koodali

Wednesday, November 7, 2018

ఓం..మరికొన్ని విషయాలు..


శ్రీలక్ష్మీనారాయణులకు వందనములు.

అందరికీ దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలండి.

లక్ష్మీదేవి అనే రూపాలుగా ఉంటుంది. 

 ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి..ఇలా  లక్ష్మీదేవిని పూజిస్తారు. 

ఇంకా..  వరలక్ష్మి, స్వర్గలక్ష్మి, మోక్షలక్ష్మి..గా  కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. 

దైవానికి వందనములు. 
............................
మరికొన్ని విషయాలు..
 
 కొన్ని సందేహాలున్నాయి.ఉదా..మనుషులకు వారి కర్మ ప్రకారం జీవితాలు నడుస్తాయంటారు. దైవస్మరణ, పరిహారాల ద్వారా గతకర్మ నుంచి కలిగిన కష్టాలను తప్పించుకోవచ్చంటారు కొందరు.

అయితే, జీవుల గతజన్మలు, భవిష్యత్తు జన్మలు గురించి అంతా ముందే కొన్ని గ్రంధాలలో వ్రాసి ఉన్నదని కూడా అంటారు కొందరు. అంటే, సినిమా స్క్రిప్ట్ లాగ ముందే అన్నీ సిద్ధమయ్యాక జీవుల జన్మలు ఉంటాయా? అనేది తెలియటం లేదు. 

ఒకవేళ ముందే అన్నీ వ్రాసి ఉంటే, ఇక మనుషులు చేసే కర్మల ప్రకారం జరగటం అనేది ఏమిటి?

ఒకవేళ జీవుల గత కర్మలు..వాటిఫలితాలు..ఆ కర్మల వల్ల తరువాత జరగబోయేవి..సూచనగా ముందే గ్రంధాలలో వ్రాయబడి ఉంటుందేమో? జీవులు జన్మించాక వారి కర్మల ప్రకారం కూడా, వారి జీవితాల్లో కొన్ని మార్పుచేర్పులు జరుగుతాయేమో?

సృష్టిలో అంతుబట్టని రహస్యాలెన్నో ఉన్నాయి. దైవానికే అన్నీ తెలుస్తాయి.


No comments:

Post a Comment