ఈ పాటను శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు వ్రాసారని ఈ మధ్యనే తెలిసింది. అయితే, వారు వ్రాసిన పాటలో పదములు ఎలా ఉన్నాయో నాకు తెలియలేదు.
అంతర్జాలంలో ఈ పాట చాల దగ్గర ఉన్నది. అయితే, కొన్నిచోట్ల.. పదాలలో మార్పులు ఉన్నాయి.
పాటను అందించిన అందరికి ధన్యవాదములండి.
నేను పాటను పాడిన విధానంలో చాలా తప్పులు ఉండవచ్చు. సంగీతం బేసిక్స్ కొద్దికాలం మాత్రమే నేర్చుకున్నాను. అది కూడా సాధన లేక మర్చిపోయాను.
ఏదో తోచినట్లుగా పాడాను. పాడిన విధానంలో తప్పులను దయచేసి క్షమించమని కోరుతున్నాను.
ఏదో తోచినట్లుగా పాడాను. పాడిన విధానంలో తప్పులను దయచేసి క్షమించమని కోరుతున్నాను.
...............
బంధువులు,స్నేహితులు ఒక జన్మకే తోడుగా ఉంటారేమో?
దైవం మాత్రం అందరికీ జన్మజన్మల తోడుగా ఉండే అద్భుతమైన ఆత్మబంధువు.
దైవాన్ని ఆరాధించాలి.
జీవితంలో ఎవరి స్వధర్మాన్నివారు చక్కగా ఆచరించాలి.దైవకృపను పొందాలి.
దైవం మాత్రం అందరికీ జన్మజన్మల తోడుగా ఉండే అద్భుతమైన ఆత్మబంధువు.
దైవాన్ని ఆరాధించాలి.
జీవితంలో ఎవరి స్వధర్మాన్నివారు చక్కగా ఆచరించాలి.దైవకృపను పొందాలి.
సాలోక్యం,సామీప్యం,సారూప్యం, సాన్నిధ్యం.....అని ముక్తులు ఉంటాయని తెలుస్తోంది.
ఏ కష్టమూ లేని పరమానందం పొందాలంటే దైవాన్ని పొందాలి.
శ్రీ మాత్రే నమః శ్రీ పరమాత్మనే నమః.
దైవానికి వందనములు.
దైవానికి వందనములు.
No comments:
Post a Comment