యకపోవటం. ఇతర ప్రాణులను సాద్యమైనంతవరకు బాధపెట్టకుండా మాత్రమే మనము సంతోషాన్ని పొందగలగటం ఇలా ....... ఇందులో ఒక్కోసారి కొంచెము హింస ఉంటుంది. అంటే ఆహార సంపాదన, ,ఇలాంటి కొన్ని సందర్భములలే..హింస ఉంటుంది..........
..మరి హింస లేకుండా ధర్మం ఉండదా? ఉంటుంది... దాని పేరే పరమధర్మం ...... అంటే పరమాత్మ.
మరి హింస లేని ధర్మబధ్ధ సుఖం ఉండదా....ఉంటుంది దానిపేరే పరమ ధర్మబధ్ధసుఖము ....... అంటే పరమాత్మను పొందటం. .
ఇలాంటిదే ...ఇంద్రుడు,దేవతలు నిజముగా అమరులు కాదట. వారు మానవులు కన్నా అధిక ఆయుఃప్రమాణము కలవారు కాబట్టి మాత్రమే వారిని అమరులు అంటారట. .పరిపూర్ణమైన అమరత్వం లేకపోలేదు....చింతామణి గృహంలో నివసించే శ్రీ మన్మహాదేవుడు శ్రీ మన్మహాదేవి (పరమాత్మ) అమరులు.
ఇంకా ఇలా అనిపించిందండి. ..... ధర్మబధ్ధ సుఖములో హింస ఉండే అవకాశం ఉంది. .
,1. హింస లేని ధర్మం పేరు ......... పరమ ధర్మం ......... అంటే పరమాత్మ.
2. హింస లేని ధరబధ్ధసుఖము పేరే...... పరమధర్మబధ్ధసుఖము. ....... అంటే పరమాత్మను పొందటమే ........ పరమ ధర్మబధ్ధ సుఖం. .
పరమాత్మ పరిపూర్ణులు.....పరమాత్మతత్వం పరిపూర్ణతత్వం. ఎవరయినా పరిపూర్ణత్వమును, ఏమాత్రము దుఃఖము లేని పరిపూర్ణసుఖమును పొందాలనుకుంటే మాత్రం ఆ పరమాత్మను పొందటము ద్వారా మాత్రమే అది సాధ్యము. దానినే మోక్షము అంటారేమో. అందుకే మన పెద్దలు మోక్షమునకు అంత ప్రాధాన్యతని ఇచ్చారు...
ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పాలండి. తల్లి పిల్లలకు ఆడుకోవటానికి బొమ్మలను,. ఇస్తుంది. పిల్లవాడు తోటి పిల్లలతో ఆటలలోపడి తల్లిదండ్రులు పిలిచినా వెళ్ళడు. అలా ఆడగా,ఆడగా తనకే విసుగు కలిగి ఒక్కసారి అన్ని ఆటలను, తోటిపిల్లలను వదిలి అమ్మానాన్నను చేరుతాడు. అలాగే జీవులు కూడా ఎన్నోజన్మలు గడవగా,గడవగా ఒక్కసారి విసుగు పుట్టి ఆ జగన్మాతాపితరులను చేరుకుంటారు.
ఆ జగన్మాతాపితరులు తమ బిడ్డలు త్వరగా ఒకజన్మలోనే తమ వద్దకు రావాలని కోరుకుంటారు. కొందరు ఒక్క జన్మలోనే పరమాత్మను పొందుతారు. కొందరికి ఎన్నోజన్మలు పట్టవచ్చు. సరి అయిన దారిలో నడిచిన పిల్లలు త్వరగా ఇల్లు చేరుతారు. దారి తప్పిన పిల్లలు ఆలస్యముగా ఇల్లు చేరుతారు. ఏది ఏమైనా అందరికి ఇల్లు చేరటం తప్పనిసరి..
జగన్మాతాపితరులను అంటే పరమాత్మను పొందటమే అన్ని జీవులకు పరమావధి, పరమధర్మం, పరమధర్మబధ్ధసుఖం. దీనినే మోక్షము అంటారేమో తెలియదండి..
ధర్మబధ్ధజీవితముతో నిష్కామముగా జీవితములను గడిపిన ఎందరో మహానుభావులు చరిత్రలో ఉన్నారు. అందులో గృహస్థులు, సాధువులు, సన్యాసులు ,యోగులు ఇలా అన్ని వర్గములవారు ఉన్నారు.
శ్రీశ్రీమహావతార్ బాబాజీ గారు ,శ్రీశ్రీ లాహిరీ మహాశయులను ఆదర్శ గృహస్థ యోగికి నిర్వచనమని తెలిపారు. శ్రీషిర్డి సాయిబాబా గారు గొప్ప మహానుభావులు. ఇంకా హిమాలయములలో ఎందరో యోగులు తపస్సు చేస్తూ ఉంటారంట. వారు తమ తపస్సును లోక కల్యాణానికి కూడా వినియోగిస్తారంట..
.నేను రాసిన చాలా విషయములు భగవంతుని దయవలన, పెద్దల నుండి నేర్చుకున్నవేనండి....
నేను గత రెండు రోజులనుండి కొన్ని కారణముల వల్ల నెట్ కూడా చూడలేదండి. ఈ వ్యాసం రాయటానికి నేను పొందిన కొన్ని అనుభూతులకు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకోవటం తప్ప ఏమి చెయ్యగలను ..... అంతా ఆ భగవంతుని దయ.. .. తప్పులను ఆ భగవంతుడు క్షమించాలని కోరుకుంటున్నాను. ... ఈ సంవత్సరం అమర్ నాధ్ యాత్ర గురించి ప్రకటించారండి. అది అధ్బుతమయిన యాత్ర.......
దైవం.. జీవుల యొక్క బొమ్మలను తయారుచేసి, వాటికి ప్రాణం పోసి ..జగన్నాటకం లో పాత్రలుగా ప్రపంచంలోకి పంపటం జరుగుతుందని అనిపిస్తుంది.
ReplyDeleteఈ జగన్నాటకంలో పాత్రలుగా ఆటలు ముగిసిన తరువాత అన్ని జీవులు తమ స్వస్థలమైన దైవం వద్దకు చేరాలి.
జీవుల స్వస్థలం దైవసన్నిధే. ఎవరికైనా తమ స్వస్థలానికి.. తమ ఇంటికి వెళ్ళటం ఆనందదాయకమే.