ఏమిటో ఒకోసారి న్యూస్ చూస్తుంటె చాలా బాధగా ఉంటుంది. ప్రపంచములో అసలు ఏం జరుగుతుందో అర్ధం కావటం లేదండి.మనకు ఏమి కావాలో మనకు అర్ధం కావటం లేదనిపిస్తోంది. సైన్స్ ను కొంతమంది మిస్ యూస్ చేసినట్లే కొంతమంది స్వార్ధపరులు దేవుని పేరును,కూడా తమ స్వార్దానికి వాడుకుంటున్నారు.
ఈ మద్య నకిలీ స్వాములు వీరి గురించి వింటుంటే చాలా భాధగా ఉందండి.ఇలాంటి వారి వలన మంచి స్వాములను కూడా జనం అనుమానంగా చూడాల్సి వస్తోంది.ఇది బాధ కలిగించే విషయం. భగవంతునికి అందరు తన బిడ్డలే గదా అని జాలి ఎక్కువ . అందుకే చాలా తప్పులు చేసినా ఇంకా మారుతారేమోనని వెయిట్ చేస్తాడు ఆయన.
కొంతమంది దేవుని ఎగతాళిగా మాట్లాడుతారు. దేవుడు తన గుడిని, నగలను రక్షించుకోలేడా అని.... నగలు అవి మన ద్రుష్టిలో విలువయినవి...ఆయన బంగారు,వజ్రాల గనులే స్రుష్టించిన ఆయన. ఆయనకు ఇవి ఒక లెక్కలోనివికాదు. .
మనుషులు ఎందుకు ఇలా స్వార్దంగ ఉంటున్నారో అర్దం కావట్లేదు. వీళ్ళందరూ ఇలా చెయ్యకుండా మంచిగా ఉంటే ఎంత బాగుంటుంది!అసలు పూర్తిగా వాళ్ళను అనలేము లెండి. .రకరకాల కారణాలు వీటికి అందులో కొన్నికొంతమందికి అత్యాశ ఎక్కువ అయిపోయింది మరి. అంతులేని ఆశలతో భగవంతుని ఇబ్బంది పెట్టేస్తున్నారు
శ్రీ మహావిష్ణువు జీవుల కోసం వరాహ అవతారం, కూర్మావతారం ఇలా ఎన్నో అవతారములు ధరించారు. ఆయన శ్రీ రాముల వారుగా , శ్రీ మహాలక్ష్మీ దేవి అమ్మవారు సీతా అమ్మవారుగా ఎన్నో బాధలు అనుభవించారు.
ఈ మధ్య కొంతమంది ప్రజలలో అధిక సంపాదన, అధిక విలాసాలు పట్ల క్రేజ్ బాగా పెరిగిపోయింది. కొందరు నైతిక విలువలు పాటించకుండా దైవ పూజలు చెయ్యటం జరుగుతోంది. ధర్మం లేని పూజలు ఫలించవు. ఫలించినా తాత్కాలికమే.
సమాజం మంచిగా మారాలంటే ఎవర్నో అని ఏమి లాభమండీ. సమాజమంటే మనమే కదా. ముందు కొంతమంది ప్రజల మనస్తత్వం మారాలి.యధా ప్రజా తధా రాజా అనేది నేటి మాటేమో మరి. ఎవరయినా బాధపడితే దయచేసి క్షమించండి.
. ఇక కొంతమంది భయంకరమయిన దయ్యాలు,భూతాలు,ఇలాంటివాటితో రచనలు, సినిమాలు, చేసి దేశం మీద వదులుతున్నారు. అవి ఎంత భయంకరంగా చూపిస్తారంటే , ఎంత గొప్ప ధీరువు అయనా సరే టప్పీమని భీరువుగా మారిపోతారు. ...
అది అంతటితో ఆగదు కదా ....... చూసినవన్నీ పదేపదే కలల్లోకి వచ్చి ఏమి చెయ్యాలో, ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏనుగు లాంటి పర్స్నలిటీస్ కూడా దగ్గరదగ్గర పీనుగులాగ మారిపోతారు. ఇక ఇలాంటి వాళ్ళను నకిలీ స్వాములు మోసం చేయటం తేలిక కదండి.
అసలే ప్రపంచములో అందరూ సవాలక్ష కష్టాల్లో ఉన్నారు. ఇలాంటప్పుడు ఇలా భయపెట్టడం న్యాయమా! పూర్వం కూడా ఇలాంటి సినిమాలు వచ్చిన ఇంత భయంకరముగా తీయలేదు కదా . సమాజం పైన ఇంత ఎఫ్ఫెక్ట్ ఉండదు ..ఇలా తియకపోతే బాగుండు మనం ఏమి చెయ్యగలం .పైన భగవంతుడు ఉన్నాడు.
అసలు మన పెద్దలు ఆడవాళ్ళకు గొప్పగొప్ప పూజలు చేయనవసరం లేకుండా .....దేవుని పూజ చేయటానికి కావలసినవి భర్తకు సమకూర్చటం , ఇలా కొన్ని సపర్యలు, సంసారం , వీటిని సరిగ్గా చూసుకుంటే చాలు .... బోలెడు పుణ్యం వస్తుందని చెప్పారు.
నోములు లాంటివి చుట్టు ప్రక్కల ఆడవాళ్ళతో
సరదాగా కలిసి మెలిసి ఉండటం , అలాగే పూజతో పాటు పుణ్యం,పురుషార్ధం వస్తాయని ఆచారములు పెట్టారు... .
..నా అభిప్రాయము ఏమిటంటే మన కష్టములు మనస్సులో భగవంతునితో చెప్పుకోవటం అన్నిటికన్నా తేలికకదా! అసలు భగవద్గీతలో ఇలా కూడా చెప్పారు... మనస్సులో భక్తి లేకుండా ఎక్కువ పూజలు చేసేవారికన్నా నిజమయిన ప్రేమ గల భక్తుడంటేనే ఆయనకు ఇష్టమని....
.ఏమైనా సమాజములో మోసాలను కష్టపడి వెలుగు లోకి తెస్తున్న అందరికి నా థాంక్స్ అండి. భగవంతుడు అందరికి సత్ బుద్ధిని ప్రసాదించాలని కోరు కుంటున్నాను ..
కొంతమంది దేవుని ఎగతాళిగా మాట్లాడుతారు. దేవుడు తన గుడిని, నగలను రక్షించుకోలేడా అని.... నగలు అవి మన ద్రుష్టిలో విలువయినవి...ఆయన బంగారు,వజ్రాల గనులే స్రుష్టించిన ఆయన. ఆయనకు ఇవి ఒక లెక్కలోనివికాదు. .
ReplyDeleteఎంత చక్కగా చెప్పారు. థాంక్స్ ఫర్ ది పోస్ట్.
థాంక్యూ సార్. అయితే ఇదంతా నా పాండిత్యమే కాదండి. పెద్దలు చెప్పినవి విని నా అభిప్రాయములు కలిపి రాస్తున్నానంతే నండి.ఈ టపాలో కొన్ని వాక్యములు సరిగ్గా ఒక వరుసలో రాయలేకపోయాను అండి.
ReplyDeleteREAL GOD JESUS ANI MEKU TELUSA BROTHER.?
ReplyDelete