koodali

Monday, May 10, 2010

ఆ దైవం పైన మన సంపూర్ణ విశ్వాసము ఒక వైపు....ప్రపంచము లోని సమస్త లౌకిక విజ్ఞానము ఒక వైపు.

 
శాస్త్రవేత్తలు ఏదయినా కొత్తది కనిపెడితే పేటెంట్ చేసుకుంటారు కదా అండి.ఈ స్రుష్టి ఆ భగవంతుని creation దీనిపై సర్వహక్కులూ ఆయనవే.ఇందులోని పదార్దములతో మనము కొత్త వస్తువులను కనిపెట్టి దేవుడు అని ఎవరూ లేరు అనటం అన్యాయము.
మనము నమ్మకపోయినా ఆయన ఏమీ అనుకోడు కానీ గొప్ప వాళ్ళ దగ్గరకు వెళ్తే మనకే మంచి జరుగుతుంది.వాళ్ళ నుంచి దూరం వెళ్తే మనకే నష్టం. లౌకిక విజ్ఞానము తెలిసిన వాళ్ళకన్నా ఏమీ తెలియకపోయినా భగవంతుని నమ్మినవారే ఎక్కువ సుఖముగా ఉంటారని నా అభిప్రాయము....
శ్రీ దేవీ భాగవతము లో గొప్ప విషయములు చెప్పారు..




గత 100 సం:నుంచి పుట్టిన మన కన్నా తెలివిగలవాళ్ళు ఇంతకుముందు పుట్టలేదని కొంతమంది అభిప్రాయము.కొన్ని వేల సం; క్రితం మనకన్నా తెలివి గలవాళ్ళు పుట్టి ఏ అణు యుద్దాల వల్లో ఆ సంస్క్రుతి అంతరించి పోయిఉండవచ్చు.మనవేద మంత్రములలో విజ్ఞానము దాగిఉందని పెద్దలు చెప్పగా ఒక యోగి ఆత్మ కథ లో చదివాను.శ్రీశ్రీ మహావతార్ బాబాజీ,శ్రీశ్రీలాహిరీ మహాశయ,శ్రీశ్రీ స్వామిశ్రీ యుక్తేశ్వర్ గారు ,శ్రీశ్రీయోగానంద గారు వీరు అంతా గొప్ప జ్ఞానులు.ప్రాచిన కాలంలో టెలిపతి వంటి విద్యలు ఉన్నాయని వారు చెప్పారు.. .



మన పురాణములలో అభిమన్యుడు తల్లి కడుపులో ఉండగానే పద్మవ్యూహం గురించి విన్నాడంటే అందరూ కట్టుకధలన్నారు.ఇప్పుడు నూతన శాస్త్రవేత్తలు కనుగొన్నాక ఇప్పుడు చాలామంది ప్రెగ్నెంట్ తల్లులు నమ్మి మ్యుసిక్ క్లాసెస్ కు వెళ్తున్నారు. పురాణములలో కొందరు తల్లులు పిండములను కుండలలో పెంచారంటే అన్ని అబద్ధములే అన్నాము.ఈనాడు టెస్ట్ ట్యూబ్ పిల్లల ప్రోసెస్ అలాంటిదే గదా.మన సంగీతమును ఎగతాళి చేశాము.ఇప్పుడు మ్యూశిక్ ధెరఫీలు వచ్చాయి.



మనము విమానం కనిపెట్టకముందే పక్షులు గాలిలో ఎగురుతున్నాయి.చేపలు నీళ్ళలో ఈదుతున్నాయి.పూర్వ కాలంలో టెలిపతి(దూరశ్రవణం)ఎక్కడో ఉన్నవాళ్ళను చూడటం ఇవి మన మహర్షులకు, వచ్చు. సాయిబాబా కూడా ఇవి చేశారు.మహాభారతములో సంజయులవారు కూడా ఒక ఉదాహరణ.పైన చెప్పిన వాటిని ఎలా ఎగతాళి చేశారో ముందుముందు వీటిని కనుక్కుంటారు.వేదములు...కంప్యూటర్ గురించి డా;రేమెళ్ళ అవధానులు గారు లాంటి పెద్దలు బాగా చెబుతున్నారు. .



ఇంకో ఆశ్చర్యకరమయిన విషయం చెప్పనా అండీ.నేను బ్లాగ్ లో రాయాలని వరాహ అవతారములో వరాహస్వామి చంపిన రాక్షసుని పేరు హిరణ్యాక్షుడా,హిరణ్యకశిపుడా అన్నది నాకు గుర్తు రాలేదు.ఇంతలో t.vలొ సాయి బాబా వారి గురించి మహర్షిగారి ప్రోగ్రాం చూస్తున్నాను.అందులో ఆయన ప్రహ్లాదుని వారి తండ్రి పేరు చెప్పటం జరిగింది. ...


ఇవ్వాళ ఉదయం శ్రీ లలితే!నమోస్తుతే కార్యక్రమములో కూడా హిరణ్య కశిపుని ప్రసక్తి వచ్చిది.ఇంకా నేను పురాణములలో ఏదయినా సంఘటన టెలిపతికి సంభందించినది గుర్తు వస్తే బాగుండునని ఆలోచించాను నిన్న, పెద్దలు ఇదే కార్యక్రమములో లలితా అమ్మవారి నామముల గొప్పతనం వివరిస్తూ అందులో చతుష్‌షష్టి కళలను గురించి , అందుకు ఉదాహరణముగా మహాభారతములో సంజయులవారు దూరము నుండి యుద్ధమును విని,చూసి ధ్రుతరాష్ట్రుల వారికి ఎలా వివరించి చెప్పారో చెప్పారు...ఈనాటి t.v,మరియు ఫోన్ లాగ అన్నమాట.. అని నేను అనుకున్నాను. ..

ఈ రెండు సంఘటనలు నాకు చాలా ఆశ్చర్యమును,ఆనందమును కలుగచేశాయి.అంతా ఆ భగవంతుని దయ .


దయచేసి ఈనాటి శాస్త్రవేత్తలు కొందరు దేవుడు లేడన్న వాదన వదిలేసి గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాలో ఆలోచిస్తే పుణ్యం చేసిన వాళ్ళవుతారు....అలాగే మీరు ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ తయారు చేస్తే బాగుంటుంది ...

8 comments:

  1. >>ఈ స్రుష్టి ఆ భగవంతుని creation దీనిపై సర్వహక్కులూ ఆయనవే.ఇందులోని పదార్దములతో మనము కొత్త వస్తువులను కనిపెట్టి దేవుడు అని ఎవరూ లేరు అనటం అన్యాయము.<<

    వ్యాసానికి చక్కటి ప్రారంభం.

    >>దయచేసి ఈనాటి శాస్త్రవేత్తలు కొందరు దేవుడు లేడన్న వాదన వదిలేసి గ్లోబల్ వార్మింగ్ నుంచి ప్రపంచాన్ని ఎలా కాపాడాలో ఆలోచిస్తే పుణ్యం చేసిన వాళ్ళవుతారు....అలాగే మీరు ఎకో ఫ్రెండ్లీ టెక్నాలజీ తయారు చేస్తే బాగుంటుంది.<<

    చక్కని ముగింపు. థాంక్స్ ఫర్ ది పోస్ట్

    ReplyDelete
  2. మీరు ఈ పోస్ట్ చదివినందుకు చాల చాలా థాంక్స్ సార్ .

    ReplyDelete
  3. నేను ఈ మాత్రం అభిప్రాయములు చెప్పగలగటం ఆ భగవంతుని దయ. ఇందులో తప్పులను దయ చేసి ఆ దైవం క్షమించాలి. మీరు కూడా అందరూ బాగా రాస్తున్నారు అండి.

    ReplyDelete
  4. చక్కగా వ్రాశారు.కొనసాగించండి

    ReplyDelete
  5. This comment has been removed by the author.

    ReplyDelete
  6. మీరు ఈ పోస్ట్ చదివినందుకు చాలా చాలా థాంక్స్ సార్. అంతా ఆ భగవంతుని దయ. మీరు భగవంతుని గురించి వ్రాసే రచనలు చక్కగా ఉంటాయండి.

    ReplyDelete
  7. Nice topic Telepathy, వేదాలలో సైన్స్ ఉంది,నమ్ముతాను, బలమైన ఆధారాలు కావాలి. మన విమానశాస్త్రం ద్వారానే పాచ్యాత్తులు వైమానిక టెక్నాలజీని డెవలప్ చేశారంటారు.

    ReplyDelete
  8. Nice topic Telepathy, వేదాలలో సైన్స్ ఉంది,నమ్ముతాను, బలమైన ఆధారాలు కావాలి. మన విమానశాస్త్రం ద్వారానే పాచ్యాత్తులు వైమానిక టెక్నాలజీని డెవలప్ చేశారంటారు.

    ReplyDelete