అందరికి నా నమస్కారములు అండి.నేను నాకు తోచింది రాస్తున్నాను కదా....సున్నితమయిన విషయములు రాసేటప్పుడు మరి చాలా జాగ్రత్తగా ఉండాలి నేను.
మీ అందరికి నా అభ్యర్ధన ఏమిటంటేనండీ నేను రాసే వాటిలో తప్పులు దయచేసి చెబితే సరిదిద్దుకుంటాను. అందుకు నేను ఏమీ భాధ పడను. నాకూ విషయము తెలుస్తుంది. నా రాతల వలన ఎవరికీ హాని జరగకూడదని నా అభిప్రాయము.
ఇక నిన్న సాయిబాబా వారి గురించి నేను అలా ఎందుకు రాశానంటే జగదీశా, బృహదీశా....ఈశాన్యము...ఇలాంటి పదములలోని ఈశా శబ్దము తిరగవేసి చదివితే సాయి అన్న పదము రావచ్చనిపించి అలా రాశాను.
నాకు ఒకోసారి ఏమని అనిపిస్తుందంటే మనకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు గదా...అలాగే వాళ్ళతో పాటు ఇతర మతముల వారి దేవుళ్ళను కూడా మనలో కొందరము ఒకోసారి పూజిస్తూ ఉంటాము.

మేము అమర్‌నాధ్ యాత్రకు వెళ్ళినప్పుడు మన దేవుళ్ళతో పాటు అల్లాకు కూడా మనస్సులో దండము పెట్టుకున్నాను. ఇలాంటివి ఎవరి ఇష్టము వారిది లెండి.
మాకు తెలిసినవారి ఇంట్లో మన దేవుళ్ళతో పాటు ఏసు క్రీస్తు బొమ్మ కూడా ఉంది. శ్రి రామక్రిష్న పరమహంస వారు కూడా ఒకసారి ఇంకొక మతగురువు గారి తో కలసి ఆధ్యాత్మిక విషయములు చర్చించారు అని చదివినట్లు గుర్తు.
ఆలయములలో,చర్చిలలో పెళ్ళిళ్ళు ,ఫంక్షన్స్ జరిగేటప్పుడు అన్ని మతముల వారు వెళ్తారుగదా.ఇలాంటి వాటి వలన మతసామరస్యము పెరగవచ్చు.కడప లోని పెద్ద దర్గాకు హిందూ మతము లోని ఎంతో మంది వెళ్తున్నారు.
ఇంతకీ నా అభిప్రాయము ఏమిటంటేనండీ మన దేశమును మనము గౌరవించినట్లు మన మతమును మనము గౌరవించాలి. అలాగే అన్ని మతముల వారు ఇతర మతములను గౌరవించాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఆ భగవంతునికే తెలియాలి.
ఇంతకీ నా అభిప్రాయము ఏమిటంటేనండీ మన దేశమును మనము గౌరవించినట్లు మన మతమును మనము గౌరవించాలి. అలాగే అన్ని మతముల వారు ఇతర మతములను గౌరవించాలి. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో ఆ భగవంతునికే తెలియాలి.
అలాగే భగవంతుడనే శక్తి ఒకటే కాబట్టి వేరే మతము లోనికి మారటము అనవసరము..
No comments:
Post a Comment