koodali

Friday, January 19, 2018

ప్రాచీనులు అందించిన అద్భుతమైన విజ్ఞానం... ...




*భారతీయ ప్రతిభా  విశేషాలు  108  నిజాలు..
*ETERNALLY  TALENTED  INDIA  -  108 FACTS..

............అనే  పుస్తకాన్ని , మాకు  తెలిసిన  వారు   ఈ  మధ్య  మాకు    ఇచ్చారు.  ఈ  పుస్తకాన్ని  వివేకానంద  లైఫ్  స్కిల్స్  అకాడమీ , హైదరాబాద్  వారు  సమర్పించారు.    ఈ  పుస్తకంలో  ఎన్నో  గొప్ప  విషయాలు  ఉన్నాయి. 

  ప్రాచీన  భారత  దేశపు  గొప్పదనం  గురించి,  ఇంకా  ఎన్నో  విషయాలను  సేకరించి ,  ఈ  గ్రంధం  ద్వారా    అందించారు . 
........................................
పుస్తకం  లోని    కొన్ని  విషయాలు  .
.........................................

* ఈ  మధ్యకాలంలో ' స్ట్రింగ్  ధియరీ ' అనే   ఒక  నూతన  సిద్ధాంతాన్ని    శాస్త్రజ్ఞులు  ప్రతిపాదించారు.  

దీని  ప్రకారం  (' Quarks, Leptons' ) ' కణములు  ('Particles' )కాదనీ,  అవి అతి  సూక్ష్మమైన  , కంపించే  గుణం  కలిగిన  తీగల  వంటివనీ  నిర్ధారించారు. 


 ఇది  మహత్తరమైన  నక్షత్రం  నుండీ   ,  అతి  సూక్ష్మమైన  పరమాణువుల  వరకూ  వ్యాపించి  ఉందనీ  ( శుపెర్ స్త్రింగ్  )  నిర్ధారించారు.

*భారతీయ  దృక్పధం.....

* వేదం  లోని  ' శతపధ  బ్రాహ్మణం ' (  8.7.3.10 ) ఇలా  అంటున్నది. సూర్యుడు  తక్కిన  జగత్తు  ఒక  తీగ  వలే   ఉన్నవి.  ఆ ' తీగ ' యే  వాయువు.  వాయువు  అనగా  వేదార్ధంలో ' గాలి ' అని  కాదు.   'వ్యాపించినది ' అని  అర్ధం.


*భగవద్గీతలో  శ్రీ  కృష్ణ  పరమాత్మ  ఇలా  అంటారు .

'  మత్తః   పరతరం  నాన్యత్  కించిదస్తి  ధనంజయః
మయి  సర్వమిదం  ప్రోతం సూత్రేమణిగణా ఇవ  ....భ.గీ.  7-7 శ్లో.

' ఒక  సూత్రంలో  మణులు  కూర్చినట్లు  ఈ  జగత్తంతా  నాలో  ఇమిడిఉన్నది  '.    శ్రీ  కృష్ణభగవానుడు  చెప్పినట్లు  అనంతం  నుంచి  అణువు  వరకూ   జగత్తంతా  ఒక  సూత్రంలో  బంధించబడింది. 


 దీనినే  ఆధునిక  శాస్త్రవేత్తలు  నేడు  Super String  అన్నారు.


ఇలా  నక్షత్రరాశి  ప్రభావం  అతి  సూక్ష్మమైన  పదార్ధంతో  జగత్తు  నిండా  అనుసంధానించబడినప్పుడు  ,  ఆ  నక్షత్ర ప్రభావాన్ని  మన  జ్యోతిష్య  శాస్త్రం  ఏనాడో  గుర్తించి,  గ్రహించి  విశదీకరించింది  కదా  !

.........

( స్ట్రింగ్  ధియరీ ) గురించి చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే.. ఇలాంటప్పుడు సూర్యుడు, మరియు గ్రహాల ప్రభావం మానవులపై ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు.. అనిపించింది.
........................

 * "  పృధ్వి  వ్యాపస్తేజో  వాయురాకాశం  కాలోదిగాత్మా  మన  ఇతి  ద్రవ్యాణి  !    
- వైశేషికదర్శనం -

కణాద  మహర్షి    వివరించినట్టుగా  మనస్సు  - ఆత్మ  రెండూ  కూడా  ద్రవ్యములే (  Maatters ) . ఇప్పుడిప్పుడే  ఆధునిక  విజ్ఞానం,  పరిశోధనాకర్త  యొక్క  దృక్పధాన్ని  అణువిశ్లేషణలో  లెక్కలోకి  తీసుకుంటూ  ఉంది.

...................
*అగస్త్యుని  విద్యుత్  ఉత్పత్తి  విధానం..........

*యంత్రశాస్త్రం...Machine Science  of India..............

వైద్యం,   ఖగోళ  శాస్త్రం,    ఇంకా  అనేక  రంగాలలో  పలు  యాంత్రిక  పరికరాలను   ఆనాడే  ఉపయోగించారు.  అప్పటివారు విమానాలనూ  నిర్మించారు.

*గణితంలో  దిట్టలు-  భారతీయులు.....

*గురుత్వాకర్షణ  సిద్ధాంతం  కనుగొన్నది  ఎవరు  ?....Many  apples  had  fallen  before  Newton's  Gravity  Laws..........

ప్రాచీన  భారతీయ  గ్రంధాల  నిండా  గురుత్వాకర్షణ సిద్ధాంతము  గురించి  ప్రస్తావించబడి  ఉంది.   ఈ  గ్రంధాల  గురించి,  గురుత్వాకర్షణ   గురించి  వివరాలు  ఉన్న   శ్లోకాల  యొక్క  ఉదాహరణలను  ఇచ్చారు.

*సప్తవర్ణం-  భానుకిరణం....................Seven  Colours  of  Light

*కాంతివేగమును  ఎవరు  లెక్కించారు?  ...........Measuring  the  Speed  of  Light.

సాయనాచార్యులి  ఋగ్వేద భాష్యంలో .. ఋగ్వేద శ్లోకం  ద్వారా   కాంతివేగాన్ని  లెక్కించటం  గురించి  వివరంగా  తెలుసుకోవచ్చు.

 ఇలా..  ఎన్నో  విశేషాలను   ఈ  గ్రంధం  ద్వారా  అందించారు.  ఈ  పుస్తకంలోని  విషయాలను  తెలుసుకుంటే  ప్రాచీనుల  గొప్పతనం  అర్ధమవుతుంది.
...................

*ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న   అందరికి  అనేక  కృతజ్ఞతలండి.  బ్లాగ్ లో  కొత్తగా  ఎవరైనా   సభ్యులైనప్పుడు  కృతజ్ఞతగా  ఇలా  వ్రాస్తుంటాను.

 ఈ  బ్లాగును  కొత్తగా  చదువుతున్నవారికి,  ఇంతకు  ముందు   నుంచి  చదువుతున్నవారికి,  అగ్రిగేటర్లకు ..... అందరికి  కృతజ్ఞతలండి.

* నాకు  తెలిసిన  విషయాలు  తక్కువ.  అయినా   ఈ  మాత్రం  వ్రాయగలుగుతున్నానంటే ,  అంతా   దైవం  దయ వల్ల, మరియు    శ్రేయోభిలాషుల  ప్రోత్సాహం  వల్ల.

**************

(Friday, September 7, 2012)

************

Friday, July 18, 2014

ఓం...భౌతిక శక్తిని మించి మరేదో శక్తి ఉందని అర్ధమవు...



 

"Matter and energy cannot be created or destroyed "......జన్మపరంపర



ఆధునికవిజ్ఞానం   Matter and energy cannot be created or destroyed "......అని  వివరించటం  జరిగింది.  ఈ  సూత్రం  ప్రకారం  చూసినా  జన్మలు,  పునర్జన్మలు  ఉండే  మాట  వాస్తవమే  అనిపిస్తుంది. 

ఉదాహరణకు...  ఎవరైనా  వ్యక్తి   యొక్క    జీవితం  ముగిసినప్పుడు ,   పంచభూతాలతో  తయారైన    శరీరం  పంచభూతాల్లో  కలిసిపోతుంది. 


 ......  మరి,  ఎన్నో  భావాలతో  కూడిన  మనస్సు  (  ఆత్మ )  ఏమవుతుంది  ?

 జీవించి  ఉన్నప్పుడు   మనిషి  మనస్సుతో  ఎన్నో  ఆలోచనలు  ( పనులు ) చేస్తాడు.  అంటే,  మనస్సు  కూడా  శక్తే  కదా  !... Matter and energy cannot be created or destroyed ...   అన్న  సూత్రం  ప్రకారం..... మరి  మరణించిన  వ్యక్తి  యొక్క  మనస్సు  ఏమవుతుంది  ?


 మనస్సు ( ఆత్మ ) మరో  శరీరాన్ని  ధరిస్తుంది.   మరో  జన్మనెత్తుతుంది.  పరమాత్మను   చేరేవరకూ  (మోక్షాన్ని  పొందేవరకూ) ఈ   జన్మపరంపర  కొనసాగుతుంది.   ఇదంతా  చూస్తే ,  ప్రాచీనులు  చెప్పినట్లు  జన్మలు,  పునర్జన్మలు   ఉన్నమాట  నిజమే  అనిపిస్తుంది.

 జన్మలు,  పునర్జన్మలు    ఉన్నప్పుడు ,  జీవికి  తాను  చేసిన  పూర్వకర్మల   ఆధారంగా    భవిష్యజన్మ    ఉంటుంది.


    జీవి  పుట్టినప్పుడు  ఆ  జీవి  యొక్క  భవిష్యత్తు  ఎలా  ఉండబోతోందో   తెలుసుకుని ,   తగిన  జాగ్రత్తలు  తీసుకోవటానికి ( వీలయినంతలో   భవిష్యత్తును  సరిదిద్దుకోవటానికి  )  జ్యోతిషం   ఉపయోగపడుతుంది.  అందుకే  దయామయులైన  దైవం,  పెద్దలు  జ్యోతిషశాస్త్రాన్ని  లోకానికి   అందించారు.


   జ్యోతిషం  నిజమా  ?  కాదా  ?  అని  ప్రపంచంలో   చర్చలు  జరుగుతుంటాయి.   దైవాన్ని  ,  వేదాలను  నమ్మని  నాస్తికులు  జ్యోతిషాన్ని  నమ్మకపోవటంలో   ఆశ్చర్యం  లేదు.

 కానీ,  దైవాన్ని  నమ్ముతాము .  అని  చెప్పేవాళ్ళలో   కూడా  కొందరు ,   జ్యోతిషం  అనేది  అబద్ధం  అనటం  బాధాకరం.

*జ్యోతిషం  వేదాంగాలలో  ఒకటి  అని    మహర్షులే   తెలియజేసారు.


జ్యోతిషం   శాస్త్రమే.   ఉదా..... ఏవిధమైన  ఆధునిక  టెక్నాలజీ  సాయం  లేకుండానే,   పంచాంగం  ద్వారా  లెక్కలువేసి  ,  ఎప్పుడో   రాబోయే  సూర్య, చంద్ర  గ్రహణాలను   సంవత్సరానికి  ముందే   చెప్పగలుగుతున్నారు  కదా  !  పంచాంగ  కర్తలు. 
 

సూర్యచంద్రుల    వంటి  గ్రహాలు,  నక్షత్రాల    ప్రభావం  మనుష్యుల  మీద  ఎలా  ఉండగలదు ? అని  కొందరు  సందేహిస్తారు.

 సూర్యుడు  కూడా  ఒక  విధమైన  నక్షత్రమేనట.  సూర్యచంద్రుల  ప్రభావం  ప్రపంచం  మీద  ఎంతో  ఉంది. 

    సూర్యుని   నుంచి  వచ్చే  సూర్యరశ్మి   వల్ల    పంటలు  పండుతున్నాయి  .సూర్యరశ్మి,  చంద్రుని  వెన్నెల  వల్ల  మొక్కలు,  వృక్షాలు    శక్తిని  పొందుతాయి. 


 ఇంకా,    సూర్యుని  వేడి తగిలితే  శరీరం    చురుక్కుమనటం,  చంద్రుని  చల్లదనం   తగిలితే  మనసుకు    హాయిగా  ఉండటాన్ని  మనం  ఫీలవుతున్నాము  కదా  !

 ఇవన్నీ    గమనిస్తే   ,   సూర్యచంద్రుల  యొక్క  ప్రభావం  మన    మీద  ఉంటుందని  తెలుస్తోంది    కదా  ! 

 చంద్రుని  వృద్ధిక్షయాలను  బట్టి  సముద్రపు  ఆటుపోట్లలో  హెచ్చుతగ్గులు  ఉండటం  అనేది  మనకు  తెలిసిన  విషయమే. 
 

  ఈ  రోజుల్లో  కొందరు   జ్యోతిష్కులకు    జ్యోతిషం  గురించి   సరైన    ప్రావీణ్యత లేకపోవటం,  సరైన  ఉపాసనా  బలం  లేకపోయినా  జ్యోతిషం  చెప్పటం  వంటి.....కొన్ని  కారణాల  వల్ల  ..జ్యోతిషం   చెప్పటంలో  తప్పులు  వస్తుండవచ్చు. అందుకు    జ్యోతిషాన్ని  తప్పు  పట్టడం ,   జ్యోతిషమే  తప్పు  అనటం  సరైన  పద్ధతి  కాదు.  


 గ్రహాలు,  నక్షత్రాలు   మానవులపై  ఎలా  ప్రభావాన్ని  చూపించగలవు  ? అని    కొందరు  ఆశ్చర్యపోతారు.  ఇలాంటి    ఆశ్చర్యకరమైన  విషయాలు  ప్రపంచంలో  ఎన్నో  ఉన్నాయి.  

ఉదా...మొక్కలు,  ఖనిజాల  నుంచి  తీసిన  రసాయన  ఔషధాలను  వాడిన  రోగుల  జబ్బులు  తగ్గటం  కూడా  ఆశ్చర్యకరమైన  విషయమే. 


మొక్కలేమిటి  ?  అవి  తింటే  మన  రోగాలు  తగ్గటమేమిటి ?  వాటికి   మనకు  ఏమిటి  సంబంధం....

  కొన్ని  రకాల  మూలికలను  కలిపి   ఔషధంగా   తీసుకుంటే   జబ్బులు  తగ్గుతాయి.  ఇదంతా  వైద్యశాస్త్రం . అని  మనకు  తెలుసు. 


 అయితే,  సృష్టిలో   ఇలాంటి  ఏర్పాటు  ఎవరు  చేసారు ? .....అని  ఆలోచిస్తే .....

*  దైవం  జీవులకు  అవసరమైన  వాతావరణం,  ఆహారం,  మొక్కలు,  పశుపక్ష్యాదులు,.....ఇలా  ఎన్నింటినో   ఏర్పాటుచేసారు. 
 

 అలాగే  జీవులకు  వచ్చే   శారీరిక,  మానసిక    అనారోగ్యాలకు  మందుగా  మూలికలను  కూడా  ఏర్పాటు చేసారు.

 ఆ  మూలికలను  ఒక  క్రమపధ్ధతిలో  కలిపితే  మందుగా  తయారయ్యే  విధానాన్ని  ఏర్పాటుచేసారు.

  ఉదా...వామును  ఉప్పును  కలిపి  తీసుకుంటే  అజీర్ణం  తగ్గుతుంది.  ఉసిరికాయ  మరికొన్ని  వనమూలికలతో  కలిపి  తయారుచేసిన   చ్యవనప్రాశ  తయారుచేసి  తింటే  జలుబు  వంటివి  తగ్గుతాయి. 


మనిషి  శరీరంతో  ఏ  మాత్రం  సంబంధం  లేని  రకరకాల  మొక్కల,  ఖనిజాల ,పదార్ధాలతో  తయారైన   రసాయనాలను   ఒక  క్రమ  పద్దతిలో  కలిపితే ,   ఆ  విధానం  వల్ల     ఔషధం    తయారయి ,  ఆ  ఔషధం  మనిషి  శరీరంపై ,  మనస్సుపై    ప్రభావాన్ని  చూపిస్తోంది  కదా  !
 

*  అలాగే   కొన్ని  గ్రహాలు,  నక్షత్రాలు  ఒక  పద్ధతిలో  ఉంటే     ఆ     విధానం వల్ల   ఏర్పడే   శక్తి    మనిషిపై     ప్రభావాన్ని  చూపిస్తుంది.

 గ్రహాలు,  నక్షత్రాలు    ఉండే    విధానం     యొక్క    ప్రభావం  ,   ఆ  సమయంలో     జన్మించిన  వ్యక్తుల   జీవితంపై  ఉండటంలో  ఆశ్చర్యం  ఏముంది. 


( స్ట్రింగ్  ధియరీ ) గురించి చదివినప్పుడు నాకు ఏమనిపించిందంటే.. ఇలాంటప్పుడు సూర్యుడు, మరియు గ్రహాల ప్రభావం మానవులపై ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు.. అనిపించింది.
..................
మనిషి    పూర్వజన్మలలో  చేసిన  కర్మలను  బట్టి  ,  అతని  జన్మసమయం  ఉంటుందని  పెద్దలు  చెబుతారు. 


జాతకం  అనేది   ఆ  వ్యక్తి  యొక్క  భవిష్యత్తు  ఎలా  ఉంటుందో  సూచన  చేస్తుంది. 

 జాతకం  లోని  సూచనలను  బట్టి   ఒకవేళ   భవిష్యత్తులో    కష్టాలు  ఉండే  సూచనలు  కనిపిస్తే ,  వర్తమానంలో  సత్ప్రవర్తనతో  జీవించటం,   ఎక్కువగా  పూజలను,     పుణ్యకర్మలను  ఆచరించటం,    ఇతరులకు   సహాయం  చేయటం ,  వంటి  పద్ధతులను  ఆచరించటం   ద్వారా ..... భవిష్యత్తులో  వచ్చే    కష్టాలను  అధిగమించే  అవకాశాలను  కూడా  పెద్దలు  తెలియజేసారు.



  సతీసావిత్రి,  మార్కండేయుడు  వంటి  వారు  పట్టుదలగా   ప్రయత్నించి  తమ   జీవితాలను  మార్చుకోగలిగారు.

జీవితం బాగుపడాలంటే దైవభక్తి, సత్ప్రవర్తన ఎంతో అవసరం. 

 ***************
 
   ఈ  విషయంలో  నా  అభిప్రాయాలను    ఇతరులకు  సరిగ్గా  అర్ధమయ్యేటట్లు    వ్రాయటం  కష్టంగానే  ఉంది.  కానీ,  అర్ధమయ్యేటట్లు  వ్రాయటానికి    వీలయినంత  ప్రయత్నించానండి..

వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించాలని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

Wednesday, August 29, 2012 

 


Wednesday, January 17, 2018

పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు........?


పరిణామక్రమంలో వానరుల నుండి మానవులు వచ్చారని భావించటం తప్పేమో అనిపిస్తుంది. 
 ప్రాచీనులు..  మనువు నుంచి మానవులు ..అని తెలియజేసారు.

రామాయణ కాలంలో ఎంతో పరిణతి చెందిన వానరుల గురించి పెద్దలు చెప్పారు.

 ఆంజనేయస్వామి  ఇప్పటికీ హిమాలయాల్లో ఉన్నారని పెద్దలు చెప్పటం జరిగింది.

రామాయణంలో చెప్పబడ్డ వానరులు దగ్గరదగ్గర మానవుల లాగే ఎంతో పరిణతి చెందినవారు. 

బహుశా ఇలాంటి వానరుల గుర్తులు చూసి ఇప్పటి శాస్త్రవేత్తలు,   మానవులు ........వానరుల నుండి పరిణామం చెందారని అనుకుంటున్నారేమో ?

మనిషి కోతి నుండి పరిణామం చెందాడని కొందరు శాస్త్రవేత్తలు అంటుంటే ......అలా పరిణామం చెందలేదని చెప్పే శాస్త్రవేత్తలు కూడా బాగానే ఉన్నారు. 


ఆధునిక శాస్త్రవేత్తల మధ్య ఎన్నో విషయాల గురించి బేధాభిప్రాయాలు ఉన్నాయి.  ఎవరి వాదాన్ని నమ్మాలి ?   
 
 1..... "AGAINST EVOLUTION "

2.......17 EVIDENCES AGAINST EVOLUTION.......అని మనం నెట్లో సెర్చ్ చేస్తే వివరాలు ఉన్నాయి.

. ఇతర గ్రహాలలో జీవులు ఉన్నారని, ఆ జీవుల ద్వారా కూడా భూమిపై జీవం ఏర్పడి ఉండవచ్చని ఈనాటి కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.



 ( ఇతర గ్రహములలో  ఉన్నవారు  పురాణేతిహాసములలో  చెప్పబడ్డ  దేవతలు,  రాక్షసులు    .......కావచ్చునని  కొందరు  భావిస్తారు.)

జీవులలో పరిణామక్రమం గురించి డార్విన్ చెప్పినది కొంత వరకు   నిజమే కావచ్చు. 


  ఏదైనా  జీవి  తను  ఉన్న  పరిసరాల  నుంచి  కొత్త  ప్రదేశానికి  వెళ్ళినప్పుడు  ఆ  కొత్త  వాతావరణానికి  తగ్గట్లు  తనను  తాను  కొద్దిగా  మార్చుకుని జీవించినప్పుడు  ఆ  జాతి  అంతరించకుండా  ఉంటుంది.

 అలా   జీవించటానికి  అనుగుణంగా   కొద్దిపాటి  మార్పులు చేర్పులు    చెందటానికి  తగ్గ  శక్తిని ,  అవకాశాన్ని   దైవం  కల్పించి  ఉండవచ్చు.

 అంతే కానీ,  మనిషి కోతినుంచి పరిణామం చెందాడని  భావించటం తప్పేమో అనిపిస్తుంది.  మనిషి  అలా పరిణామం చెందినట్లయితే ఆ పరిణామం అతి నెమ్మదిగా  శాస్త్రవేత్తలు  చెప్పే  దాని  ప్రకారం  కొన్ని  లక్షల  సంవత్సరాలు   జరిగింది కాబట్టి ,....... ఆ పరిణామక్రమాన్ని అనుసరించి వివిధ ఆకారాల్లో శిలాజాలు పెద్దమొత్తంలో లభించాలికదా ! ( అలా లభించలేదట )....అతి తక్కువ శిలాజాల.. భాగాలు మాత్రం దొరికాయట.ఇది ఆశ్చర్యం కదా ! ( ఆ శిలాజాలు మనిషివో ? చింపాంజీలవో  ? లేక  అలాంటి  వేరే  జీవులవో ? ఎవరికీ తెలుసు? ) ... మిస్సింగ్   లింక్   అంటారట.

నేను నెట్లో కొన్ని వ్యాసాలు చదివితే నాకు అర్ధమయినంతలో ఏమనిపించిందంటే ,  కోతినుంచి మనిషి పరిణామం చెందిన విషయంలో కూడా శాస్త్రవేత్తలకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. కొందరు శాస్త్రవేత్తలు కూడా మనిషి కోతినుండి పరిణామం చెందలేదు అని గట్టిగా అంటున్నారట.

శాస్త్రవేత్తలు  ప్రతిపాదించిన  చాలా  సిద్ధాంతాల  విషయంలో  వాళ్ళలో  వాళ్ళకే  భిన్నాభిప్రాయాలుంటాయి. 
ఏది నిజమో ? ఏది కాదో ?

 వీటన్నిటి బట్టి చూస్తే మనిషి కోతి నుండి పరిణామం చెందలేదని  అనుకోవచ్చు.
...................
పరిస్థితులకు  అనుగుణంగా మారటానికి జీవులకు  కొంతవరకూ  అవకాశం ఉండి  ఉండవచ్చు. 

అంతమాత్రాన,  మానవ జాతి మొత్తం వానరుల నుండి వచ్చారన్న సిద్ధాంతం మాత్రం తప్పని నా అభిప్రాయం.
.....................................
ఈ  పరిణామక్రమం  గురించి  నేను  పాత  టపాలలో  రాసాను....
.................................
 Monday, November 21, 2011
పరిణామవాదాన్ని వేరొక కోణం నుండి పరిశీలిస్తే.....

రిణామవాదం అంటే నాకు అర్ధమయింది ఏమంటే, జీవులు తమ అలవాట్లు, పరిసరాలకు అనుగుణంగా పరిణామాన్ని చెందే అవకాశం ఉందనీ,

 పరిణామసిద్దాంతం   కొంతవరకూ   నిజమే కావచ్చు.

అయితే , దైవం యొక్క సృష్టిరచన అత్యద్భుతమైనది. వారు ఒక పద్ధతి ప్రకారం జీవులను సృష్టించారు.

ముందు జీవుల మనుగడకు, ఆహారానికి అవసరమైన పద్ధతిలో సూర్యుడు, వాతావరణం మొదలైనవి , సూర్యరశ్మి ద్వారా పత్రహరితాన్ని తయారుచేసుకునే మొక్కలు, మొక్కలపై ఆధారపడి జీవించే జంతువులు ఇలాగా ...........అన్నమాట.

ఇంకా,
ఒక నదిలో ఒకేరకమైన వాతావరణం ఉన్నా కూడా ఆల్గే, దాన్ని తినే చిన్న జీవులు, కప్పలు, చేపలు, చిన్నచేపలను తినే పెద్దచేపలు ఇలా ఒక ప్రణాళిక ప్రకారం సృష్టి ఏర్పడి ఉంది.

(నదిలో ఒకే రకమైన వాతావరణం ఉన్నా కూడా జీవులన్నీ ఒకే రకంగా మారిపోలేదు మరి. )

అలాగే జీవులకు పరిస్థితులను బట్టి పరిణామం చెందే అవకాశాన్ని కూడా దైవం కల్పించారేమో ? అని కూడా అనిపిస్తుంది.

ఇంకా ఏమనిపించిందంటే , ఉదా... కొందరి భావన ప్రకారం . జీవులలో పనికిమాలిన అవయవాలు అని చెప్పుకుంటున్నవి. పనికిమాలినవి కాదేమో ?

1...ఉదా...... కొన్ని పాములకి కాళ్ళు ఉంటాయి. పాకే పాములకి కాళ్లతో ఏం పని? బల్లులకి, మొసళ్లకి ఉన్నట్టే ఉంటాయి గాని నిజానికి ఆ కాళ్లు ఆ పాముల కదలికలో పాల్గొనవు. ఇలాంటి అంగాలనే వ్యర్థ అంగాలు అంటారు. అని కొందరి అభిప్రాయం.

కానీ, కొన్ని ప్రాకే జీవులకు కదలికలో కాళ్ళు కూడా సహాయపడతాయి. అలాగే పాములకు కూడా కాళ్ళు సహాయంగా ఉండటానికి వీలుగా పరిణామం జరుగుతోందేమో?

( పాము కాళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )

2....అలాగే మోల్ అనబడే ఎలుకని పోలిన జంతువులకి చెందిన బ్లైండ్(గుడ్డి) మోల్ అనే ఉపజాతి ఒకటి ఉంది. ఇవి ఎక్కువగా కలుగుల్లో, చీకటి ప్రాంతాల్లో బతుకుతుంటాయి. వీటికి కళ్లు ఉంటాయి గాని అవి పని చెయ్యవు. వాటి మీదుగా ఓ చర్మపు పొర కప్పబడి ఉంటుంది. చూపు లేని ఈ జీవాలకి కళ్లెందుకు ? అని కొందరి అభిప్రాయం.

మోల్ అనే ( బ్లైండ్ )జంతువుకి కళ్ళెందుకు ? అనుకోకూడదు. వాటికి అవి నివసించే చీకటి ప్రాంతాల్లో కూడా చూడటానికి వీలుగా వాటికి కళ్ళు ఏర్పాటు జరుగుతోందేమో? ( గుడ్లగూబలు చీకటిలో కూడా చూడగలవు కదా ! )

( కళ్ళు వ్యర్ధ అవయవాలు కాదేమో ! )

3... అలాగే కోళ్ళకు రెక్కలెందుకు ? అని కాకుండా అవి కొద్దిగా  పైకి ఎగరటానికి సిద్ధమవుతున్నాయేమో? అనుకోవచ్చు కదా ! ( కోళ్ళు పల్లెటూళ్ళలో ఇళ్ళ మధ్యన ఉండే అతి చిన్న కాలువలను ఎగిరి దాటుతుంటాయి. )

( కోడి రెక్కలు వ్యర్ధ అవయవాలు కాదేమో !)

అందుకే వీటిని వ్యర్ధ అవయవాలు అనుకోకూడదేమో ? అనిపించింది. దైవ సృష్టి తప్పకుండా ‘ప్రతిభతో కూడిన రూపకల్పనే. ’

౪... ఈ నాటి మానవులు అభివృద్ధి పేరుతో పనులన్నీ యంత్రాలకు అప్పజెప్పి తాము సుఖపడుతున్నామనే భ్రాంతిలో ఉన్నారు.

.ఈ నాటి మానవులు చాలామంది తమ శరీరాలకు అతిగా ఇచ్చిన విశ్రాంతి వల్ల  కొన్ని తరాల తర్వాత మానవుల కాళ్ళూచేతులూ బలహీనమయిపోతాయేమో ?
( పరిణామవాదం ప్రకారం చూస్తే .....)

కాలిక్యులేటర్లూ గట్రా అతిగా వాడటం వల్ల ఆలోచనాశక్తి, జ్ఞాపకశక్తి మందగిస్తాయేమో ?

ఇంకా ఈ మధ్య మనుషుల్లో పెరిగిపోతున్న అజ్ఞానం, ఆటవిక ప్రవృత్తి చూస్తుంటే ,

మానవులలో   జంతువుల శారీరిక లక్షణాలు పెరుగుతున్నాయేమో ? ( కొందరిలో ) అనిపిస్తోంది.

ఉదా.. మానవుల్లో వ్యర్ధ భాగంగా భావిస్తున్న
coccyx ( tail bone ) గతకాలపు అవశేషం కాదేమో ?  జంతువుగా పరిణామం చెందుతున్న లక్షణమేమో ? అనిపిస్తోంది.

టాన్సిల్స్ తీసివేసిన వారిలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని కొందరు అంటున్నారు.... ఈ రోజుల్లో కొందరు డాక్టర్లు రోగం వస్తే చాలు , ఆ భాగం వేస్ట్ అంటూ కోసిపారేస్తున్నారు.

౫.... ఒక జీవి ఇంకొక జీవిగా మారటానికి ....... బోలెడుతరాలు అక్కర్లేని జీవులు కూడా సృష్టిలో ఉన్నాయి. ఉదా...సీతాకోకచిలుక.

దైవసృష్టి యొక్క గొప్పదనానికి గొప్ప ఉదాహరణ .........
సీతాకోకచిలుక.

* గగుర్పాటు కలిగించే గొంగళిపురుగు సమాధి స్థితి వంటి ప్యూపా దశ తరువాత అందమైన రంగురంగుల సీతాకోక చిలుకగా మారటం మనకు తెలుసు కదా !

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

* దైవ సృష్టి ఎప్పుడూ గొప్పదే. " ఒక యోగి ఆత్మకధ "లో ఏం చెప్పారంటే........... సర్వార్ధ సాధకమైన అనంత సంకల్పంతో అనుసంధానం పొంది బాబాజీ , మూలక అణువుల్ని , సుసంయుక్తమైన ఏ రూపంలోనైనా సాక్షాత్కరించ వలసిందిగా ఆదేశించగలరు.....అలా చెప్పబడింది.

దైవం తలచుకుంటే దేనినైనా ఏ విధంగానైనా మార్చగలరు.

దైవం ఏం చేసినా అందులో ఎన్నో అంతరార్ధాలు ఉంటాయి.

* సృష్టి గొప్ప ప్రణాళిక ప్రకారం దైవం చేత సృష్టించబడింది. అయితే పరిణామవాదాన్ని గమనిస్తే. ,జీవులకు పరిణామం చెందే అవకాశం కూడా ఇవ్వబడిందని అనిపిస్తూంది.. దైవం యొక్క సృష్టి " ప్రతిభతో కూడిన రూపకల్పనే ".


************

(Wednesday, June 13, 2012)

 

దైవం గురించి ప్రసిద్ధ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ అభిప్రాయాలుగా చెప్పబడుతున్న సంభాషణ..?

దైవం  గురించి  ప్రసిద్ధ  శాస్త్రవేత్త  ఐన్ స్టీన్  అభిప్రాయాలుగా  చెప్పబడుతున్న  సంభాషణ..?

 Professor : You are a Christian, aren’t you, son ?

Student : Yes, sir.

Professor: So, you believe in GOD ?

Student : Absolutely, sir.

Professor : Is GOD good ?

Student : Sure.

Professor: Is GOD all powerful ?

Student : Yes.

Professor: My brother died of cancer even though he prayed to GOD to heal him. Most of us would attempt to help others who are ill. But GOD didn’t. How is this GOD good then? Hmm?

(Student was silent.)

Professor: You can’t answer, can you ? Let’s start again, young fella. Is GOD good?

Student : Yes.

Professor: Is satan good ?

Student : No.

Professor: Where does satan come from ?

Student : From … GOD …

Professor: That’s right. Tell me son, is there evil in this world?

Student : Yes.

Professor: Evil is everywhere, isn’t it ? And GOD did make everything. Correct?

Student : Yes.

Professor: So who created evil ?

(Student did not answer.)

Professor: Is there sickness? Immorality? Hatred? Ugliness? All these terrible things exist in the world, don’t they?

Student : Yes, sir.

Professor: So, who created them ?

(Student had no answer.)

Professor: Science says you have 5 Senses you use to identify and observe the world around you. Tell me, son, have you ever seen GOD?

Student : No, sir.

Professor: Tell us if you have ever heard your GOD?

Student : No , sir.

Professor: Have you ever felt your GOD, tasted your GOD, smelt your GOD? Have you ever had any sensory perception of GOD for that matter?

Student : No, sir. I’m afraid I haven’t.

Professor: Yet you still believe in Him?

Student : Yes.

Professor : According to Empirical, Testable, Demonstrable Protocol, Science says your GOD doesn’t exist. What do you say to that, son?

Student : Nothing. I only have my faith.

Professor: Yes, faith. And that is the problem Science has.

Student : Professor, is there such a thing as heat?

Professor: Yes.

Student : And is there such a thing as cold?

Professor: Yes.

Student : No, sir. There isn’t.

(The lecture theater became very quiet with this turn of events.)

Student : Sir, you can have lots of heat, even more heat, superheat, mega heat, white heat, a little heat or no heat. But we don’t have anything called cold. We can hit 458 degrees below zero which is no heat, but we can’t go any further after that. There is no such thing as cold. Cold is only a word we use to describe the absence of heat. We cannot measure cold. Heat is energy. Cold is not the opposite of heat, sir, just the absence of it.

(There was pin-drop silence in the lecture theater.)

Student : What about darkness, Professor? Is there such a thing as darkness?

Professor: Yes. What is night if there isn’t darkness?

Student : You’re wrong again, sir. Darkness is the absence of something. You can have low light, normal light, bright light, flashing light. But if you have no light constantly, you have nothing and its called darkness, isn’t it? In reality, darkness isn’t. If it is, well you would be able to make darkness darker, wouldn’t you?

Professor: So what is the point you are making, young man ?

Student : Sir, my point is your philosophical premise is flawed.

Professor: Flawed ? Can you explain how?

Student : Sir, you are working on the premise of duality. You argue there is life and then there is death, a good GOD and a bad GOD. You are viewing the concept of GOD as something finite, something we can measure. Sir, Science can’t even explain a thought. It uses electricity and magnetism, but has never seen, much less fully understood either one. To view death as the opposite of life is to be ignorant of the fact that death cannot exist as a substantive thing.

Death is not the opposite of life: just the absence of it. Now tell me, Professor, do you teach your students that they evolved from a monkey?

Professor: If you are referring to the natural evolutionary process, yes, of course, I do.

Student : Have you ever observed evolution with your own eyes, sir?

(The Professor shook his head with a smile, beginning to realize where the argument was going.)

Student : Since no one has ever observed the process of evolution at work and cannot even prove that this process is an on-going endeavor. Are you not teaching your opinion, sir? Are you not a scientist but a preacher?

(The class was in uproar.)

Student : Is there anyone in the class who has ever seen the Professor’s brain?

(The class broke out into laughter. )

Student : Is there anyone here who has ever heard the Professor’s brain, felt it, touched or smelt it? No one appears to have done so. So, according to the established Rules of Empirical, Stable, Demonstrable Protocol, Science says that you have no brain, sir. With all due respect, sir, how do we then trust your lectures, sir?

(The room was silent. The Professor stared at the student, his face unfathomable.)

Professor: I guess you’ll have to take them on faith, son.

Student : That is it sir … Exactly ! The link between man & GOD is FAITH. That is all that keeps things alive and moving.

P.S.

I believe you have enjoyed the conversation. And if so, you’ll probably want your friends / colleagues to enjoy the same, won’t you?

Forward this to increase their knowledge … or FAITH.

By the way, that student was EINSTEIN.

*******************
ఐన్ స్టీన్ గారు "science without religion is lame, religion without science is blind." అని అన్నట్లుగా కూడా అంటారు.
***********

 నా అభిప్రాయం ఏమిటంటే , దైవమే అసలు   సైంటిస్ట్.

  ప్రాచీన భారతీయులు  సనాతన ధర్మ గ్రంధాల ద్వారా కూడా ఎంతో  విజ్ఞానాన్ని (సైన్స్ )అందించారు. 

*****************

(Wednesday, June 19, 2013)

 

దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం. ..




ఆధునికవిజ్ఞానం.."Matter and energy cannot be created or destroyed "....  అని  వివరించటం  జరిగింది.

 సృష్టిలోని  పదార్ధాల   రూపం  మారే   అవకాశం  ఉంది  గానీ   మూల శక్తి    నాశనం  కాదు.   

ఉదా..ఆవిరి  నీరుగా  రూపాంతరం  చెందుతుంది.  నీరు  మంచు గా  రూపాంతరం  చెందుతుంది ,  మంచు  నీరుగా,  నీరు  ఆవిరిగా  మారే  అవకాశం  ఉంది    గానీ    మూలశక్తి  ఎప్పుడూ  ఉంటుంది.

 దైవాన్ని  ఎవరూ    సృష్టించనవసరం  లేదు.   దైవం   నిత్యమూ  ఉండే  శక్తి.    దైవానికి  ఆది అంతమూ  లేదు.     మొదలైన  విషయాల   గురించి   విష్ణుచిత్తుల వారు  మరియు  ఎందరో  మహానుభావులు  తమ    అభిప్రాయాలను    తెలియజేసారు. 


  ఈ మధ్య   టీవీలో  ప్రసారమైన  ఒక    కార్యక్రమంలో   శ్రీ  సామవేదం  షణ్ముఖశర్మ  గారు   కొన్ని  విషయముల  గురించి  తెలియజేస్తూ....మర్రి  విత్తనంలో  ఉండే  శక్తి  గురించి  తెలియజేశారు.


   నిజమే,  మర్రి  విత్తనాన్ని  చూసిన  వారికి  పెద్ద  కాండము,  శాఖోపశాఖలు  కనిపించవు.  అంత  చిన్న  విత్తనంలో    మహావృక్షం    దాగుంది.

  చిన్న  విత్తనం  నుంచి  మహావృక్షం  రావటం   అనేది  సృష్టిలో  ఒక    అద్భుతం.  సృష్టిలో  ఇలాంటి  అద్భుతాలెన్నో  ఉన్నాయి.

..............

 సృష్టిలో , ఆకాశంలో ఎగిరే పక్షుల శరీరం , ఎగరటానికి తగ్గట్లుగా సృష్టించబడింది. నీటిలో ఈదే చేపలశరీరం అందుకు తగ్గట్లుగా ఉంది. 

ఇవన్నీ ఇలా ఉండాలంటే ఎంతో ఆలోచనకల శక్తికే సాధ్యం. ఆ మహాశక్తే దైవము.

ఇంత పద్దతిగా వైవిధ్యభరితమైన సృష్టిని ఏర్పాటు చేయాలంటే, ఊహాతీతమైన ఆలోచనా శక్తి గల మహాశక్తికే సాధ్యం. ఈ మహాశక్తినే ఆస్తికులు దైవం అని పిలుచుకుంటున్నారు.
..........................

ఆధ్యాత్మికవాదులు..  దైవానికి   ఆది ,  అంతమూ ..లేవు .  అని తెలియజేసారు. 

".Matter and energy cannot be created or destroyed "....... అని ఆధునిక శాస్త్రవేత్తలు చెప్పే విషయాన్ని బట్టి చూసినా .. పదార్ధం , శక్తి ..యొక్క రూపం మారుతుంది .

 అంతేకానీ, పదార్ధాన్ని, శక్తిని.. సృష్టించలేము, నశింపజెయ్యలేము....అని తెలుస్తుంది.
..........................................
 
సృష్టి ఎలా ఏర్పడింది? అనే  ప్రశ్నకు,   దైవం  వల్ల   సృష్టించబడింది.. అని  ఆస్తికులు ఖచ్చితమైన   సమాధానం  చెప్పగలరు.

సృష్టి ఎలా ఏర్పడింది?  అనే  ప్రశ్నకు, నాస్తికులు ఏమంటారంటే.. సృష్టి దానికదే ఏర్పడిందని అంటారు.

కొందరు నాస్తికులు  ఏమంటారంటే, దైవం  ఎలా ఏర్పడ్డారని  ప్రశ్నిస్తారు.

సృష్టి దానికదే ఏర్పడటం సంభవమని  వారు నమ్ముతున్నప్పుడు..  మరి, దైవం తమకు తామే ఏర్పడలేరా
ఏమిటి ..దైవానికి ఆది అంతములు లేవు. 
దైవము  ఎప్పుడూ ఉంటారు.
 ........................ 
 
ఆధ్యాత్మికవాదులు,  ఆధునిక  శాస్త్రవేత్తలు  చెప్పేదాని  ప్రకారం    ...... పదార్ధాన్ని   శక్తిని   సృష్టించలేము,  నాశనం  చేయలేము  అని ,   తెలుస్తోంది  కదా  !     ఇవన్నీ  రూపాలను  మార్చుకున్నా    కూడా   ఎప్పుడూ  విశ్వంలో   ఉంటాయని  తెలుస్తోంది.

అంటే ,  ఆద్యంతములు   లేని  ఒక  మహాశక్తి   ఎప్పుడూ   నిత్యంగా    ఉంటుందని  మనకు  తెలుస్తోంది.  ఈ  శక్తి  ఊహాతీతమైన  అద్భుతమైన  ఆలోచనా  శక్తి  కూడా  ఉన్న  శక్తి. (  ఆలోచన  కూడా  ఒక  శక్తే  కాబట్టి..  ) 


అన్ని  శక్తులూ  కలబోసిన   ఈ మహా శక్తినే  ఆస్తికులు  దైవం  అని  భావిస్తారు.  దైవానికి  అనేక  వందనములు.
.........................

 (Wednesday, January 22, 2014

దైవాన్ని ఎవరూ సృష్టించనవసరం లేదు, దైవం నిత్యం.)


Tuesday, January 16, 2018

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది....



మానవ శరీరంలో ఆక్సిజన్ (65%), కార్బన్ (18% ), హైడ్రోజన్ (10% )నైట్రోజన్ ( 3% ) కాల్షియం ( 1.5 % ),ఫాస్ఫరస్ ( 1.0% ) ,పొటాషియం, సోడియం............ఇలా ఇంకా కొన్ని ఉంటాయట. వీటన్నిటితో శరీరం తయారవుతుందట.

విశ్వం అంతా కూడా ఇలా ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి. . ఇది అంతా బౌతికశాస్త్రం...... అంతే కానీ, దైవం అనిఎవరూ లేరు అంటారు కొందరు భౌతికవాదులు.

శరీరం ఆక్సిజన్, హైడ్రోజన్ వీటితో తయారయ్యే మాట నిజమే అయినా.........ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది, ఎన్నో భావాలను కలిగి ఉంటుంది.

అలాగే,  ఈ విశ్వం ఆవిర్భావానికి మూలకారణమైన ఆ మూలశక్తి ( ఆ ఆదిశక్తి ) మనిషి కన్నా...ఎంతోఊహాతీతమైన శక్తి గల పరమశక్తి అని ఆస్తికులు నమ్ముతారు. ఆ శక్తినే వారు దైవంగా భావిస్తారు.

* కొన్ని ఎలిమెంట్స్ తో తయారయిన మానవులే ఎంతో ఆలోచనా శక్తిని కలిగి ఉన్నప్పుడు , అనంత విశ్వాన్ని , అందులోని అన్ని తత్వాలను తనలో కలిగి ఉన్న ఆ ఆదిపరమశక్తికి అనంతమైన ఆలోచనా శక్తి ఉంటుంది.


అందువల్లే ఈ సృష్టి అంతా ఒక పద్దతి ప్రకారం తయారు కాబడింది.
 

సృష్టిలో చూడండి ...... ఏది ఎలా ఉంటే బాగుంటుందో అలాగే ఏర్పడి ఉంది.

అంటే ....... ఒక పక్షి గాలిలో ఎగరాలంటే దానికి
ఎలాంటి శరీర నిర్మాణం ఉండాలో అలాగే ఉంది.


ఒక చేప నీటిలో ఈదాలంటే తోక, మొప్పలు ఎలా ఉండాలో అలాగే దాని శరీర నిర్మాణం ఏర్పాటు చేయబడి ఉంది.


మొక్కలు సూర్యరశ్మి నుంచి పత్రహరితం తయారుచేసుకోవటం ......ఇవన్నీ ఎంతో పద్దతిగా ఏర్పడి ఉన్నాయి .


పెద్దచేపకు ఆహారంగా చిన్నచేపలు... వాటికి ఆహారంగా, చిన్న ప్రాణులు, వాటికి ఆహారంగా ఆల్గే వంటివిఇలా............ ఒక పద్దతి ప్రకారం అద్భుతంగా సృష్టి రచన సాగిపోవటం చూస్తూనే ఉన్నాము.

కొందరు దేవుడు ఉంటే చూపించండి అంటారు. గాలిని మనం చూడగలమా ? కేవలం ఫీలవుతాము అంతే.


శాస్త్రవేత్తలు విటమిన్స్ గురించి చెబుతారు. అవి ఉన్నాయన్నదీ నిజమే.....A,B,C,D.. .విటమిన్స్... ..వీటిని చూడాలంటే కుదురుతుందా ?


ఒక వ్యక్తి ఉన్నాడు . అతనికి ఎందుకో మామిడిపండు అంటే ఇష్టం లేక పుట్టినతరువాత ఎప్పుడూతినలేదు. 


 దాని రుచి ఎలా ఉంటుందో అతనికి తెలియదు.

ఆ వ్యక్తి మామిడిపండును తింటున్న తన స్నేహితునితో ఇలా అంటున్నాడు.

"మామిడిపండు రుచి ఎలా ఉంటుంది " ?

" తియ్యగా ఉంటుంది. "

"తియ్యగా అంటే పంచదార లాంటి తీపి రుచా ? లేక పనస పండు లాంటి తీపి రుచా " ?

" రెండూ కాదు. పంచదార తీపి రుచి వేరు, పనసపండు తీపి రుచి వేరు, మామిడి పండు తీపి రుచివేరు. "

"అంటే ఎలాంటి తీపి " ?

"ఎలాంటి తీపి అంటే . అలా చెప్పటానికి కుదరదు. నువ్వు కూడా మామిడి పండు తింటేనే ఆ రుచి నీకుసరిగ్గా తెలుస్తుంది."

అలాగే దైవాన్ని గురించి సరిగ్గా తెలుసుకోవాలనుకొనేవాళ్ళు .......... వాళ్ళు కూడా ఆ మార్గంలో పద్దతిగా ప్రయత్నిస్తే కానీ దైవాన్ని తెలుసుకోవటం కుదరదు.

శరీరం రకరకాల ఎలిమెంట్స్ తో తయారయింది నిజమే కానీ............ అందులో ప్రాణం, చైతన్యం, బుద్ధి , మనసుఇవన్నీ ఎలా ప్రవేశించాయో మనకు తెలియదు.

ప్రాణం శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుందో ? ఎలా నిష్క్రమిస్తుందో ?

కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే  బాహ్యేంద్రియాల శక్తి సరిపోదని ,  అంతఃకరణ ద్వారా మాత్రమే తెలుసుకోగలమని పెద్దలు చెబుతున్నారు .

ప్రాచీనులు కొందరు, తపస్సు వంటి వాటి ద్వారా జీవుల పుట్టుకకుముందు, మరణానికి తరువాత జరిగేఎన్నో విశేషాల గురించి , ఇతరలోకాల గురించి ప్రాచీన గ్రంధాల ద్వారా తెలియజేసారు............ వాటి గురించి తెలుసుకునేంతస్థాయికి ఆధునిక విజ్ఞానం ఇంకా ఎదగలేదు.

........................

పూర్వం కొందరు తల్లులు పిండాలను కుండలలో ఉంచి పెంచారు.. అని ప్రాచీన గ్రంధాలలో చదివి  వెక్కిరించిన వారే ............. .నేడు టెస్ట్ ట్యూబుల లో పిండాలను పెంచడాన్ని చూస్తున్నారు.

పూర్వం అభిమన్యుడు, ప్రహ్లాదుడు వంటి వారు తల్లుల గర్భంలో ఉన్నప్పుడే ఎన్నోవిషయాలు  నేర్చుకున్నారని చదివి వెక్కిరించిన వారే ....................... నేడు విదేశాల్లో కడుపుతోఉన్న తల్లులు కొందరు,  పుట్టబోయే పిల్లల కొరకు క్లాస్ లకు వెళ్ళి పాఠాలు వినటాన్ని చూస్తున్నారు.

అందుకని నా అభిప్రాయం ఏమిటంటేనండి, మనకు తెలియని విషయాలన్నీ అభూత కల్పనలు అనటం సబబు కాదు.

ఈ భూమిపై మనకన్నా ముందు,  మనకన్నా ఎంతో గొప్ప నాగరికత కలిగి ,ఎంతో గొప్పవిజ్ఞానవంతులైన మానవులు నడయాడారేమో ?ఎవరికి తెలుసు ?

కొన్నికారణాల వల్ల ఆ నాగరికత అంతర్ధానమై ఉండవచ్చు గదా!

విశ్వం పుట్టిన ఇన్ని కోట్ల సంవత్సరాల్లో .. గత 200 సంవత్సరాల్లో పుట్టిన మానవులే గొప్పవాళ్ళు . ఈఆధునిక విజ్ఞానమే గొప్పది ..అనుకోవటం తప్పు.

...................................................................

.
టపా రాసాక నాకు ఒక ఆలోచన వచ్చిందండి. రమణ మహర్షి గారు చెప్పినట్లు....... అసలు నేను అంటేఏమిటి ? అని.


 ఆక్సిజన్ వీటితో కూడిన శరీరమా ? లేక మనసా ? లేక ? నేను అంటే అసలు ఏమిటి ? ఏమో.........

అంతా దైవం దయ ....

**********

(Friday, June 10, 2011

ఈ ఆక్సిజన్, హైడ్రోజన్ లు అన్నీ కలిసి శరీరంగా మారి ఆలోచిస్తుంది.)

 

.

Monday, January 15, 2018

అందరికి శుభాకాంక్షలు....మరి కొన్ని సంగతులు..

.
 సంక్రాంతి  పర్వదినములలో  సూర్యారాధనకు  ఎంతో  ప్రాధాన్యత  ఉన్నది. 

 సూర్యుడు  ఆరోగ్యప్రదాత. సూర్యరశ్మి వల్ల  చక్కటి  ఆరోగ్యం  చేకూరుతుంది. 

సంక్రాంతి పర్వదినముల సందర్భంగా  అందరికి  శుభాకాంక్షలండి .
 
************************
ఈ పోస్టులో క్రింద వ్రాసిన విషయాలు చాలాకాలం తరువాత ఇక్కడ వేసాను.

ఇక్కడ పోస్ట్ చాలా స్థలం ఉందని , ఇంకో టాపిక్ కు సంబంధించిన కొన్ని విషయాలను ఇక్కడ వ్రాయటం జరిగింది. 
 
 
 .......................

  * స్త్రీల సమస్యల పరిష్కారం కొరకు మాట్లాడటం మంచిది కాని, స్త్రీలు కొన్ని దుస్తులే వేసుకోవాలనే దానికి సపోర్ట్ చేసి అదేపనిగా మాట్లాడటం వల్ల స్త్రీలకు, సమాజానికి ఏం లాభం?
............................

* స్త్రీల వస్త్రధారణ గురించిన విషయం గురించి ఈ మధ్య ఒకరు ఏమన్నారంటే, ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో స్త్రీలు నగ్నంగా తిరిగినా కూడా,  అక్కడ అత్యాచారాలు జరగటం లేదని, తనకు బాగా తెలిసినట్లు చెప్పారు. 
 
అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? సమాజంలో అందరికి పైకి తెలియని విషయాలు కూడా ఉంటాయి.

అయితే, దుస్తులు చక్కగా వేసుకోవటం వల్ల అత్యాచారాలు జరుగుతున్నాయని వారి అభిప్రాయమా ఏమిటో?

దుస్తులు సరిగ్గా వేసుకుంటే మంచిదే కదా..

 ...............................
 
* ఇంకా ఏమన్నారంటే,  
 కొన్ని దేవాలయాలలో కొన్ని స్త్రీ ప్రతిమలు చాతీ భాగం కప్పుకోకుండానే ఉంటాయి. అలాగని అవి చూసి వచ్చిన వాళ్లు ఉద్రేకపడి బయటకు వచ్చి అత్యాచారాలు చేస్తున్నారా....అన్నట్లు మాట్లాడారు.  వాళ్ళ మాటలు వాళ్లు అన్నదన్నట్లు నేను రాయలేదు కానీ, అలా అన్నారు.
 

తల్లి యొక్క చీర పమిట గాలికి పక్కకు తొలగితే చూసిన మగపిల్లలు తప్పుగా అనుకోరు. వారిలో ఎలాంటి చెడుభావనలు కలగవు. దేవాలయంలో దేవతామూర్తులను చూసినా చెడుభావనలు కలగవు.

 గర్ల్ ఫ్రెండ్ లేక వేరే స్త్రీ యొక్క దుస్తులు పక్కకు తొలగితే, కొందరు మగవాళ్ళ ఆలోచనలు వేరేగా ఉండే అవకాశం ఉంది.
..............................

 చాలా దేవతామూర్తులకు చీర పమిటతో వస్త్రధారణ ఉంటుంది. కొంతమంది స్త్రీలు తలపైనుంచి కప్పుతూ ఉత్తరీయాన్ని ధరించేవారట.

చాతీభాగాన్ని కప్పుతూ ఉండే దుస్తులను స్థనపట్ట, కంచుకి అనేవారట.

 పాతకాలంలో చాలామంది స్త్రీలు చాతీభాగాన్ని వస్త్రంతో చుట్టుకునేవారట. కొందరు అలా చేయకున్నా కూడా, పమిటను భుజాల చుట్టూ కప్పుకునే పద్ధతి ఉండేది. 

దేశంలో ఇప్పటికీ అనేక విధాలైన వస్త్రధారణ, చీరలోనే అనేక పద్ధతులు ఉన్నాయి. పంజాబి డ్రెస్ ఉంది. 

కొన్ని దేవతామూర్తులను, యక్షిణుల?  చిత్రాలను అలా ఎందుకు చెక్కారో..వాటిని ఎవరు అలా చెక్కారో.. అనేక కారణాలుండవచ్చు. అవన్నీ మనకు అందరికి సరిగ్గా తెలియదు..(దేవతలకు మనుషుల్లా శరీరాలుంటాయా?) 

 ఈ విగ్రహాల విషయంలో మనకు ఇంకా అర్ధంకాని విషయాలెన్నో ఉంటాయి.
 ..................

కొన్ని విదేశాలలో కూడా మగవారి శిల్పాలు నగ్నంగా ఉన్నాయి. అందుకు అర్ధం.. అక్కడ పురుషులు నగ్నంగా ఉంటారని కాదు. ఎందుకో అలా కొన్ని శిల్పాలున్నాయి.

 నాకు తెలిసినంతలో 1200.. ఆ కాలంలో కూడా  భారతదేశానికి విదేశీయులు రావటం, ఇక్కడ వారి ప్రభావం కూడా ఉందని చదివాను..

అంతకుముందు కూడా యవనులు, ఇంకా కొందరు..భారతదేశానికి వచ్చారట. అప్పట్లో వారి ప్రభావం కూడా దేశంలో ఉంది. విదేశీప్రభావం అనేక విషయాల పై
నున్నదని చదివాను.

 ************************
* స్త్రీల వస్త్రధారణ గురించిన విషయం గురించి మాట్లాడుతూ కామెంట్లు చేసిన వాళ్లు ...ఖజురాహో శిల్పాల గురించి కూడా ఏదేదో అన్నారు......
 
నా అభిప్రాయాల ప్రకారం,  ఖజురాహో వంటి దేవాలయాలు దేశంలో ప్రతిచోటా లేవు. అవి అప్పట్లో శృంగార విషయాల గురించి ప్రజలకు తెలియటానికి, కొత్తగా వివాహమైన వారు వెళ్ళి చూసి రావటానికి, అలా అతికొద్దిగా మాత్రమే ఉన్నాయి.
 
వాటిలో కొన్ని శిల్పాలు అభ్యంతకరంగా ఉంటే..

కొన్ని 
తప్పులు చేసేవాళ్లు పాతకాలంలోనూ కొందరు ఉంటారు, ఇప్పుడూ ఉంటారు. 

ఆ రోజుల్లో అలా శిల్పాలను చెక్కమని అప్పటి రాజులు చెప్పారేమో? శిల్పాలను అలా చెక్కటం వెనుక ఎన్ని ఆలోచనలు ఉన్నాయో?  

  ******************
 * దేశం ఎంతోకాలం విదేశీపాలనలో ఉంది. విదేశీయుల ప్రభావం దేశంపైన ఉన్నది. విదేశీదాడుల తరువాత స్త్రీలను బయటకు రానివ్వని పద్ధతులు వచ్చాయని  అంటారు.
********************* 

స్త్రీలలో కొందరు శరీరభాగాలు కనబడకుండా దుస్తులు వేసుకుంటారు. కొందరు శరీరభాగాలు కనబడినా ఫరవాలేదనే విధంగా దుస్తులు వేసుకుంటారు. స్త్రీలలోనూ, పురుషులలోనూ రకరకాల మనుషులు, రకరకాల ఆలోచనలు.

మగవాళ్లలో కొందరు చెడ్దవాళ్ళు, నేరాలు చేసేవాళ్ళుంటారు. స్త్రీలలో  కొందరు చెడ్డవాళ్లు, నేరాలు చేసేవాళ్ళుంటారు.

కుటుంబాలలో, సమాజంలోను సాటి స్త్రీలను ఏడిపించేవారుంటారు. 
 
* శ్రీరామునిపై 
మోజుపడి,  సీతాపహరణ విషయంలో రావణాసురుని ప్రోత్సహించిన శూర్పణఖ స్త్రీయే.
 
  మగవాళ్లు మంచిగా ఉండాలని చాలామంది అంటారు. మగవాళ్ళు అయినా ఆడవాళ్లు అయినా మంచిగానే ఉండాలి. 

ఎవరైనా చిన్నప్పుడు అమాయకమైన వాళ్లే. తరువాత ఎన్నో కారణాల వల్ల రకరకాలుగా మారతారు.

 సమాజంలో ఇంటిపరిస్థితులు, పరిసరాలలోని వ్యక్తుల ప్రభావం,  జీవితంలో ఎదురైన సంఘటనలు,  నేర్చుకున్న విషయాలు, సోషల్ మీడియా నుంచి విన్నవి, చూసినవి..ఇలా ఎన్నో కారణాలు ప్రవర్తన పై ప్రభావాన్ని చూపిస్తాయి. 

* అమ్మాయిలు, అబ్బాయిలు అందరూ ఒకరినొకరు గౌరవించాలని చిన్నతనం నుంచి ఇంటా బయటా నేర్పించాలి.

*************************
 
ఈ రోజుల్లో సెల్ఫోన్లు వచ్చాక అందరికి చాలా విషయాలను బాగా చూడటానికి వీలు కలిగింది.అందువల్ల, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
 ....................

స్త్రీలపట్ల అత్యాచారాలు జరగకూడదు. మద్యపానము, మత్తుమందుల వాడకం, అసభ్యకర, అశ్లీలత ఉండే చిత్రాలు, దృశ్యాలు, రచనలు..వీటిపట్ల తగిన చర్యలు తీసుకోవాలి.

 అసభ్యత లేకుండా చూడటానికి సెన్సార్ బోర్డ్ ని ఏర్పాటు చేసారు. తమ లోపలి శరీరభాగాలు కనిపించేలా అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని బహిరంగంగా అందరికి కనిపించటం అసభ్యత కాదా...

సమాజంలో.. మత్తుమందులు, అసభ్యకరచిత్రాలు, రచనలు ..ఇలాంటివాటిని ఆపటానికి గట్టిచర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.   

 సమాజంలో ఎన్నో సమస్యలుండగా, స్త్రీలు అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని బయట తిరిగితే మాత్రం తప్పేమిటంటూ.... కొందరు  ప్రదర్శనలు చేయటం బాధాకరం.

 .......................

మగవాళ్ళు కూడా సంస్కారంతో ప్రవర్తించాలి. అందమైన స్త్రీ కనిపిస్తే , వాళ్లపట్ల అగౌరవంగా ఆలోచించకూడదు,  ప్రవర్తించకూడదు. స్త్రీలు కూడా సంస్కారంతో ప్రవర్తించాలి.  

మన వాళ్ళను, ఇతరులు గౌరవించాలని మనం కోరుకున్నట్లే, మనమూ ఇతరులతో గౌరవంగా ఉండాలి.

 ................. 

సమాజంలో కొన్ని సంఘటనలలో.. స్త్రీలు లైంగిక వేధింపులకు గురవుతుంటే, కొన్నిసంఘటనలలో.. వివాహితులైన స్త్రీలు, పురుషులు తాము ఇష్టపడే అక్రమసంబంధాలతో ప్రవర్తిస్తున్నారు. ఇలాంటివాటివల్ల ఎన్నోకుటుంబాల్లో గొడవలు జరుగుతాయి.

...........................

యూట్యూబ్లో కనిపించే ఆశ్లీల రచనలు ఎంతో అసభ్యంగా ఉంటాయి. మనం వాటిని క్లిక్ చేసి చూడకపోయినా, యూట్యూబ్ సెర్చ్ చేసేటప్పుడు అవి కూడా కొంతభాగం కనిపిస్తాయి... వీటిని ఆపే విధంగా కూడా గట్టిచర్యలు తీసుకోవాలి.

 
మాజానికి చెడుచేసే విధంగా ప్రవర్తించేవాళ్ళు దైవము వేసే శిక్షనుండి తప్పించుకోలేరు.
..................

ప్రజలు..పాపభీతి, నైతిక విలువలను పాటించటం వంటివి పాటించాలి..ఎంతగా మంచి చెప్పినా వినకుండా చెడ్డగా ప్రవర్తించే వారిని, తప్పులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. 

* నైతికవిలువలను పాటించే ప్రజలున్న చోట మంచిగా ఉంటుంది. 

................

 marikonni vishayaalu...

 ఈ రోజుల్లో కొందరు స్త్రీలు స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. సాటి స్త్రీలను కూడా ఇబ్బందిపెడుతున్నారు. పురుషులు కూడా తమ స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. విడాకులు ఎక్కువయ్యాయి.

అక్రమసంబంధాలు ఉన్నవాళ్ళ వల్ల.. వారిని వివాహం చేసుకున్న పురుషులు స్త్రీలు ఇద్దరికి ఇబ్బందే.  కొందరు స్త్రీలు, పురుషులు తమ అక్రమసంబంధాలకు అడ్డుగా ఉన్నారని సొంత పిల్లల్ని కూడా కొట్టిన వార్తలను విన్నాము.

 స్త్రీల పట్ల గృహహింస జరగకుండా రక్షణ కొరకు కొన్ని చట్టాలు చేసారు. అయితే, కొందరు స్త్రీలు ఈ చట్టాలను చూపి, తాము చెప్పినట్లు వినకపోతే, భర్త అత్తింటి వారిపై కేసులు పెడతామని బెదిరిస్తున్నట్లు వింటున్నాము.
 
వివాహమైన పిల్లలకు, పెద్దవాళ్ళకు  సరిగ్గా పడకపోతే , ఒకే ఇంట్లో కాకుండా పక్కపక్క ఇళ్ళలో ఉండవచ్చు...ఎవరి ప్రైవసి వారికుంటుంది. అవసరమైనప్పుడు ఒకరికొకరు సాయపడవచ్చు. అలా కుదరదు అంటే, ఒకే ఊరిలో దూరంగా ఉండవచ్చు. ఇంకా కాదంటే, వేరే ఊళ్లలో ఉండవచ్చు.

భార్యాభర్తకు పడనప్పుడు సాధ్యమైనంతలో సర్దుబాట్లు చేసుకుంటూ జీవించటానికి ప్రయత్నించాలి. పిల్లలుంటే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి.
  
 ఇంకా భరించలేని పరిస్థితి ఉంటే.. కేసులు, గొడవలు కాకుండా, మధ్యవర్తులను (సైకాలజిస్టులు..)ఉంచి మాట్లాడుకుని విడిపోవటం తప్ప ఏం చేయగలరు?

పిల్లలకు తల్లితండ్రి ఇద్దరితో కలసి ఉండాలని ఉంటుంది. పిల్లలు అమ్మనాన్నతో కలసి తమ ఇంట్లో జీవించాలనుకుంటారు. అయితే, ఈరోజుల్లో కొందరు పేరెంట్స్ విడాకుల తరువాత వేరే వివాహం చేసుకుంటున్నారు.

పిల్లలకు తల్లి దగ్గర వేరేనాన్న, తండ్రి దగ్గర వేరే తల్లి ఉంటారు. పిల్లలకు ఇది బాధగా ఉంటుంది. అయితే, పెద్దవాళ్ళ హక్కుల గురించే అందరూ మాట్లాడతారు కానీ, పిల్లల హక్కులు, వారి ఆశల గురించి ఎంతమంది తల్లితండ్రి ఆలోచిస్తున్నారు?

ఇక పిల్లలు వాళ్ల అమ్మమ్మతాత లేక నాన్నమ్మతాత లేక హాస్టల్స్లో ఉండవలసి ఉంటుంది. వాళ్లు అప్పటికే వృద్ధులు అయి వాళ్ళకు ఎక్కువ ఓపిక ఉండదు.ఇక ఆ పిల్లలను ఏం సరిగ్గా చూసుకోగలరో?

 ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఉద్యోగాల వల్ల పనివత్తిడి బాగాపెరిగింది. అలసిపోయి చిన్న మాటకే గొడవలు పెరుగుతున్నాయి. 
 
దురదృష్టం ఏమిటంటే, అమ్మాయి అబ్బాయి తరపు పెద్దవాళ్ళు కూడా కొందరు పంతాలు, పట్టింపులకు పోయి గొడవలు పెంచుతున్నారు.

 కొందరు ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కూడా ఎందుకు తగ్గాలి, ఎందుకు సర్దుకుపోవాలంటూ గొడవలు పెంచుతున్నారు. 

అప్పటివరకు పిల్లల్ని చదువులని హాస్టల్స్లో వేసిన వాళ్ళుకూడా పిల్లలకు వివాహాలు చేసాక, మా అమ్మాయి కష్టపడిపోతోందని అమ్మాయి అమ్మనాన్న, మా అబ్బాయి కష్టపడిపోతున్నాడంటూ అబ్బాయి అమ్మానాన్న వచ్చేస్తారు. 
 
పెద్దవాళ్ళయిన పిల్లల గురించి వాళ్ల తల్లితండ్రి అంత మాట్లాడుతున్నప్పుడు, తాము విడిపోతే తమ చిన్నపిల్లలు కష్టపడతారు కదా..అని విడిపోవాలని అనుకునే వాళ్లు ఆలోచించాలి కదా.

పాతవ్యవస్థలోనూ ఇప్పటి వ్యవస్థలోను కొన్ని సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి.ఇప్పడు కుటుంబవ్యవస్థ ప్రమాదంలో ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు....
కుటుంబవ్యవస్థను  బాగుచేసుకోవాలి.