koodali

Thursday, May 6, 2010

మన రాష్ట్రములో నాలుగు శక్తి పీఠములు ఉన్నాయి............

 

అష్టాదశ శక్తి పీఠములలో నాలుగు శక్తి పీఠములు మన రాష్ట్రములో ఉన్నాయి. 1.శ్రీశైలం లో శ్రీ భ్రమరాంబా దేవి అమ్మవారు,2.అలంపురం లో శ్రీ జోగులాంబా దేవి అమ్మవారు, 3.ద్రాక్షారామం లో శ్రీ మాణిక్యాంబాదేవి అమ్మవారు.4.పిఠాపురం లో శ్రీ పురుహూతికాదేవి అమ్మవారు.....ఇవి అన్ని గొప్ప శక్తి పీఠములు.


.ఆ మధ్య కర్నూల్ కు వరదలు వచ్చినప్పుడు నీరు ఆలంపురం గుడి పైవరకు వచ్చాయి. దగ్గరదగ్గర నెల వరకు 5వ శక్తిపీఠము అయిన శ్రీ బాలబ్రహ్మేశ్వర స్వామిసమేత శ్రీ జోగులాంబా దేవి అమ్మవారి గుడిలో బురద శుభ్ర పరుస్తూనే ఉన్నారు, నాకు ఏమని అనిపించిందంటేనండీ దేవాలయము వారు పనులు చేయించినా , భక్తులు కూడా కొంతమంది కలిసి శుభ్రపరిచినట్లయితే చాలా ముందే గుడి ఓపెన్ అయిఉండేదేమోనని.


ఎంతసేపు మన కోరికల కోసం భగవంతుని దగ్గరకు వెళ్తాము. ఆయన కోసం మనము కొంచెము ప్రేమ చూపించలేక పోతున్నాము. అయినా ఆయన ఏమి అనుకోడు. మనకు మంచి చెస్తూనె ఉంటాడు. పాపం భగవంతుడు.


కొంతమంది నార్త్ ఇండియా నుంచి వచ్చిన భక్తులు కొన్ని రోజులు శుభ్రపరిచారని పేపర్స్ లో వేశారు.మన రాష్ట్రము వాళ్ళ సంగతి నాకు తెలియదు. నేను కూడా ఏమీ సేవ చెయ్యలేకపోయాను . భాధ అనిపించింది.శక్తి పీఠం కదా బాగా మహిమ కల గుడి..


అక్కడ రేణుక అమ్మవారి గుడి కూడా ఉంది..అక్కడ సంతానము లేని వారు సంతానము కోసము అమ్మ వారికి పూజలు జరిపిస్తారు. ,జోగులాంబా అమ్మవారి గుడికి చుట్టూ నీరు ఉన్న చిన్న కొలను ఉన్నది.అందులో అలా ఎప్పుడూ నీరు ఉండటము మంచిదని అంటున్నారు ...... గుడి చాలా బాగుంటుంది . .తుంగభద్రా నది చాలా బాగుంటుంది.అలంపురము గుడి దర్శనము చేసుకున్న తరువాత ఆ దేవుని దయవల్ల,అందరి దేవుళ్ళ దయ వలన మాకు మంచి జరిగింది. పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు. .......


ఇంకా వైజాగ్ లోశ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, విజయవాడ లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు, అందరూ ఆ ఆదిపరాశక్తి అవతారములే. ప్రపంచములోని అన్ని జీవులు ఆనందముగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను...

 

3 comments:

  1. మొన్ననే జోగులాంబ అమ్మ వారిని దర్శించి వచ్చాము. చాలా శక్తి వంతమైన అమ్మవారు. నాకు ఇంటికి వచ్చినా కూడా 2 రోజుల వరకు కళ్లల్లో మెదులుతునే ఉన్నారు.

    ReplyDelete
  2. వీలయినన్ని శక్తిపీఠాలు ఏకబిగిన చూడాలని కోరిక. చూడాలి

    ReplyDelete
  3. ఈ పోస్ట్ చదివి మీ అభిప్రాయములు చెప్పిన అందరికి మెనీ,మెనీ థాంక్స్ అండీ.

    ReplyDelete