koodali

Friday, June 11, 2010

సుఖాలు అనుభవించే కొద్దీ.....పుణ్యక్షయం...................కష్టాలు అనుభవించే కొద్దీ....పాపక్షయం......

 
నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. అదే మరి.. నా వ్యాసాలను చదివి ఎవరయినా బాధ పడ్డారేమోనని కొంచెము ఫీలయ్యాను. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలలోను మంచివారు, దైవభక్తులు, సాటి ప్రజలయదు దయగలవారు చాలామంది ఉంటారు గదా.... వీళ్ళందరూ నన్ను అపార్ధము చేసుకోకూడదని ........... నా అభిప్రాయములు వ్యవస్త గురించె గాని వ్యక్తుల గురించి కాదని దయచేసి గ్రహించగలరు.


మన వ్యవస్ధ ఇలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు సంపద ప్రభుత్వం దగ్గర కొంత భాగం, మిగతా ప్రజల అందరి వద్దా సమానంగా ఉండాలి.ఇప్పుడేమో ప్రభుత్వం, ప్రజల వద్ద కన్నా ప్రైవేట్ కంపెనీల వద్ద ఎక్కువ ఉంటోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే విధంగా ప్రజల సంక్షేమం చూడగలదు?


ఇవన్నీ ఆలోచించి పాత కాలం నాయకులు జమీందారీ వ్యవస్త రద్దు, భూపరిమితి చట్టం ఇలా చాలా చేశారు. ఇప్పుడు దానికి వ్యతిరేకముగా జరుగుతోంది.

ఇలా పేదరికం పెరిగిపోటానికి ఎన్నో కారణాలున్నాయి.


ప్రజలలో కూడా లగ్జరీస్ అంటే వ్యామోహం బాగా పెరిగిపోయింది. అవన్నీ తీర్చటం అంటే ప్రభుత్వానికయినా అసాధ్యమే. ప్రాధమిక అవసరాలు తీరని చాలామంది ఉన్నారు.ప్రభుత్వం ముందు వాటికి ప్రాముఖ్యం ఇవ్వాలి.


నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. శ్రీ దేవీ భాగవతములో ఇలా చెప్పారండి.  దేవేంద్రుడు ఒకప్పుడు కష్టంలో ఉన్నప్పుడు , బృహస్పతి    దేవేంద్రుని    ఓదార్చిన సందర్భములో చెప్పిన విషయమిది.


విషయం గురించి ఎక్కువ వివరించే శక్తి నాకు లేదు కానీ అండి, కొంచెం చెప్పగలను. మనము సుఖములు అనుభవించేకొద్దీ మనం చేసుకున్న పుణ్యం యొక్క మొత్తం తగ్గుతూ వస్తుందట. కష్టాలు అనుభవించినప్పుడు పూర్వ జన్మలో చేసిన పాపం తగ్గుతూ వస్తుందంట. అంటే సుఖములు అనుభవించే కొద్ది వారి యొక్క పుణ్యం త్వరగా అయిపోతుంది అన్నమాట.
 

మనం ఎప్పుడూ సుఖముగా ఉండాలంటే ఎప్పుడూ ధర్మ కార్యాలు చేస్తూనే ఉండాలి. కష్టాలలో ఉన్నవారు తమ పూర్వ జన్మ పాపం తగ్గిపోతోందని తమకు తాము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరయినా ధర్మబధ్ధమైన సుఖాలు మాత్రమే అనుభవించాలి.

కొద్ది మంది మహానుభావులు సాత్విక కర్మలతోసహా అన్ని కర్మలను త్యజించి దైవం ధ్యానంలో సమాధి స్థితిలో ఉంటారంట. మహానుభావులు ఎక్కడో ఉంటారు.



తల్లి,తండ్రి చేసిన పుణ్యం,పాపం పిల్లలకు తగులుతాయంటారు. దయచేసి అందరూ తమ పిల్లల సుఖం కోసమయినా ధర్మ కార్యాలు మాత్రమే చేయ్యాలి. చెడ్డ పనులు చేసి సంపాదించిన డబ్బుతో పూజలు చేస్తే పుణ్యం రాకపోగా కష్టాలు రావచ్చని పెద్దలు చెపుతున్నారు మరి.  
 
భగవంతుడు గుడిలోనే కాదు మన యొక్కధర్మ నడవడిలో కూడా ఉంటారు అండి.
 
 

3 comments:

  1. అన్నోయ్!. అస్సల్ నువ్వేంచెప్పదల్చుకున్నవో ....

    ///మన వ్యవస్త ఇలా ఉండటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అసలు సంపద ప్రభుత్వం దగ్గర కొంత భాగం, మిగతా ప్రజల అందరి వద్దా సమానంగా ఉండాలి.ఇప్పుడేమో ప్రభుత్వం, ప్రజల వద్ద కన్నా ప్రైవేట్ కంపెనీల వద్ద ఎక్కువ ఉంటోంది. ప్రభుత్వం వద్ద డబ్బు లేకపోతే ఏ విధంగా ప్రజల సంక్షేమం చూడగలదు? ///
    దీని అర్థమేందన్నట్లు?
    కొంచెం వివరిస్తే మంచిగుండేది!

    ///మనము సుఖములు అనుభవించేకొద్దీ మనం చేసుకున్న పుణ్యం యొక్క మొత్తం తగ్గుతూ వస్తుందట. కష్టాలు అనుభవించినప్పుడు పూర్వ జన్మలో చేసిన పాపం తగ్గుతూ వస్తుందంట. అంటే సుఖములు అనుభవించే కొద్ది వారి యొక్క పుణ్యం త్వరగా అయిపోతుంది అన్నమాట.

    మనం ఎప్పుడూ సుఖముగా ఉండాలంటే ఎప్పుడూ ధర్మ కార్యాలు చేస్తూనే ఉండాలి. కష్టాలలో ఉన్నవారు తమ పూర్వ జన్మ పాపం తగ్గిపోతోందని తమకు తాము ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరయినా ధర్మబధ్ధమైన సుఖాలు మాత్రమే అనుభవించాలి.///
    ఈ ధర్మబద్దమైన సుఖాలేందో కొంచెం వివరంగా చెప్పరాదు!

    మంచి మంచి పాయింట్లు టచ్ చేస్తావుగాని, అసలువిషయం రాయకుండా, "అంతా భగవంతుని దయ!, అందరూ బాగా రాస్తారు." లాంటి వినయాలు ఎక్కువ ప్రదర్శిస్తావు.

    ReplyDelete
  2. బ్లాగ్ చదువుతున్నందుకు చాలా కృతజ్ఞతలు బ్రదర్, నా అభిప్రాయములు ఇంకా బాగా చెప్పలేకపోతున్నానని నేను కూడా అనుకుంటున్నానండి. దానికి ఎన్నో కారణాలు. ప్రభుత్వం దేశంలో అన్ని రంగాలను ఇంకా సమర్ధవంతముగా నిర్వహిస్తే బాగుంటుందని, ఇంకా ప్రజా ప్రభుత్వందగ్గర ఎక్కువ ఆస్తులు ఉంటే ప్రజల దగ్గర ఆస్తులు ఉన్నట్లే కదండి.

    ఇక ధర్మబధ్ధమైన పనులు అంటే మన పెద్దల కన్నా నేను బాగా నేను చెప్పలేనండి .మనకు ఏదయితే బాధ కలిగిస్తుందో ఆ పనిని మనము ఇతరులపట్ల చెయ్యకపోవటం ,.... ఇతర ప్రాణులను బాధపెట్టనిరీతిలో మాత్రమే మనము సంతోషాన్నీ పొందగలగటం అనేవి ధర్మబధ్ధమైన సుఖాలు నాకు తెలిసినంతవరకు బ్రదర్... ...

    ReplyDelete
  3. సారీ బ్రదర్, ధర్మబధ్ధసుఖములు అన్నదాని గురించి నేను రాసిన దానిలో కొంచెము సరిగ్గా రాయలేదనిపించిందండి. అందులో ఇతర ప్రాణులను బాధపెట్టకుండా మాత్రమే అన్నదానిలో మనము ఆహార సంపాదనకు మొక్కలను బాధపెడతాముకదా అనిపించింది. దానిని ఇలా సరిదిద్దుతున్నానండి..ధర్మబధ్ధ సుఖములు అంటే ,పెద్దలు చెప్పిన ధర్మముల ప్రకారము కర్మలు చేస్తూ సుఖముగా జీవించటం, ఇతరులు ఏపని చేస్తే మనము బాధపడతామో దానిని సాధ్యమైనంతవరకు ఇతరుల పట్ల చెయ్యకపోవటం, ఇతరప్రాణులను సాధ్యమైనంతవరకు బాధపెట్టకుండా మాత్రమే మనము సంతోషముగా జీవించటం ....వీటిని ధర్మబధ్ధ సుఖములు అంటారేమో బ్రదర్.......దీనిగురించి వివరముగా తరువాత వ్యాసములో రాశానండి.....

    ReplyDelete