చంద్రయాన్ విజయవంతమవటం గర్వించదగిన ఎంతో గొప్ప విషయం.
భారతదేశం ఒకప్పుడు సిరిసంపదలతో ఉండేది.ఎంతో పరిశుభ్రంగా కూడా ఉండేది. ఇప్పుడు చాలాచోట్ల చూస్తే మురికికుప్పలతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చూసి మనం సిగ్గుపడాలి. ఇండోర్ ఒకప్పుడు చాలా మురికిగా ఉండేదట. ఒక కమిషనర్ గారు కొందరు సిబ్బందితో కలసి ప్రజలను జాగృతం చేసి ఇండోర్ ను ఇప్పుడు శుభ్రమైన నగరంగా మార్చివేసారు.
భారతదేశం అంతా అలా పరిశుభ్రంగా ఎందుకు మార్చుకోలేము? విదేశాల వాళ్ళు ఎంతో శుభ్రంగా ఉంచుకుంటున్నారు. మనమెందుకు ఇలా మురికిగా ఉండాలి. అందరూ తలచుకుంటే శుభ్రంగా ఉంచుకోవటం పెద్ద విషయమేమీ కాదు.
మొదటగా కనీసం దేవాలయాల వద్ద, నదులను అయినా శుభ్రంగా ఉంచుకోవటాన్ని మొదలుపెడితే బాగుంటుంది. ఈ విషయాల గురించి పదేళ్ళ క్రితమే బ్లాగులో వ్రాసాను. ఇప్పటికీ అలాగే ఉంది పరిస్థితి. జనాల మూఢత్వం చూసి దైవానికి కూడా విసుగు వస్తోందేమో.. భారతదేశం ఇలా పేదరికంలో ఉంది. శుభ్రత ఉన్నచోట లక్ష్మీదేవి ఉంటుందని పెద్దలు తెలియజేశారు. డబ్బు కొరకు విదేశాలకు పరుగులు పెడుతున్న యువత పెరిగిపోతున్నారు. అక్కడ అంతా సుఖమే ఉండదు. విదేశాల్లో కూడా మంచి, చెడు రెండూ ఉన్నాయి.
విదేశాలకు వెళ్లిన భారతీయులు గొప్పగా ఆచారవ్యవహారాలను పాటిస్తున్నారు.. అని కొందరు అంటారు. అక్కడివారు ఎంతకాలం పాటించగలరో చెప్పలేము. ఒక తరం వరకు కొంత పాటించగలరు. అక్కడ ఈ తరంవాళ్ళు కూడా కొందరు మామూలు రోజులలో మంగళసూత్రం తీసివేసి, పండుగలు వస్తే మాత్రం శ్లోకాలు చదివి పూజలు చేయటం చేస్తుంటారు. వారి తరువాతి తరం రెండు సంస్కృతుల మధ్య నలిగిపోయి క్రమంగా మారిపోయే అవకాశం ఉంది. విదేశాల్లో ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము. సడన్ గా ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? మన ఇల్లు బాగోలేదని ప్రక్కింటికి వెళ్తామా? మన ఇంటినే మనం బాగుచేసుకుంటాము. విదేశాలకు పరుగులు మారి మనదేశాన్ని మనం బాగుచేసుకోవాలి.విదేశాలకు వెళ్లటానికి కూడా ఒక హద్దు ఉంటుంది. జనాలు వరదలా పోతామంటే అక్కడివాళ్ళే అడ్డుకట్టవేస్తారు.
ఎక్కడైనా సంపద విపరీతంగా పెరిగితే కష్టాలే. ఎంతవరకూ అవసరమో అంతవరకే అయితే మంచిది. ఎందుకంటే, ఒకప్పుడు భారతదేశం సిరిసంపదలతో తులతూగేది. మన దేశాన్ని ఆక్రమించిన విదేశీయులు ఇక్కడనుంచి ఓడలలో బోలెడు బంగారాన్ని,రత్నాలు, వజ్రాలు ఇంకా ఎన్నో విలువైన గ్రంధాలను, అవి చదవడానికి బ్రాహ్మణులను కూడా వారి దేశాలకు తీసుకెళ్ళారని గ్రంధాల ద్వారా తెలుస్తుంది. మన ప్రాచీన విజ్ఞానం గురించి ఎన్నో గ్రంధాలు ఉన్నాయి. టెక్నాలజీ, గొప్పవైద్యం, సర్జరీలు , ఇంకా ఎంతో విజ్ఞానం ఉంది..
PraveenMohan తెలుగు అనే బ్లాగ్..చూడవచ్చు.
JanakiRam.CosmicTubeChannel....చూడవచ్చు.
ఇంకా ఇలాంటివి చూడవచ్చు.
సంపదలకు నిలయమైన భారతదేశానికి రావడానికి కొత్తదారి కనుగొనే ప్రయత్నంలో కొందరు విదేశీయులు కనిపెట్టినదే ఇప్పటి అమెరికా భూభాగం... అనేకదేశాల వారు వచ్చి అక్కడ స్థిరపడ్దారు. ఎక్కడైనా మంచిచెడు ఉంటాయి. విదేశాల వారి వద్ద నుంచి కూడా ఎన్నో మంచి విషయాలను మనం తెలుసుకోవచ్చు.
నేను ఆ మధ్యన విదేశాలకు వెళ్లినప్పుడు గమనించాను. వారు చాలామంది శుభ్రతను పాటిస్తారు.అంటే, రోడ్లపైన ఎక్కడపడితే అక్కడ చెత్త వేయరు. నడిచేవారు కనిపిస్తే దూసుకుపోకుండా కారును స్లొ చేసి వెళ్ళమంటారు. విదేశీయులు కొందరు, మనప్రాచీనులు తెలియజేసిన విధానాలను పాటిస్తున్నారు. కొందరు ఉదయాన్నే లేచి పనులను చేసుకుని, సాయంకాలమే భోజనం చేసి, రాత్రి త్వరగా పడుకుంటున్నారు. కొందరు స్త్రీలు ఇంటిపట్టున ఉండి చంటిపిల్లలను దగ్గరుండి చక్కగా పెంచుకుంటున్నారు.
మనదేశంలో కొందరు అవసరం లేకున్నా అర్ధరాత్రి భోజనశాలలకు వెళ్ళి తింటున్నారు. భారతదేశంలో చాలామంది ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తుంటారు. చాలామంది భారతీయులకు డబ్బుపిచ్చి బాగా పెరిగింది. భారతీయులు ఇలా ఎందుకు మారిపోయారో? బాధగా ఉంది.
ఇళ్లల్లో ప్లాస్టిక్ వేస్టుకు ఒక చెత్తబుట్ట, వంటవండినప్పుడు వచ్చిన చెత్తకు ఒక చెత్తబుట్టపెట్టుకుని బయట కూడా విడివిడిగా పారవేస్తే శుభ్రంగా ఉంటుంది. ప్లాస్టిక్ పాలకవర్లు కొంచెం కడిగి ఉంచుకోవాలి. సూపర్ బజార్ కు వెళ్ళినప్పుడు సరుకులను వేసి ఇచ్చే ఒక పెద్దప్లాస్టిక్ బాగ్ లో వేసి ఈ వాడేసిన పాలకవర్లు, నూనెకవర్లు..ఉంచి, వారానికి ఒకసారి బయటపడేసుకోవచ్చు.
పూజ చేసినప్పుడు మిగిలిన పువ్వులను,ఇంకా మిగిలినవాటిని.. పెరట్లో మొక్కలవద్ద వేయవచ్చు. లేదంటే బయట ఎక్కడైనా మొక్కలు ఉన్నదగ్గర వేయవచ్చు. ఇవన్నీ వద్దనుకుంటే ఒక పాత న్యూస్ పేపర్ చింపకుండా పెద్దగా తీసుకుని అందులో వేసి, ఆ పొట్లాన్ని కూరగాయల వేస్ట్ తోపాటు పడేయవచ్చు. ప్లాస్టిక్ కవర్లో కాకుండా పేపర్లో చుట్టివేయండి.
తోచిన అభిప్రాయాలను ఎన్నింటినో వ్రాయటం జరిగంది. ఇంత గొప్ప అవకాశాన్ని ప్రసాదించిన దైవానికి అనేక కృతజ్ఞతలు.
ReplyDeleteఅంతాదైవం దయ.
పైన వ్రాసిన కామెంట్ నేనే వ్రాసాను. అనానిమస్ అని రావటం హడావిడిలో చూసుకోలేదు.
Deleteఒకసారి దైవం మాయ వెల్కం చెప్పిందంటే అది యావజ్జీవకార్యక్రమమే నండీ.
ReplyDeleteమీకు ధన్యవాదములండి.
ReplyDelete