koodali

Tuesday, May 4, 2010

ఈశ్వరుడు , , లోని " ఈశా " అన్న అక్షరములను తిరగవేస్తేశాఈ (సాయి)...............

 
కొంచెం సేపు క్రితం t.v లో సాయిబాబా గురించిన ప్రోగ్రాం చూశారా అండీ?గుంటూరు నుంచి ఒక ఆయన సాయి హిందూ దేవుడు కాదని,సాయి అన్న పేరు హిందు లో లేదని అంటున్నారు. ఇంకా సాయిబాబా ను హిందువులు పూజించ రాదని అన్నారు.


ఈశ్వరుడు అన్న పదములోని " ఈశా " అన్న అక్షరములు తిరగవేసి చదివితే " " 'శాఈ " ( సాయి ) అని వస్తుంది.రామాయణములో వాల్మీకి మహర్షి, మహర్షి అవ్వకముందు రామనామమును మరా,మరా.... అని పలికినట్లు.....

..సాయి మాంసము అవి తినేవారు అంటున్నారు. హిందు మతములో కూడా కొందరు దేవతలకు మాంసమును నైవేద్యముగా ఉంచుతారు. అల్లా పేరు పలుకుతారు అంటే ఆయన శ్రీరామనవమి పూజ కూడా చేయించేవారు.

హిందు,ముస్లింస్ సఖ్యత కోసం సాయి క్రుషి చేశారు. దుని కూడా వెలిగించేవారు.ఊదీ అందులోనుండే వస్తుంది కదా.....


అమర్ నాధ్ గుహ పూర్వ కాలమునుండి ఉన్నదే అయినా , ఈ కాలములో కొత్తగా ఒక ముస్లిం వారే కనుక్కున్నారు. నాకు ఏమని అనిపించిందంటే ఆ దేవుడే అన్ని మతముల వారు కలిసి ఉండాలని ఈ విధముగా సందేశము ఇచ్చారేమోనని.

అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళేవారు కూడా స్వామి స్నేహితుడుగా చెప్పబడే వావర్ అనే ముస్లిం ఆయన గుడికితప్పక వెళ్తారని అంటారు.


క్రీస్తు,క్రిష్ణుడు అనే పదములకు కూడా పోలిక కనిపిస్తుంది నాకు. ఇక ముస్లింస్ తో గొడవలంటే మనలో మనము మాత్రము బాగా విరగబడి కలిసిఉంటున్నామా....

అమర్నాధ్ గుహ దగ్గర ముస్లింస్ పూజా సామాగ్రి అమ్ముతారు. అక్కడ చాలా మతసామరస్యముగా బాగుంది.
 
నేను ఇలా వ్రాస్తున్నందుకు చాలా మందికి కోపం వస్తుందేమో. వస్తుంది లెండి. అయితే మనము మతమేమీ మారటము లేదు కదా ...మాకు సాయి అంటే నమ్మకము.

దేవుని ఏరూపములో అయినా పూజించవచ్చు. అన్ని మతముల వారు కలిసి గొడవలు లేకుండా ఉండాలి. .. .. వేరే దారి కూడా లేదు... 



2 comments:

  1. హిందూ ముస్లిం సఖ్యత అనేది హెచ్చరికలతో రాదు.కాని కానుకలద్వారా అవుతుంది.చికిత్స కంటే నివారణే మంచిది. దళితులను క్రైస్తవులుగా మారుస్తున్నారని,కుటుంబనియంత్రణ పాటించనందువల్ల ముస్లిముల జనాభా పెరిగిపోతున్నదని చాలాకాలంనుండి హిందూ నేతలు ఆందోళన చెందుతున్నారు. మతం ఏదైనా ఆర్ధికంగా మతాధిపతులకు ఉపయోగపడినట్లుగా సాధారణ ప్రజలకు ఉపయోగపడదు.నారుపోసినవాడే నీరుపోస్తాడులాంటి ఫాదర్లు,ముల్లాలు,స్వాముల మాటలు వినీ వినీ అమాయకజనం శక్తికి మించి పిల్లల్ని కని నిరుపేదలైపోతున్నారు.కాబట్టి ఒకరు లేదా ఇద్దరు బిడ్డలతో ఆపరేషన్ చేయించుకోటానికి ముందుకొచ్చిన మైనారిటీలకు హిందూ సంస్థలు,హిందువులకు మైనారిటీ సంస్థలు పదివేల రూపాయల ఆర్ధిక సహాయం కానుకగా అందజేస్తే ఈ ఫాదర్లు,ముల్లాలు,స్వాముల మాటలు లెక్కచేయకుండా అన్ని మతాలలోని నిరుపేదలు ఆపరేషన్లకు బారులు తీరి నిలబడతారు.దేశంలో అధికజనాభా సమశ్య కూడా కొద్దిగా తగ్గుతుంది.ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే వారిదే విజయం,పుణ్యం కూడా.పుణ్యం ఎలాగంటే మనిషి కష్టాలన్నిటికీ పుట్టుకే గదా కారణం?అసలు ఎన్నో కష్టాలకు కారణ భూతమైన పుట్టుకే కలుగకుండా ఎంతోమందికి ఆపరేషన్ల ద్వారా ముక్తిని మోక్షాన్ని ప్రసాదించటం ఎన్నో పుణ్యస్థలాల సందర్శన చేసినంత మహాపుణ్యం.ఈ పనికి పూనుకునే పుణ్యాత్ములకు మోక్షసిద్ధి ఖాయంగా కలుగుతుంది.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete