koodali

Monday, May 3, 2010

మన పెద్దలు తెలివితక్కువ వారు కాదు కదా .......రెండవ భాగము... ..

 

ఫస్ట్, పోస్ట్ చదివి కామెంట్స్ రాస్తున్నందుకు థాంక్స్ అండి.


పెద్దలు అంటే మీకున్న అభిమానానికి థాంక్స్. ఇక అభివ్రుద్ధి అంటే ఇప్పుడు జరుగుతున్నది కాదు. సహజ వనరులను వాడేసి ,గత 50 ఏళ్ళుగా జరిగిన pollution అబివ్రుద్ది అని నేను అనుకోవటము లేదు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ తో ప్రపంచము ఎలా ఉందో చూస్తూనే ఉన్నారు కదా! ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వస్తువులు, a.c.లు, ఇలాంటి వాటి ద్వారా వచ్చే మీధేన్ వాయువులతో ...... ఓజోన్ పొర పాడయి పోయి.... ఇదంతా అభివ్రుద్ది అని నేను అనుకోవటంలేదు.



పచ్చని చెట్లు బదులు కాంక్రీట్ జంగిల్ ,జంతువులకు కూడా అడవులు మిగల్చటములేదు మనం. ఇంత జరిగినా ఎవరికీ మనశ్శాంతి లేదు. ఏది అభివ్రుద్ది? అని నా అభిప్రాయం.

 

ఇక మంత్రములు,అవి అంటారా రెండు రోజుల క్రితం ఒక యోగిని t.v లో చూపించారు అండి.ఆయన గత 50 ఏళ్ళుగా ఆహారం,నీళ్ళు లేకుండా బ్రతుకుతున్నారు.అది చూసి కొంతమంది సైంటిస్ట్స్ ఆయనను ఒక గదిలో పెట్టి 108 గంటలు పరీక్షించారు. ఆయన ఏమీ ఆహారం తీసుకోలేదు. అది చూసి వాళ్ళే ఆశ్చర్యపోయి ఆర్మీ వాళ్ళకు ఆ రహస్యము చెప్పమని అడగటం జరిగిందీని టి.వి.లో చెప్పారు. ఇలాటివి నేను బుక్స్ లో ఇంతకుముందు చదివాను కానీ రీసెంట్ గా జరిగిందని చెపుతున్నాను. .. ..


ఎగిరే పక్షి ని చూసి రైట్ సోదరులు విమానాన్ని కనిపెట్టారుకదా.....అలాగే భగవంతుడు స్రుష్టించిన ఇంకొకదాన్ని కాపీ కొట్టి ఎకో ఫ్రేండ్లీ టెక్నాలజీ తయారుచేసుకోవాలి మనం........

ఉదాహరణకు తామర ఆకును చూసి ప్లాస్టిక్ తయారు చెయ్యాలి అలాగ అన్నమాట.థాంక్స్ అండీ......


టెక్నాలజీ అనేది పర్యావరణము ను పాడు చెయ్యకుండా,,సైడ్ ఎఫ్ఫెక్ట్స్ లేకుండా ఉంటేనే అబివ్రుద్ది అని అందరి అభిప్రాయము.ఇప్పుడు సైంటిస్ట్స్ కూడా ఆ విధముగా పరిశోధనలు చేస్తున్నారు లెండి. సోలార్ ఎనెర్జీ ఇలాంటివి కనిపెడుతున్నారు గదా ...ఇప్పటి శాస్త్రవేత్తలు ను కూడా అందరం గౌరవిస్తున్నాము. 

 


డిల్లిలో కుతుబ్ మినార్ వద్ద 22 ఎత్తు, 98% ఇనుము తో చేసిన ఒక స్తంభం ఉందండి ..,.అది 1600 సంవత్సరములనుండి అలా బయట నే ఉన్నాకూడా , ఇంతవరకు తుప్పు (rust ) రాలేదు.ఇది ఫస్ట్ ఒక జైన్ టెంపుల్లో ఉండేదంట. ఇది 98% ఇనుముతో తుప్పు రాకుండా అప్పటి వాళ్ళు ఎలా చేశారో ...... ... ..... ఇప్పటికీ కనుక్కోలేకపోయారు..

 


ఇంకా గ్రహణము సమయములలో ఒక రకమయిన x-rays లాంటి హానికరమయిన కిరణములు రిలీజ్ అవుతాయంట. అవి పుట్టబోయే పిల్లలకు హాని చేస్తాయన్న ఉద్దేశ్యముతో మన పెద్దలు అలా భయపెట్టి ఉండవచ్చు... పిల్లలు డెలికేట్ గా ఉంటారు కాబట్టి. . 

 

నాకు పెద్ద పాండిత్యము లేదు కానీ, పెద్దలు చెప్పినవి విని ,చదివి, నాకు తోచినది రాస్తున్నాను. నాకు భయముగానే ఉంటుంది తప్పులు ఏమయినా రాస్తున్నానేమోనని. తప్పులుంటే సారీ నండి..నేను రాస్తున్నవి చదువుతున్న అందరికి,+కూడలి వారికి థాంక్స్ అండి... ..............

సార్ Rao S.Lakkaraaju గారికి నా నమస్కారములు మరియు నా థాంక్స్ అండి.....అంతా ఆ భగవంతుని దయ...........

 

No comments:

Post a Comment