గోవులు ఎప్పుడైనా పూజనీయమైనవి. అయితే, గృహప్రవేశాల వంటి శుభకార్యాల సందర్భాలలో మరింత ప్రత్యేకంగా గోవులను తీసుకొచ్చి పూజిస్తారు.
కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, కొత్త పరిసరాలవల్ల, కొత్తవారు కనిపించినప్పుడు.. ఆవులు బెదిరిపోతాయి. ముందుకు రావటానికి అడుగు వేయవు.
అలాంటప్పుడు కొన్నిసార్లు, గోవుల యజమాని గోవులను బలవంతంగా లాక్కురావటం , వాటిని కొట్టడం..కూడా చేస్తారు. ఇలా చేయటం గోవులను హింసించటం అవుతుంది.
ఈ రోజుల్లో ఎన్నో అంతస్తుల ఎత్తున ఇళ్ళు (అపార్ట్మెంట్స్) ఉంటున్నాయి. అయినా కొందరు గోవును మెట్లపై నుంచి తీసుకెళ్ళి మరీ గృహప్రవేశం చేయిస్తున్నారు.
గోపూజ కొరకు గోవులను హింసిస్తూ తీసుకురావటం ఏ విధంగా సరైనది ?
ఇలా చేయటం కంటే, గృహప్రవేశానికి ముందురోజు గోవులు ఉన్న ప్రదేశానికే వెళ్లి, వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందించి, పూజించి , గోవుల చుట్టు ప్రక్కల మట్టిని (గోవుల పాదధూళిని) తీసుకొచ్చి గృహప్రవేశం సందర్భంగా ఇంట్లో చల్లుకోవచ్చు కదా.. అని నాకు అనిపించింది.
*****************
మరి కొందరు ఏం చేస్తారంటే, గోవులకు ఆహారాన్ని తినిపిస్తే .. మంచిదని వాటికి ఆహారాన్ని అందిస్తారు. .
అనారోగ్యం వంటివి వస్తే ఆవులు చెప్పలేవు కదా!
ఏదిపడితే అది తెచ్చి తినిపించటం కాకుండా, ఆవులు ఏం తింటాయో ?
ఎంతవరకు తినిపించవచ్చో ? తెలుసుకుని తినిపించటం మంచిది.
ఈ విషయాలు వైద్యులకు, గోవులను పెంచేవాళ్లకు అయితే బాగా తెలుస్తుంది.
మనకు పుణ్యం రావాలని వాటికి ఏదిపడితే అది తినిపించటం చేయకూడదని నాకు అనిపించింది.
మేము చూసిన ఒక గోసంరక్షణ కేంద్రం వద్ద, గోవులు తినే ఆహారం గురించి బోర్డుపైన వ్రాసి, ఆ పదార్ధాలను తగుమాత్రం ధరకు భక్తులకు అందజేస్తున్నారు. ఆ పద్ధతి బాగుంది.
************
మరికొన్ని ఆవుల పరిస్థితి ఏమిటంటే, రోడ్డుపైన తిరిగే కొన్ని ఆవులు ఆహారం కొరకు వెతుకుతూ ..
రోడ్ల ప్రక్కన చెత్తకుప్పలలో .. ప్లాస్టిక్ కవర్లలో మిగిలిపోయిన ఆహారాన్ని కవర్లతో సహా తినటం వల్ల.. ఎన్నో ఆవులు అనారోగ్యం పాలవుతున్నాయని వార్తలు వచ్చాయి.
ఇలా ఎన్నో రకాల పరిస్థితులున్నాయి.
గోవుల పరిస్థితి బాగుండాలని ఆశిద్దాము.

No comments:
Post a Comment