koodali

Saturday, September 29, 2018

కొన్ని విషయాలు.. కొన్ని చిట్కాలు..

    

కొందరు ఫంక్షన్స్లో, హోటల్స్లో భోజనాలు వడ్దించటానికి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉపయోగిస్తారు.

అయితే, ప్లాస్టిక్ ప్లేట్స్ పైన ఉన్న నూనె జిడ్డు త్వరగా శుభ్రం కాదు. ప్లాస్టిక్ ప్లేట్స్ ఎక్కువసార్లు కడగాలి.

 ప్లాస్టిక్ తో పోల్చితే స్టీల్ ప్లేట్స్ శుభ్రం చేయటం తేలిక. 

ఫంక్షన్స్ లో కొన్నిసార్లు కొందరు భోజనం చేసిన తరువాత ఆ ప్లేట్స్ కడిగి   తరువాత వారికి వడ్దిస్తారు.

 ఇలాంటప్పుడు కొన్ని ప్లాస్టిక్ ప్లేట్స్ గమనిస్తే, జిడ్దుగా ఉన్నట్లు తెలుస్తుంది.

 అందువల్ల ప్లాస్టిక్ బదులు  స్టీల్ ప్లేట్స్ , విస్తరాకులు వాడటం మంచిది.

************
 కొందరు పెద్దవాళ్ళు చిన్న పిల్లలకు జడ వేయటానికి బదులు,  రబ్బర్ బాండ్ తో జుట్టును టైట్ గా బిగించివేస్తారు. 

అలా జుట్టును బిగించి కట్టటం వల్ల ....కళ్ళకు హాని కలిగే అవకాశముందని కంటి వైద్యుల ద్వారా తెలిసింది.

 అందువల్ల జుట్టును రబ్బర్ బాండ్ తో బిగించి కట్టడం కాకుండా వదులుగా వేయటం మంచిది.

జడ వేయటానికి ఎక్కువ జుట్టు లేనప్పుడు,  రబ్బర్ బాండ్ కాకుండా జుట్టును రిబ్బన్ తో కట్టటం మంచిది.

**************
ఈ రోజుల్లో చాలామందికి టీవీలు, కంప్యూటర్ చూడటం అలవాటయింది.అలా ఎక్కువసేపు  చూడటం వల్ల కళ్ళు అలసి నొప్పి రావచ్చు.

కళ్ళజోడు పడితే ఎన్నో సమస్యలు ఉంటాయి. కళ్ళజోడు  బై ఫోకల్ అయినా ప్రోగ్రెస్సివ్ అయినా  దేనిసమస్యలు దానికున్నాయి.

 అలాగని టీవీ, కంప్యూటర్..చూడకుండా ఉండలేరు.కాబట్టి తక్కువగా చూడాలి.

 టీవీ చూసేటప్పుడు గంటలతరబడి కళ్ళప్పగించి చూడకుండా, మధ్యలో కొంతసేపు చూడటం మాని ,టీవీ లో వచ్చే ప్రోగ్రాం వినవచ్చు.. 

యూట్యూబ్ చూడాలనుకున్నా అదే పనిగా కళ్ళప్పగించటం కాకుండా, కొంతసేపు చూడటం మాని వినవచ్చు.

 అయితే, టీవీ, కంప్యూటర్..మొదలైన వాటి వల్ల రేడియేషన్ సమస్య ఉంటుందంటున్నారు కాబట్టి వీలైనంత తక్కువగా చూడటం మంచిది.

 ఇక ఐటీ రంగం వారికి చాలా సమయం కంప్యూటర్తో పని తప్పనిసరి. 

వాళ్ళలో చాలామంది చేతులు, మెడ, కళ్ళు, వెన్ను నెప్పులతో బాధపడుతున్నారు.

  ఈ రోజుల్లో బాంకింగ్ వంటి ఎన్నో రంగాల్లో కూడా కంప్యూటర్ వాడకం తప్పనిసరి అయింది.

 కంప్యూటర్ వాడేటప్పుడు  వీలైనంత  జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. బలమైన ఆహారం కూడా  తీసుకోవాలి.

బాదం, పొన్నగంటి కూర..వంటివి తినాలి.

త్రిఫల చూర్ణం, అశ్వగంధ..వంటివాటిని ఆయుర్వేద వైద్యుల సహాయంతో వాడుకోవచ్చు.

యూట్యూబ్ ద్వారా కొందరు ఆయుర్వేద వైద్యం ద్వారా ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు.

ఎన్నో మంచి విషయాలను తెలియజేస్తున్న అందరికీ ధన్యవాదములు. 



Thursday, September 27, 2018

Wednesday, September 26, 2018

ఆహారం సరైన విధంగా...


ఆహారం తగినంతలో సరైన విధంగా తీసుకోవాలి.


 కొందరు పండ్ల రసం మంచిదని భావించి రోజూ కొన్ని గ్లాసుల పండ్ల రసం త్రాగుతారు.


పుల్లటి పండ్ల రసం అధికంగా త్రాగితే అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. 


ఉదా ..  ఒకే రోజు నాలుగు గ్లాసుల పుల్లటి పండ్ల రసం మరియు టమేటో సాస్ ఎక్కువగా తీసుకుంటే, శరీరానికి అవసరం అయినదానికన్నా ఎక్కువగా  సి విటమిన్ చేరుతుంది.

  
పండ్ల రసంలో నీరు కలిపి త్రాగటం మంచిది.


ఈ రోజుల్లో టమెటో వాడకం కూడా బాగా పెరిగింది.


పులుపు మరీ ఎక్కువైతే యాసిడ్ పెరిగి కిడ్నీలు  పాడవటం, కడుపులో అల్సర్లు  వంటి జబ్బులు వచ్చే ప్రమాదముంది.


కొందరు విటమిన్ టాబ్లెట్లు మంచిదని ఎక్కువగా వాడతారు. 

విటమిన్లు అయినా సరే, మోతాదు మించితే అనర్ధాలు వచ్చే అవకాశముంది.


 సోయా కూడా మోతాదు వరకు తీసుకుంటేనే మంచిది. 

మోతాదు మించితే అనారోగ్యమని చెబుతున్నారు.


పసుపు, చింతపండు, అల్లం, వెల్లుల్లి కూడా వంటల్లో విస్తారంగా వాడకూడదు. తగుమోతాదులో మాత్రమే వేయాలి.


ఆహారం ఎలా ఉంటే మంచిదో..  పూర్వీకులు తెలిపిన విషయాలు మరియు ఇప్పటి నిపుణుల నుండి తెలుసుకుని వాడాలి. 




Monday, September 17, 2018

మట్టి లేకుండా కూడా నీటి ద్వారా మొక్కలు పెంచటం మరియు.



మట్టి లేకుండా నీటి ద్వారా మొక్కలు పెంచే పద్ధతిని హైడ్రోపొనిక్స్ అంటారు.


ఈ  పద్ధతిలో మొక్కలకు కావలసిన పోషకాలను నీటితో కలిపి అందిస్తారట.


ఇంట్లో.. పుదీనా, పొన్నగంటి ఆకు మొక్కలు..వంటి వాటిని పెంచుకోవచ్చు. 


అయితే, మట్టి లేకుండా పెంచే ఈ పద్ధతి కొందరికి నచ్చకపోవచ్చు.


నాకు ఏమనిపించిందంటే, కొంచెం మట్టి మరియు కొంచెం నీటి ద్వారా మొక్కలు పెంచటం మరింత బాగుంటుందనిపించింది.

అంటే, మొక్కను కొంచెం మట్టిలో నాటి, మొక్క మిగతా క్రింద భాగం వేర్లు నీటిలో ఉండేటట్లు చేయాలి.

ఈ విధానం వల్ల మట్టిలో ఉన్న వేర్లు మట్టిలో ఉన్న పోషకాలను అందుకుంటాయి. నీటిలో ఉన్న వేర్ల వల్ల మొక్క వాడిపోదు.


 ఈ పద్ధతిలో పుదీనా..వంటివి చక్కగా పెంచుకోవచ్చు.

 రోజూ  కుండీలో నీరు పోయకపోయినా మొక్క ఎండిపోదు.

 మరిన్ని వివరాలకు క్రింద లింకుల వద్ద చూడగలరు.


HOW TO GROW HYDROPONIC PLANTS |GROW PLANTS ON WATER

Self watering system for plants using waste plastic bottle


Cheap and easy to make wick system for herbs (and other plants)5


Hydroponics, Agriculture University, Jodhpur Agriculture University, Jodhpur By Dr. LN Harsh


25 of the Best Plants for Indoor Hydroponic Gardens | Dengarden

***********************

హైడ్రోపోనిక్ పద్ధతిలో మొలకలను పెంచి పశువులకు ఇచ్చే విషయంలో ఈ క్రింద లింక్ వద్ద నిపుణులు చెప్పిన వివరాలను జాగ్రత్తగా గమనించవలెను..

Tips for raising hydroponic fodder grass & vissaka farmers experience

************

పశువులకు పచ్చిగడ్దిని పూర్తిగా ఆపివేసి పూర్తిగా మొలకగడ్దిని మేపకూడదట. 

ఎక్కువమొత్తంలో కూడా మొలకలను మేపకూడదట. అలా చేయటం వల్ల పశువులు జబ్బుపడే ప్రమాదముందంటున్నారు. 

హైడ్రోపొనిక్ పద్ధతిలో మొలకలను పెంచి పశువులకు ఇచ్చే విషయంలో పశువైద్య నిపుణుల సలహాతో వాడటం మంచిది. 

.....................

Self watering system for plants using waste plastic bottle 

ఈ విషయం గురించి ఇప్పుడు కలిగిన కొత్త ఆలోచనలు ఏమిటంటే....

ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి మొక్కలు పెంచినప్పుడు ఆ బాటిల్ ఎండలో ఉంటే ఎండకు నీరు వేడెక్కుతాయి.

తద్వారా మొక్కల వేర్లు వేడి నీటిలో ఉండటం వల్ల మొక్కలు చనిపోతాయి. 

 పైన మొక్క కొంత భాగం మట్టిలో  ఉన్నా కూడా, క్రింద వేర్లు వేడినీటిలో ఉన్నప్పుడు మొక్క వాడిపోతుంది.

 అందువల్ల ప్లాస్టిక్ బాటిల్లో నీరు పోసి  మొక్కలు పెంచే విధానంలో బాటిల్స్ ను ఎండలో ఉంచకూడదు.

 బాటిల్స్లో నీరు ఎండకు వేడెక్కకుండా బాటిల్స్ ను నీడలో మాత్రమే ఉంచాలి.
లేదా ఎండకు బాటిల్స్ లో నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

బాటిల్స్ లోని నీరు వేడెక్కకుండా బాటిల్స్ చుట్టూ క్లాత్  చుట్టాలి.

 ఈ బాధలన్నీ ఎవరు పడతారనుకుంటే ఎప్పట్లాగానే మట్టిలో మొక్కలు పెంచుకోవటం మంచిది.

పెద్ద ఎత్తున నీటిలో మొక్కలను పెంచే హైడ్రోపోనిక్ వ్యవసాయం చేసేవారు ఎక్కువగా  గ్రీన్ హౌస్ లలో మొక్కలను పెంచుతారు కాబట్టి,  నీరు వేడెక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

Commercial Hydroponics Farm in India


Saturday, September 15, 2018

భారతీయ విజ్ఞానము ...ఎన్నో విషయాలున్నాయి..




 ఎందరో,  ఎన్నో చక్కటి విషయాలను  తెలియజేస్తున్నారు.

 అందరికి ధన్యవాదములు. 



అన్నింటి గురించి సమాచారాన్ని ఇక్కడ ఇవ్వలేను కాబట్టి , కొన్నింటి గురించి ఇవ్వటం జరిగింది.

*********************



Mahavtar babaji complete story | In Telugu | Part-#01 BRPV Epi-05


Bharatheya rushula vignanam || Agasthya samhitha technology


11 dimensions ante eanti? Devudu ea dimension lo vuntadu? ||In Telugu||HD Audio clear version

************

Top Indian Inventions That Changed The World In Telugu | Top Discoveries In India | My Show My Talks

************

Part 8: మోక్ష ప్రాప్తి కోసం? How to attain Moksha state of mind? - Nanduri Srinivas




Thursday, September 13, 2018

ఓం....

 వినాయక చవితి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలండి.

 వినాయకచవితి పూజలో ఉపయోగించే పత్రి ఎన్నో ఔషధవిలువలు గలిగిన పత్రి. 

ఇప్పుడంటే  పత్రిని  బజారులో  కొంటున్నారు  గానీ, ఇంతకుముందు రోజుల్లో అయితే ఈ పత్రిని  సేకరించటంలో  పెద్దవాళ్ళతో  పాటు పిల్లలు  కూడా పాల్గొనేవారట. 

అందువల్ల  పిల్లలకు  రకరకాల  మొక్కల  గురించిన వివరాలు, వాటికి గల ఔషధగుణాలు తెలిసేవి . 

  పూజ  తరువాత  , పూజలో  వాడిన  పత్రిని  కూడా  నీటిలో  కలుపటం  ద్వారా  పత్రిలోని  ఔషధ  గుణాలు  నీటిలో  కలిసి  నీరు  బాగుంటుంది.

మట్టితో  తయారుచేసిన   విగ్రహాల   వల్ల     కలిగే  మంచి  గురించి   ఎందరో  ప్రచారం  చేస్తున్నారు.

  అందువల్ల  ప్రజలలోనూ  క్రమంగా   చక్కటి  చైతన్యం  పెరుగుతోంది.  

  పర్యావరణానికి  హానిని    కలిగించని   విగ్రహాలను  వాడటానికి  ముందుకొచ్చే  ప్రజల  సంఖ్య  పెరగటం   మంచి  పరిణామం.



Monday, September 10, 2018

డ్రైవింగ్ గురించి ఉపయోగకరమైన విషయాలను...


 బైక్ , కారు , బస్.. డ్రైవింగ్ సమయంలో కొందరు కాళ్ళకు షూస్ వేసుకుంటారు. 

కొందరు కాళ్ళకు ఏమీ వేసుకోకుండా డ్రైవ్ చేస్తారు. 

డ్రైవింగ్ చేసేవాళ్లు  చెప్పుల వంటివి వేసుకోకూడదట. 

 అడుగుభాగం (సోల్) సాఫ్ట్ గా ఉన్న షూస్ వేసుకోవాలని కొందరు అంటున్నారు....

అయితే షూస్ వేసుకుంటే డ్రైవింగ్ అనీజీగా ఉంటుందని కొందరు అంటున్నారు. 

 ఈ విషయం గురించి అభిప్రాయభేదాలున్నాయి.

కొన్ని దేశాలలో డ్రైవింగ్ సమయంలో షూస్ వేసుకోవాలని రూల్స్ ఉన్నాయట.

*****************

 డ్రైవింగ్ గురించి  ఉపయోగకరమైన విషయాలను ఈ క్రింద లింక్ వద్ద చూడగలరు. 

chitti driveworld Channel.... 

అనే  చానల్ కు వెళ్ళి .. వీడియోస్ అనే దగ్గర క్లిక్ చేస్తే ఎక్కువ వీడియోస్ చూడవచ్చు.

 ఉపయోగరమైన విషయాలను తెలియజేసినందుకు chitti driveworld Channel వారికి  ధన్యవాదములండి.



Wednesday, September 5, 2018

వైద్యులు,నర్సులు.. బాధలు... సిరంజిల.. ప్రమాదాల నుండి రక్షణ కల్పించే గ్లవ్స్ ...మరియు ..


 ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలండి.   
**************
  
ఈ రోజుల్లో ఎవరి బాధలు వాళ్లకున్నాయి. 

ఉదా..వైద్యులు, నర్సులకు ఎంతో పని వత్తిడి ఉంటోంది. 

కొన్నిసార్లు పేషెంట్లకు ఇంజక్షన్ ఇచ్చే సమయంలో పొరపాటున ఆ సూది వైద్యులకు, నర్సులకు తగిలి గుచ్చుకునే ప్రమాదముంది. ఈ సమస్యతో చాలామంది బాధపడుతుంటారు. 

ఆసుపత్రి పారిశుధ్య సిబ్బందికి  కూడా చాల బాధలు ఉంటాయి.  ఆసుపత్రి వేస్ట్ ను శుభ్రం చేస్తున్నప్పుడు పారిశుధ్య సిబ్బంది చాలా  జాగ్రత్తగా ఉండాలి. 

 ఇంకా, పీజీ చదివే వాళ్ళయితే, కొన్నిసార్లు వరుసగా 32 గంటలు పనిచేయవలసిన పరిస్థితి ఉంది.

 అంటే, ఈ రోజు ఉదయాన్నే డ్యూటీకి వెళ్తే,  మరుసటి రోజు మధ్యాహ్నం వరకు పనిచేయవలసి ఉంటుంది. 

రాత్రి నిద్రవస్తే ఆపుకోవాలి.అదృష్టం బాగుండి కొంత సమయం లభిస్తే , కుర్చీలో కూర్చుని కొంతసేపు కునుకు తీస్తారు.

 వరుసగా అన్ని  గంటలు నిద్ర లేకుండా పని చేయాలంటే కష్టం. 

కొందరు నిద్ర ఆపుకోలేక మరుసటి రోజుకు నీరసంతో పడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది.

వీళ్లకు ఆదివారం సెలవు కూడా ఉండవు.

 ఇలాంటి పరిస్థితిలో వందలాది పేషెంట్లను సరిగ్గా  చూడాలంటే మాటలు కాదు. 

వత్తిడి తట్టుకోలేక కొందరు పీజీ విద్యార్ధులు చదువు వదిలేసి వెళ్ళిపోయిన సందర్భాలు, ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

 ఎంతో ఇష్టంగా వైద్యవృత్తిలో చేరిన కొందరు పిల్లలు, ఈ వత్తిడి భరించలేక  ఎందుకు వైద్యవృత్తిలోకి వచ్చామా? అని నిరాశకు లోనవటమూ జరుగుతోంది.

 మెడికల్ కాలేజీల్లో సీట్లు పెంచి ఎక్కువమందికి అవకాశాలు వస్తే , వైద్యుల సంఖ్య పెరిగి వత్తిడి తగ్గే అవకాశాలున్నాయి.అప్పుడు పేషెంట్లకు కూడా ఉపయోగమే.

 పనివత్తిడితో నీరసంగా ఉన్న వైద్యులు వందలాది పేషెంట్లను జాగ్రత్తగా చూడాలంటే కష్టం.

 ఎక్కడైనా పొరపాటు జరిగే అవకాశం ఉంది. అప్పుడు మళ్లీ వైద్యులనే నిందిస్తారు. 

 వైద్యులలో కూడా తప్పులు చేసే వారున్నారు కానీ , చాలామంది వైద్యులు తమకు ఎంత వత్తిడి ఉన్నా భరిస్తూ పేషెంట్లకు ఓపికగా చికిత్స చేస్తారు.

( సైనికులు, పోలీసులు ఇంకా కొందరు కూడా  కొన్నిసార్లు వరుసగా చాలా గంటలు పనిచేయవలసి ఉంటుంది....ఐటి ఉద్యోగస్తులు కూడా కొన్నిసార్లు 32 గంటలు వరుసగా పనిచేయవలసి ఉంటుంది. )

 ఈ రోజుల్లో పిల్లలకు చదువుల భారం, పెద్దలకు పని భారం. ఏమిటో విశ్రాంతి లేని జీవితాలయ్యాయి.

**************
వైద్యులకు, నర్సులకు రక్షణ కల్పించే 
Needle Resistant Gloves..  వివరాలను అంతర్జాలంలో  చూడగలరు.  
 



Tuesday, September 4, 2018

దోమతెరను కప్పుకోవటం...


కొన్ని చోట్ల వర్షాకాలంలో దోమల సమస్య బాగా ఉంటుంది.

ఈ రోజుల్లో రసాయనాలతో కూడిన  దోమల మందులు చాలా వచ్చాయి. అయితే, వీటిని ఎక్కువగా వాడటం మంచిదికాదని  అంటున్నారు.

వెల్లుల్లి, వేప, కర్పూరం..వంటివి కూడ దోమలను పారద్రోలటానికి పనిచేస్తాయని అంటున్నారు కానీ.... 

 రసాయనమందులతో  పెరగటం, వాతావరణకాలుష్యం వల్ల   వెల్లుల్లి, వేప వంటి వాటిలో  వాటి సహజ శక్తి తగ్గిందేమో ? అని సందేహం వస్తోంది. 


మధ్య వైజాగ్ చెందిన కొందరు యువత, మనుషులకు హాని కలగని విధంగా, దోమల మందు తయారుచేసారని వార్తలు వచ్చాయి. ప్రయోగాలు ఎంతవరకూ వచ్చాయో తెలియటం లేదు.
****************

కొందరు ఏం చేస్తారంటే, దోమలు కుట్టకుండా ముఖం నుండి కాళ్ళవరకూ నిండా దుప్పటి కప్పుకుని పడుకుంటారు.

అలా ముఖంపై దుప్పటి కప్పేసుకుంటే  కొన్నిసార్లు గాలి ఆడక చిరాగ్గా ఉంటుంది. 


అలాగని ముఖంపై దుప్పటి తొలగిస్తే దోమలు  కుట్టేస్తాయి.


నాకు ఏమనిపించిందంటే,  దోమతెర క్లాత్ తెచ్చి, ఆ క్లాత్ ను  ఒకదానిపై ఒకటి...  రెండు పొరలుగా  వేసి కుట్టించాలి. 


ఒకే పొర ఉంటే ఆ కన్నాల నుంచి దోమలు కుడతాయి. 

ఒకదానిపై ఒకటి  రెండు  పొరలు వేస్తే దోమలకు కుట్టడం అంత సులువుకాదు.


  మామూలు దుప్పటికి  తలవైపు  ...  రెండు పొరలుగా వేసిన   దోమతెర క్లాత్ జాయింట్ చేసి  కుట్టించుకోవాలి. 

 దోమతెరకు కన్నాలు ఉంటాయి కాబట్టి, ముఖం మీద కప్పుకున్నా గాలి సులువుగా తగులుతుంది.

ఈ విధానంలో కూడా దోమలు కుట్టే అవకాశాలు ఉన్నాయి కానీ, చాలావరకూ బెటర్.

******************

 ఏసీగదుల్లో  పడుకుంటే కొంతవరకు  ఫరవాలేదు. . 

అయితే, రోజూ ఏసీల్లో పడుకునే వారుకూడా కొన్నిసార్లు ఏసీ లేకుండా పడుకునే పరిస్థితులు ఉంటాయి. 

ఉదా..కొన్ని పండుగ రోజుల్లో కొందరు ఏసీ గదిలో పడుకోరు. ..


అయినా ఎప్పుడూ ఏసీ వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు కదా !

**********************

కొందరు ఏసీ గదిలో చలి వల్ల ముఖం పై నుంచి కాళ్ళ వరకూ వరకూ దుప్పటి కప్పుకుంటారు.

 శ్వాస ద్వారా ఆక్సిజన్ తీసుకుని , కార్బన్ డయాక్సైడ్ విడిచిపెడతాం. 


ఇవన్నీ గమనిస్తే,  రాత్రంతా ముఖంపై దుప్పటి కప్పటం సరైనది కాదనిపిస్తోంది. 

*************

పాతకాలం నుంచి దోమతెరల వాడకం ఉన్నది. అయితే, ఇంట్లో అందరికీ దోమతెరలు కట్టుకోవటం అనేది సమస్యే. 

నిద్రలో కాలోచెయ్యో తగిలి దోమతెర ప్రక్కకు వెళ్ళిపోతే దోమలు లోపలకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.


కొన్ని సమస్యలు ఉన్నా కూడా దోమతెరల వాడకం మంచిది.

పాతకాలంలో పందిరి మంచాలకు దోమతెర రోజూ కట్టకుండా,  మంచానికి కర్రలు బిగించే ఏర్పాటు ఉండేదట.. ఇప్పుడు కూడా కొందరు అలా  ఏర్పాటు చేసుకుంటున్నారు.

 ఈ మధ్య అనేక కొత్తరకం దోమతెరలు  కూడా వచ్చాయి.

వీటిని మంచంపై వేయవచ్చు. క్రిందకూడా వేసుకోవచ్చు. రోజూ మడిచేయవచ్చు.


  వీటిలో  కొన్ని పొడవు తక్కువగా ఉండి కాళ్ళు  జాపుకోవటానికి సరిపోవట్లేదు... (వీటిలో చిన్నవి, పెద్దవి ఉన్నాయి. చూసి కొనుక్కోవాలి.) 

 నిద్రలో చేతులు,  కాళ్ళు దోమతెరకు తాకితే   బయట నుంచి దోమలు కుట్టే  అవకాశాలు  ఉన్నాయి.

 ఏ  దోమతెర  అయినా , బయటకు వచ్చి  తిరిగి పడుకునేటప్పుడు లోపలికి దోమలు వెళ్లాయేమో చెక్ చేసుకోవాలి. 

*************
దోమలు బాగా ఉన్న సీజన్లో... నిద్రలో ఉన్నవారినే కాకుండా , మేలుకుని ఉన్న వారిని కూడా  కుట్టేస్తాయి.

అందువల్ల, పరిసరాల్లో దోమలు పెరగకుండా  జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. 

* మరికొన్ని  విషయాలను కామెంట్స్ వద్ద చదవమని కోరుతున్నానండి .



Sunday, September 2, 2018

ఓం..




 శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా  ....అందరికీ  శుభాకాంక్షలండి.