koodali

Monday, June 7, 2010

ఒక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున 100 కోట్ల భారతీయులకు 1000000000000000 రూపాయల ఆస్తి (ప్రాధమిక అవసరాలు తీరటం) .

 
 
మనది పేద దేశం కాదు సిరి సంపదలు గల ఎంతో   గొప్ప  దేశం. కేవలం మన అలక్ష్యం వల్ల ఇలా ఉంది అంతే. మన సిటీల్లో చూశారా ఒక పక్కన ఆకాశాన్నంటే ఆకాశహర్మ్యాలు ,ఆ ప్రక్కనే స్లంస్ లో  మురికి గొట్టాలలో అర్ధాకలితో బ్రతుకుతున్న ప్రజలు. ఈ పరిస్తితిని మనం మార్చలేమా....ఈ ఆలోచనలు మీతో పంచుకోవాలని నా ఈ ప్రయత్నమండి.మీకు బోర్ కొట్టకుండా సాధ్యమయినంత తక్కువ పదాలతో రాయటానికి ప్రయత్నిస్తానండి.


మనం ముందు ప్రాధమిక అవసరాలయిన ఆహారం, ఆవాసం, విద్య, వైద్యం రక్షణ......ఇలాంటివాటికి బడ్జెట్లో ఎక్కువ ప్రాదాన్యాన్ని ఇస్తూ మన లగ్జరీస్ ను కొంతకాలం తాత్కాలికంగా తగ్గించుకోవాలి.


1.ఆహారం....నాకేమనీనిపిస్తుందంటే చెట్లు, మొక్కలు విస్తారంగా నాటి వాటిని రక్షించుకుంటే ఆహారకొరత ఎందుకు ఉంటుందనేది ఎప్పట్నించో అర్ధం కాని విషయం.



2.నీరు........చీమలు లాంటి చిన్న జీవులు వర్షాకాలంలో ఆహార కొరత రాకుండా వేసవిలో ఆహారాన్ని దాచుకుంటాయి.అలాంటిది మనం వర్షాకాలంలో ఊర్లు మునిగేంత వరదలు వచ్చినా వాటిని రిజర్వాయర్స్లో దాచుకును వేసవిలో వాడుకోవటానికి ఎందుకు విఫలమవుతున్నాము
.నాగార్జునసాగర్ లాంటి పెద్ద ఆనకట్టలు కట్టకుండా ఆడబ్బుతో మన రాష్ట్రం నాలుగు ప్రాంతాలయిన కోస్తా,, తెలంగాణా, రాయలసీమ, ఉత్తరాంధ్రా లలో నాలుగు మధ్యతరగతి ఆనకట్టలు కడితే బాగుండేదని నా అభిప్రాయం.



3.విద్య...ఇది అసలయిన విషయం. భుక్తికి కావాల్సిన వ్రుత్తి విద్యలు నేర్పించటంతోపాటు పిల్లలకు ధర్మం....దాన్ని పాటించటం లాంటి విషయాలు గట్టిగా నేర్పిస్తే సమాజంలో అవినీతి లాంటి సమస్యలు ఉండవు. మంచి భావి తరాల పౌరులు తయారవుతారు.
అందుకే మన పెద్దలు ధర్మానికి అంత విలువను ఇచ్చారు.



4.వైద్యం...అల్లోపతి తో   పాటు ,  ఈ రోజుల్లో మీడియాలో ఆయుర్వేదం, ఆరోగ్యం, హోమియో వీని గురించి   ఎన్నో మంచి విషయాలు ఎంతో మంది పెద్దలు చెబుతున్నారు.ఇవి తక్కువ ఖర్చుతో కూడిన గొప్ప ఫలితాలనిస్తాయి.ప్రజలు వీటిని పాటించటం నేర్చుకోవాలి.   ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం సమర్ధవంతముగా అమలుచేయాలి.



5.రక్షణ...ఇది అత్యవసరం తప్పదు కాబట్టి డబ్బు ఖర్చు గురించి భాధపడకూడదు. పొరుగు దేశాలతో సాధ్యమయినంత స్నేహ భావంతో మెలగాలి.వారికి ,మనకి మంచి బుద్ధి కలగాలని ఆ భగవంతుని ప్రార్ధించాలి. కొంతమంది ఇది చూసి నవ్వినా ఎక్కువ మంది చేసే మంచి ప్రార్ధన తప్పక ఫలిస్తుంది.



6. ఆవాసం...ఇల్లు...మన దేశం ఎంతో మురికి మయంగా అయిపోయింది. మురికి వాడలు లేకుండా వారికి ప్రభుత్వ భూములలో ఇళ్ళు కట్టించాలి. ఈ మధ్య తేలికపాటి ఇటుకలతో తక్కువ ఖర్చుతో ఇల్లు కట్టే విధానాలు వచ్చాయి.
ఊరి మధ్య   కొన్ని  కట్టడాలు  కట్టడం మాని అయినా ఆ స్థలంలో బీదలకు ఇళ్ళు కట్టివ్వాలి.  ఒకవేళ , ఊరి మధ్య ప్రభుత్వ భూములు ఖాళి లేకపోతే పేదలకు ఊరికి కొంచెం దూరంగా ఇళ్ళు కట్టి , వారు ఊరిలోకి వచ్చి పనులు చేసుకోవటానికి వీలుగా ఫ్రీ బస్, ట్రైన్ పాస్ ఇవ్వాలి.



ఇక ఇంధనానికి మనకు అపారమయిన సౌర శక్తి ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ వల్ల డబ్బు ఖర్చు ఉండదు. ఖర్చు ఎక్కువయిన ఇదే మనదేశానికి కరెక్ట్ పధ్ధతి.మనశాస్త్రజ్ఞులను తక్కువ కర్చుతో సౌరశక్తి పొందటానికి తగిన ప్రయోగాలు చెయ్యటానికి ప్రోత్సహించాలి.


ఇవన్ని జరగాలంటే డబ్బు ఎలా అన్నది అసలు సమస్య .మనదేశంలో సహజవనరుల రూపంలో అపారమయిన సంపద ఉంది
. ముందు మనమందరం ఒక లక్ష్యం ఏర్పరుచుకోవాలి. ప్రతిఒకరికి 10లక్షల రూపాయల ఆస్తి చొప్పున 100కోట్లమంది భారతీయులకు 1000000000000000 రూపాయల ఆస్తి ఏర్పరచటం. ఇది అసంభవమేమీ కాదు .నిజమే.
మన రాష్ట్రములో ఇప్పుడు కడుతున్న నీటి ప్రాజక్ట్స్ ఖర్చే ఒక లక్ష కోట్ల రూపాయలు అవుతుందని పేపర్లో చదివాను. 

 

మనదేశంలో లక్షల ఎకరాల భూమి ,  ప్రభుత్వ రంగ సంస్థలు, వ్యాపారాలు ... ఇవి అన్నీ కలిపితే   చాలా  సంపద  ఉంటుంది.
వాని పైన వచ్చే వడ్డి ని    (  ఆదాయం   )  ప్రజలకు ఒకరికి నెలకు 10వేలచొప్పున అందేటట్లు ఏర్పాటు చేసుకోవాలి.   అంటే  ,  కొంతమందికి వ్యవసాయానికి పొలం రూపంలో, కొంతమందికి వ్యాపారానికి రుణం రూపంలో, కొంతమందికి ఉద్యోగాలిచ్చి జీతం రూపంలో ..... ఆ  ఆదాయాన్ని   అందించాలి. అలా   అమ్దరికీ  పని  కల్పించాలి .


అందరికి ప్రాధమిక విద్య నిర్భంధం చేసి వ్రుత్తి విద్యలు నేర్పించాలి. ఆడవారికి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవటానికి రుణాలని ఇవ్వాలి. ఇవన్నీ సమర్ధవంతముగా చేస్తే ఒక నలుగురు ఉన్న కుటుంబానికి నెలకు 40వేల ఆదాయం వస్తుంది. నెమ్మదిగా మన లక్ష్యం పెంచుకోవచ్చు. ఇది ఆస్తి రూపంలో చూస్తే ....అవసరాల ప్రకారం చూస్తే ప్రజల ప్రాధమిక అవసరాలు తీరటం మన మొదటి లక్ష్యం కావాలి.



ఇవన్నీ సరిగ్గా అమలు జరగాలంటే స్వామి వివేకానందులవారు చెప్పినట్లు సచ్చీలత, క్రమశిక్షణ ,ప్రజాసేవే పరమావధి కలిగిన కొంతమంది వ్యక్తులు కావాలి.వీరితో ఏర్పడేవి ప్రజాకమిటీలు. వీరు ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచెయ్యాలి. 



* మనకు ప్రజాసంక్షేమ పధకాలు చాలా ఉన్నాయి. వాటిని సక్రమంగా అమలు పరచలేకపోవటం నేటి అసలు సమస్య .సామాన్య ప్రజలకు, చాలామంది చదువుకున్న వారికి కూడా ప్రభుత్వ పధకాల గురించి ఏమీ తెలియదు.ఈ ప్రజాకమిటీ సభ్యులకు వీటి గురించి శిక్షణ ఇచ్చి ప్రతి ఒక గ్రామానికి 10మంది చొప్పున, ఒక టౌంకు 100మంది, ఒక సిటీకు 1000 చొప్పున నియమించి ,ప్రభుత్వ పధకాలు సక్రమంగా పూర్తి అయ్యేటట్లు ఏర్పాటు చేయాలి. వీరికి జీతం ఏర్పాటు చేయాలి. వీరు ప్రతి కుటుంబాన్ని కలసి వారి సమస్యలు తెలుసుకుంటారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి, ప్రభుత్వ పధకాలు ప్రజలకు అందేటట్లు .......అవినీతి   లేకుండా  సమస్యలు అన్నీ తీరేటట్లు చేయటం వీరి ఉద్యోగం



 ఈ  కమిటీలు ....... అధికారులకు, ప్రభుత్వానికి ,ప్రజలకు తొందరగా సమస్యలు తీరటంలో సహాయ పడతాయి. .... శ్రీ క్రిష్ణ కమిటిలో ముగ్గురు సభ్యులే ఉన్నా ఎంతోమంది అభిప్రాయాలు కనుక్కుంటున్నారు  కదా  !.


ఇవన్ని చేస్తే తప్పకుండా కొద్దికాలంలోనే ప్రజల ప్రాధమిక అవసరాలు తీరుతాయి.

ప్రభుత్వం తన సంస్తలను ప్రైవేట్ కంపెనీల్లాగా సమర్ధవంతముగా నిర్వహించాలి. ప్రభుత్వం చేతిలో సంపద ఉంటే ప్రజలకు డబ్బు ఉన్నట్లే. ఈ మద్య బీద రైతుల నుంచి కూడా భూములు తీసుకుని సెజ్ లు పేరుతో ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నారు. .ఇది అన్యాయము. ఇలాంటి వాని వల్ల ముందుముందు ప్రజలు,ప్రభుత్వం డబ్బు లేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.



మన రాజకీయ పార్టీల వారు ప్రజల ఓట్ల కోసం ఎంతో శ్రమ పడతారు. ప్రజల కష్టాలు వారు తీరిస్తే ప్రజలు వారికి వద్దన్నా ఓటు వేస్తారు. వారిని ఎంతో ఆరాధిస్తారు ఒక వేళ ప్రజలు వారిని గుర్తించకపోయినా మంచిపనులు చేసేవారిని భగవంతుడు తప్పక మెచ్చుకుంటాడు.
భగవంతుని మెచ్చుకోలు కన్నా ఎవరికయినా కావలసినదేమూంటుంది.

ఒక్కసారి ఊహించుకోండి.... చల్లని చెట్ల వరుసలు, శుభ్రమయిన రోడ్లు, పచ్చటి పొలాలు, చెరువులతో కూడిన ఊర్లు, ధర్మ గుణం తో మంచి మనస్సు కలిగిన ప్రజలు ఇలాంటి బంగారు భారతదేశం ఎప్పుడు ఏర్పడుతుందో....

 పొరపాట్లు  ఉంటే  మంచి మనస్సుతో మన్నిస్తారని కోరుతూ....
. .......


No comments:

Post a Comment