నాకు గుర్తున్నంతలో రధసప్తమి రోజు బ్లాగ్ సంకల్పం చేసాననుకుంటున్నాను.
ఇంత అద్భుతమైన అవకాశాన్ని అందించిన దైవానికి అనేక ధన్యవాదములు.
తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నాను.
తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నాను.
ఇంతకాలంగా వ్రాస్తానని మొదట్లో అనుకోలేదు.
అంతా దైవం దయ.
ఈ బ్లాగ్ ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదములు.
ఈ బ్లాగ్ ను ప్రోత్సహించిన అందరికీ ధన్యవాదములు.
బ్లాగ్ ను ఫాలో అవుతున్నవారికి నాధన్యవాదములు.
అందరి గురించి వివరంగా వ్రాయలేకపోతున్నందుకు దయచేసి క్షమించండి.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.
అంతర్జాలం పనిచేయాలంటే ఎందరో వ్యక్తుల కృషి ఉంటుంది. నాకు తెలిసిన, తెలియని అందరికీ ధన్యవాదములు.
లేఖిని ద్వారా వ్రాయటం జరిగింది. లేఖిని వారికి ధన్యవాదములు..
లేఖిని ద్వారా వ్రాయటం జరిగింది. లేఖిని వారికి ధన్యవాదములు..
అగ్రిగేటర్లకు ధన్యవాదములు.
కంప్యూటర్ వాడకంలో నాకు సహకారాన్ని అందించిన మా కుటుంబసభ్యులకు మరియు అందరికి ధన్యవాదములు.
కంప్యూటర్ వాడకంలో నాకు సహకారాన్ని అందించిన మా కుటుంబసభ్యులకు మరియు అందరికి ధన్యవాదములు.
తెలిసినంతలో విషయాలను వ్రాస్తున్నాను.
దైవం దయ వల్ల, ఎన్నో గ్రంధాల ద్వారా, పెద్దల ద్వారా, వార్తాపత్రికల ద్వారా, పుస్తకల ద్వారా, అంతర్జాలం ద్వారా, చానల్స్ ద్వారా, తోటి వారితో సంభాషణల ద్వారా, చూసినవి, విన్నవాటి ద్వారా..ఇంకా ఎన్నో మార్గాల ద్వారా.. మనం ఎన్నో విషయాలను తెలుసుకోగలుగుతాము.

విషయాల గురించి మాట్లాడుకోవటానికి అంతం అంటూ ఏమీ ఉండదు. ఎందుకంటే, ఎంత మాట్లాడుకున్నా ఇంకా చెప్పుకోవటానికి విషయాలెన్నో మిగిలే ఉంటాయి.
చాలా విషయాలను వ్రాసాను కానీ, రాయాలనుకున్న కొన్ని విషయాలను రాయలేదు.నా అభిప్రాయాలు కొన్ని కొందరికి నచ్చవనే అభిప్రాయం కలిగి ఆ విషయాలను రాయలేదు.
చాలామందికి నచ్చవని తెలిసినా కొన్నింటిని వ్రాసాను. ఇతరులకు నచ్చవని తెలిసినా కూడా, మనకు న్యాయమని అనిపించిన వాటిని కొన్నింటినైనా చెప్పక తప్పదు.
మన అభిప్రాయాలు కొందరికి నచ్చకపోవచ్చు, కొన్ని అభిప్రాయాలు నచ్చి, కొన్ని నచ్చకపోవచ్చు. ఏది ఏమైనా అందరికీ అన్నీ నచ్చాలనుకోవటం చాలా కష్టం. వ్రాసిన విషయాల వల్ల మంచి జరగాలనే అభిప్రాయంతో వ్రాసాను.
కొన్ని విషయాలలో మనకు క్లారిటీ ఉన్నా కూడా ఆ విషయాల గురించి బహిరంగంగా రాయలేం. ఎందుకంటే, వాటిని చదివినవారిలో కొందరు సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవటమో, అపార్ధం చేసుకోవటమో లేక అర్ధం అయినా కూడా కావాలని వెటకారం చేయటమో జరగొచ్చు. అందువల్ల అన్నీ రాయలేము.
బ్లాగ్ వ్రాయటం ఎంతో ఆనందమే కానీ, పొరపాట్లు లేకుండా వ్రాయాలంటే ఎన్నో విషయాలు తెలుసుకోవాలి, ఎంతో ఆలోచించాలి. మొత్తానికి దైవం దయ వల్ల ఈ మాత్రం వ్రాయటం జరిగింది.
పాతటపాలు చదివితే ఇవన్నీ నేనే రాసానా? అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
అయితే, ఇవన్నీ నేనే రాసానని చెప్పుకోవటం హాస్యాస్పదం.
దైవం దయ వల్ల వ్రాసాను. వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే,ఆ తప్పులు నావిగా భావిస్తున్నాను.
దైవం దయ వల్ల వ్రాసాను. వ్రాసిన వాటిల్లో తప్పులు ఉంటే,ఆ తప్పులు నావిగా భావిస్తున్నాను.
కొంతకాలం క్రిందటే వ్రాయటం మానేద్దామనుకున్నాను కానీ, ఏవో కారణాలతో కొనసాగింది. ఇకమీదట ఎప్పుడైనా తప్పనిసరిగా వ్రాయాలనిపిస్తే రాస్తాను.
దైవానికి ధన్యవాదములు, వందనములు.
అందరికీ ధన్యవాదములు.
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను.