రెండు సంవత్సరాల క్రితం నగరం
వద్ద జరిగిన దుర్ఘటన
ఎంతో బాధాకరమైనది.
పచ్చటి
పొలాలతో ఉండే కోస్తాలో పెట్రోల్
, గాస్ తవ్వకాల వల్ల ఎప్పుడు
ఏం జరుగుతుందో తెలియక
ప్రజలు భయంభయంగా బ్రతుకుతున్నారు..
ఇప్పటికీ అప్పుడప్పుడు గాస్ లీక్ సంఘటనలు జరుగుతున్నట్లు వార్తలు
వస్తున్నాయి.
ఇవన్నీ గమనిస్తే బాబోయ్.. రాష్ట్రంలో
ఏ విధమైన సహజవనరులు
లభించవద్దు. అనిపిస్తోంది.
అభివృద్ధి పేరుతో ఎక్కడెక్కడెక్కడి
వాళ్ళో వచ్చి తవ్వుకుపోవటం .... స్థానికులకు మిగిలేది
పొల్యూషన్ బాధలు
అన్నట్లు ఉంది పరిస్థితి .
. ఇవన్నీ ఇలా
ఉండగా కొత్తగా ఉత్తరాంధ్రాలో అణువిద్యుత్
కేంద్రం ఏర్పాటు చేస్తామంటున్నారు.
ఇతర
రాష్ట్రాల వాళ్లు వ్యతిరేకించగా దాన్ని
ఆంధ్రప్రదేశ్లో పెడతామంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మెతకమనుషులు ... ఏం
చేసినా సహిస్తారు.. అని అందరికీ
తెలిసిపోయినట్లుంది.
ఆంధ్రప్రదేశ్ అంటే చిన్నచూపు చూ స్తున్నారు.
No comments:
Post a Comment