

ఈ విషయం చెప్పాలని ఎప్పటినుండో అనుకుంటున్నానండి. ఇది సుమారు అయిదు సంవత్సరముల క్రిందట జరిగింది.
అప్పట్లో మేము చెన్నైలో ఉండేవాళ్ళమండి. మా ఫ్రిజ్ లో ఎప్పుడు అందరికిలానే అయిస్ ఫార్మ్ అవుతుంది. కానీ ఒకసారి అయిస్ పెద్ద ఆకారములో దగ్గరదగ్గర శ్రీ అమర్‌నాధ్ శివలింగం ఆకారములో ఏర్పడిందండి. డీప్ ఫ్రిజ్లో నీరు బొట్లుబొట్లుగా పడుతూ రెండు ఆకారములు ఏర్పడ్డాయి. ముందు నేను గమనించలేదు. తర్వాత చూసి ఆశ్చర్యపోయామండి. ఒక ఆకారానికి ముఖము లాగ కూడా అనిపిస్తోంది.
. ప్రక్కన వాళ్ళకు చూపిస్తే ఫొటోస్ తియ్యమని సలహా ఇచ్చారు. కొన్నాళ్ళు తరువాత ఆ అయిస్ కరిగించి నీరు శ్రీ పిడారి నవశక్తి కాళీ అమ్మన్ అమ్మవారి గుడిలోని చెట్టు మొదట్లో పోశానండి. గుడివారికి ఈ విషయములు చెప్పలేదండి. ఈ ఫ్రిజ్లోని అయిస్ తో ఏర్పడ్డ ఆకారములను కొందరికి మాత్రమే చూపించామండి. అంటే అసలే రోజులు బాగాలేదు కదా ఎవరికయినా చెప్పినా నమ్మకపోగా మేమే ఇలా అయిస్ తో ఏర్పాటు చేశామని అన్నా అంటారు. ఎందుకొచ్చిందని ఊరుకున్నామండి.
కానీ తరువాత ఏమనిపించిందంటే భగవంతుని కి సంబందించిన వింతలు ఇతరులుకు కూడా చూపిస్తే మంచిది కదా అని. అలా కొందరికి ఫోటోస్ ను మెయిల్ చేశాము. ఈ ఫోటోస్ ను చూస్తే నాకు కొంచెము బాధగా అనిపిస్తుంది ఎందుకంటేనండి. అప్పుడు వీడియో తీయించుకోలేకపోయాము. వీడియోలో అయితే బాగా కనిపిస్తుంది కదా... ఇప్పుడు మాకు వీడియో కెమెరా ఉంది కానీ అలా మళ్ళీ ఏర్పడలేదు. . . . . .నేను అయితే ఇది అద్భుతం అనుకుంటాను. .
ఇది సహజంగానే అలా ఏర్పడిందండి. ఇక నమ్మటం నమ్మకపోవటం ఎవరి ఇష్టం వాళ్ళది. .ఆ భగవంతుని దయవలన క్రితం సంవత్సరం మేము ,పిల్లలతో శ్రీ అమర్ నాధ్ జీ యాత్ర, శ్రీ వైష్ణవీ దేవి అమ్మవారి యాత్రలు చేసి వచ్చామండి. ..... . ....




subham
ReplyDeletebagundandi manchu lingam
ReplyDeleteకృతజ్ఞతలు సార్.
ReplyDeleteకృతజ్ఞతలమ్మా
ReplyDelete