koodali

Friday, September 25, 2026

ప్రాచీనులు తెలియజేసినట్లు చతురాశ్రమధర్మాలను చక్కగా పాటించి....

  •  
  •   
  • కొందరు ఎలా చెబుతున్నారంటే, లౌకికసంబంధమైన పనులు తుచ్చమైనవి కాబట్టి, వాటి గురించి ఎక్కువ ఆలోచించకూడదన్నట్లు చెబుతున్నారు. అలా అందరూ విరాగులయితే ఎలా?

     శ్రీకృష్ణులవారు అర్జునునితో.. యుద్ధాన్ని వదిలి, విరాగియై పక్కన కూర్చుని తపస్సు చేసుకొమ్మని చెప్పలేదు. యుద్ధాన్ని చేయమనే బోధించారు. 
  •  
  • మంచివాళ్లు అన్ని వదిలివేస్తే, రాజ్యం దుర్మార్గుల చేతిల్లోకి వెళ్లే ప్రమాదముంది. దైవారాధనతోపాటు ఎవరిపని వారు చక్కగా చేయటం కూడా పూజయే.
     
  •    బ్రహ్మచర్యాశ్రమంలో చక్కగా విద్యను నేర్చుకోవటం, గృహస్థాశ్రమంలో అలా పద్ధతిగా జీవించటం, వానప్రస్థాశ్రమంలో వనాలకు వెళ్లకపోయినా ఇంట్లో ఉంటూనే క్రమంగా లౌకికవిషయాలను తగ్గించుకుంటూ వైరాగ్యాన్ని పెంచుకోవటం, సన్యాసాశ్రమంలో కూడా ఇంట్లోనే ఉండికూడా, దైవముపై ఎక్కువ ధ్యాసకలిగి.. మోక్షానికి దగ్గరవటానికి  ప్రయత్నించాలి.
  •  
  • చిన్నవయస్సు నుంచే అందరూ విరాగులైపోనవసరం లేదు. ప్రాచీనులు తెలియజేసినట్లు చతురాశ్రమధర్మాలను చక్కగా పాటించి మోక్షాన్ని పొందవచ్చు.
  • ................................................. 
  • సృష్టిలో అన్నిజీవులకు అవసరమైన వాతావరణం, వెలుతురు, గాలి, నీరు, ఆహారాన్ని అందించే మొక్కలు..వీటన్నింటిని సృష్టించి ఇచ్చిన దైవము అందరికన్నా ఎంతో, మరెంతో గొప్పవారు.

  • సమాజంలో ప్రజలు చక్కగా జీవించాలంటే..వ్యవసాయం, కుటుంబానికి అవసరమైన వస్తువుల తయారి, దుస్తుల తయారి ..ఇలా ఎన్నో కావాలి. అందుకొరకు సమాజంలో అనేక వృత్తులు ఉంటాయి. ఇవన్నీ ఆలోచించి, పని విభజనలో భాగంగా పనులు చేసేవారు.


    దైవప్రీతి కొరకు..లోకహితం కొరకు ఎంతో కష్టమైనా కూడా నియమాలను పాటిస్తూ పూజలు చేసే బ్రాహ్మణులుంటారు. శత్రువులు దేశంపై దాడి చేస్తే ప్రాణాలకు తెగించి కాపాడే రాజులు, సైనికులుంటారు. తుఫాన్లు, వరదలు, పొలాలలో పాములు వంటి వాటి భయం ఉన్నాకూడా, శ్రమతో ఆహారాన్ని పండించే రైతులు,కూలీలు ఉంటారు. వ్యాపారంలో వస్తువులు పాడవకుండా సమయానికి అన్ని అందించాలంటే శ్రమ ఉంటుంది,అలా అవసరమైనవి అందరికి సరఫరా చేసే వర్తకులుంటారు.  ఏ పని చేయాలన్నా అవసరమైన పరికరాలు, వస్తువులు..ఉండాలి, ఎంతో శ్రమకోర్చి, 
    ఎంతో కష్టపడి అందరికి అన్నీ తయారుచేసి ఇచ్చే అనేక వృత్తుల వారు ఉంటారు.
  •  
  •     స్త్రీలు లేనిదే సమాజం సరిగ్గా ఉండదు. వారి శ్రమ ఎంతో విలువైనది.

  • మొక్కలు, చెట్లు మనుషులు తమ పండ్లను తెంపినా, కొమ్మలను విరిచినా ఆహారాన్ని అందిస్తాయి. సృష్టిలో ఎన్నో జీవుల శ్రమ ఉంది.  అన్ని జీవులు గొప్పవే.

  •     అంతా దైవము దయ.
  • ...................................
  •  
    సమాజంలో అందరూ రోజూ ఉపవాసాలు ఉంటూ, ఎప్పుడూ పూజలు చేస్తూ కూర్చుంటే పనులు ఎలా జరుగుతాయి. ఇవన్నీ ఆలోచించి, శూద్రులు పెద్ద ఎత్తున బోలెడు పూజలు చేయనక్కరలేదని ప్రాచీనులు తెలియజేసారు. శూద్రులు తమ స్వధర్మాన్ని చక్కగా ఆచరిస్తూ కొద్దిగా పూజలు చేసుకున్నాకూడా, చక్కటిఫలితం వస్తుందని తెలియజేసారు. ఇది బాగుంది కదా..

    అయితే, చాలామంది శూద్రులు మేము కూడా బోలెడు పూజలు చేస్తామని చేస్తున్నారు. 


     ప్రత్యేకమైన పూజలు చేయటానికి కఠినమైన నియమాలను పాటించాలంటారు. నియమాలను పాటించటంలో తప్పులు జరిగితే కష్టాలు వస్తాయంటారు.....( 
    ఇవి నేను కల్పించి చెప్పటం లేదు. సోషల్మీడియాలో కొందరు చాలా విషయాలను చెప్పి, అలా సరిగ్గా పాటించకపోతే కష్టాలు మీదపడతాయని చెపుతున్నప్పుడు భయంగానే ఉంటుంది కదా.. )
  •  అలాంటప్పుడు శూద్రులు కఠినమైన వాటి జోలికి వెళ్ళకుండా, కొంత సులభమైన దైవస్మరణ..దైవనామస్మరణ, కఠినమైన నియమాలు లేని సులభమైన పూజలు..చేసి తరించవచ్చు కదా..అని కూడా అనిపిస్తుంది. కఠినమైన వాటిజోలికి వెళ్లి కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకు..

    ఇక్కడి పూజలే చాలాఉన్నాయి, అవి సరిగ్గా చేస్తే గొప్ప.  ఇంకా  ఇతర రాష్ట్రాలవారివి కూడా తెచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు.

     మనుషుల గతకర్మలు, ఇప్పటి కర్మలను బట్టి కష్టాలుసుఖాలుంటాయి.
     పాపాలు చేయడం మాని, దైవాన్ని మనసారా ప్రార్ధిస్తే ఎప్పటికైనా దైవమే దారిచూపుతారు.
  • .....................................
  • ఈ రోజుల్లో కొందరు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు పూజలు చేస్తున్నారు. వినాయకచవితి మండపాల వద్ద రికార్డ్ డాన్సులు కూడా వేస్తున్నారట.  నిమజ్జనం జరిగిన రోజే మాంసాహారం తినటం, మద్యపానం చేస్తున్నారు.
  •  
  • ఈ రోజుల్లో పూజల్లో పద్ధతుల్లో మార్పులుచేర్పులు జరిగి, పెద్ద ఎత్తున వస్తువులు కొంటున్నారు. వ్యాపారధోరణి పెరిగిందనిపిస్తుంది. అలా బాగా వస్తువులు కొనటం ద్వారా..కొందరు వ్యాపారస్తులకు ఆదాయం బాగా వస్తుంది. శూద్రులు బోలెడు పూజలు చేయకుంటే, వస్తువులు కొనటం తగ్గి, వ్యాపారస్తులకు ఆదాయం తగ్గుతుంది.
  • ........................................
  • పాతకాలంలో శూద్రులను దేవాలయాలకు రానిచ్చేవారు కాదని కొందరంటారు. అప్పుడు ఏం జరిగిందో సరిగ్గా తెలియదు కాని, ఇప్పుడు శూద్రులు  చక్కగా దేవాలయాలకు వెళ్తున్నారు. చక్కగా దైవదర్శనం చేసుకుంటున్నారు. దేవాలయాలు భక్తులతో కళకళలాడుతున్నాయి.
  •  
  •  చాలామంది శూద్రులు దేవాలయంలో కానుకలు సమర్పిస్తున్నారు. అన్నదానానికి ధనం సమర్పిస్తున్నారు. శూద్రులు రాని దేవాలయాలను ఊహించలేము.  భక్తులు ఎక్కువమంది వస్తే కళగా ఉంటుంది.
  •    .................................
  •  marikonni vishayaalu............
  •  
  •  కొందరు చెప్పే విషయాలలో  కొన్ని విషయాలను  పాటించలేక, పాటించకపోతే కష్టాలొస్తాయేమోననే భయంతో.. కుటుంబాల్లో గొడవలవుతున్నాయి.
  •    
  • కొన్నివిషయాలను విని,  కొందరు యువత  సంసారానికి దూరమవుతారేమోనని అనిపిస్తోంది. ఉదా..ప్రతిరోజు ఏదో ఒక పూజ అయితే భార్యాభర్త సంసారం చెయ్యాలంటే భయపడేవారుంటారు. అందువల్ల, కొన్ని పండుగలు,కొన్ని సందర్భాలలో,  కొన్నిప్రత్యేకమైన పూజలప్పుడు తప్ప , మిగిలిన రోజులలో నిత్యపూజ చేసుకుని భార్యాభర్త సంసారం చేయవచ్చని బ్లాగులో రాసాను. ఇలాంటివి ఎవరిని అడగలేరు కదా..
     
  • మరికొందరు,  తమ ఇంట్లో పెద్దవాళ్లు పాటించే అతి నియమాలను..ఆ కష్టాలను చూసి విసుగొచ్చి మతానికి దూరమవుతారేమోనని కూడా అనిపిస్తోంది .ఉదా..మతాలు మారిన వారిలో కొందరు  అగ్రవర్ణాలవారు కూడా ఉన్నారు కదా..
  •  
  • అందుకే యువత కొన్ని విషయాలను  వినకుండా ఉంటే బాగుండని కోరుకునే పరిస్థితి కూడా వచ్చింది.  గ్రంధాలలోకూడా కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి. అవి కూడా బాధాకరం.

    అలా చెప్పినవారు ఎన్నో గొప్ప విషయాలను కూడా తెలియజేసారు. అందుకు వారికి ధన్యవాదములు. 
  • .................................. 
  •    నేను వ్రాసినవి చదివి కొందరికి కోపం రావచ్చు. ఇవన్నీ  వ్రాయటానికి బాధగా ఉన్నా తప్పలేదు. తప్పోఒప్పో వ్రాయాలనిపించి వ్రాసాను.
  •  .............................
  •  నాకు చాలా సందేహాలు ఉండేవి. దైవము దయవల్ల, కాలక్రమేణా ఎన్నో సందేహాలు తీరాయి.  వాటిలో చాలావాటిని బ్లాగులో వ్రాయటం జరిగింది.

    ఈ మధ్య ఒక సందేహం కలిగింది. వినాయకచవితి పుస్తకంలో, 
    శమంతకమణికధలో..శ్రీకృష్ణులవారికి జాంబవంతుడు ఉయ్యాలలో ఉన్న తన కుమార్తెను వివాహం చేసారని ఉంటుంది.  ఉయ్యాలలో చిన్నపిల్ల ..అన్నట్లు నాకు అనిపించింది.  అలా చిన్నపిల్లను వివాహం చేయడమేమిటని సందేహం కలిగింది.
  •  
    అవి యుగాలనాటి విషయాలు. కాలక్రమేణా గ్రంధాలలో ఎన్నోమార్పులుచేర్పులు జరిగి , ఆ కధలో జాంబవతి చిన్నపిల్లలా వ్రాసి ఉండవచ్చనిపించింది.

    ఇంకా  ఏమనిపించిందంటే, జాంబవతి కొంత పెద్ద అమ్మాయే అనిపిస్తుంది. పెద్దపిల్లలు ఊయల ఊగుతారు కదా..ఆ మణిని ఆ అమ్మాయి ఊయలపైన అలంకారంగా ఉంచారేమో?  కొత్తవారిని చూసి జాంబవతి, ఆమె దగ్గర ఉన్నవాళ్లు కొంచెం కంగారుపడి ఉంటారు. అరణ్యంలో ఆమె కొత్తవారిని చూడటం తక్కువకదా.. 

  •  ఆ యుగంలో అప్పటి జీవుల ఆయుర్దాయం ఎన్నో వందల సంవత్సరాలంటారు, వారి ఆకారాలు భారీగా ఉండేవట.(డైనోసార్లు కూడా ఆకారం భారీగా ఉండేవని అంటారు కదా అలా..) అప్పటి విషయాల గురించి అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు సరిగ్గా అర్ధంకాకపోవచ్చు.

     
    పిల్లలకు సందేహాలు కలిగినా పైకి చెప్పలేరు కాని, లోపల అయోమయపడతారు. అందువల్ల, పిల్లల్ని పురాణేతిహాసాలు చదవమనే కన్నా, అపార్ధాలు రాకుండా పెద్దవాళ్లు సమాధానాలు చెప్పగలగాలి.
    .....................................
     నాకు గ్రంధాలలోని విషయాల పట్ల ఇంకా కొన్ని సందేహాలు ఉన్నాకూడా, చాలా విషయాలు మనకు అర్ధం కావు. అర్ధం కానివి కొన్నయితే, ప్రక్షిప్తాలు( మార్పులు చేర్పులు)జరిగినవి కొన్ని.

     అందువల్ల, వాటిగురించి అదేపనిగా ఆలోచించటం కన్నా,  అవసరమైనంతలో కొన్ని తెలుసుకుని, అన్నింటికి మూలమైన దైవాన్ని నమ్ముకుంటే అదే గొప్ప అనిపించింది.  జీవితంలో సందేహాలను తీర్చుకోవటమే మన లక్ష్యం కాదుకదా, దైవాన్ని చేరటము ముఖ్యము.  దైవముదయ ఉంటే అన్నీ ఉంటాయి.
     
  •  
  • ఈ విషయాలను కొంత సమయం తర్వాత ఇక్కడ డిలిట్ చేస్తాను.

  • నేను ఎక్కువ పోస్టులు వ్రాయకూడదని అనుకుని కూడా,  మరల వ్రాసాను.
  • నేను పోస్ట్ వ్రాసాక, ఇలాకాకుండా ఇంకా బాగా వ్రాయాలని అనేకసార్లు మార్పులుచేర్పులు చేస్తూ ఉంటాను. అలా చేయకుండా ఉండలేకపోతున్నాను. ఇది నా బలహీనత.  ఇప్పటికే దైవముదయవల్ల తృప్తిగా ఎన్నో వ్రాయగలిగాను. ఇక బాగా తగ్గించాలి అనుకుని కూడా, అప్పుడప్పుడు రాయటం జరుగుతోంది. 
  • ..............................
  •   oka  link..
  •  కష్టాలు తీరటం..
  •  
  •  

No comments:

Post a Comment