నా భర్తది బదిలీలు ఉన్న ఉద్యోగమే. అయితే ప్రమోషన్లు తీసుకోకుంటే ఎక్కువ బదిలీలు ఉండవు. ప్రమోషన్ తీసుకుంటే మాత్రం బదిలీ ఉంటుంది.
కెరీర్లో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఉన్నా కూడా బదిలీ వస్తే కష్టమని భావించి చాలాకాలం ప్రమోషన్ తీసుకోకుండానే పనిచేసారు.
ప్రమోషన్ వస్తే ఎక్కడకు బదిలీ చేస్తారో తెలియదు కదా!
అయితే ఆఫీస్ వాళ్ళు.. నువ్వు బాగా కష్టపడి పనిచేస్తావు ప్రమోషన్ పరీక్ష రాయవచ్చు కదా! అని ఎప్పుడూ అంటుండేవారట.
ఒక కేడర్ తరువాత ప్రమోషన్ కోరుకోకపోయినా... ఒకే ఊరిలో కొన్ని సంవత్సరాలు ఉంటే బదిలీ చేస్తారు.
ఇక, కొంతకాలం తరువాత బదిలీ తప్పదని తెలిసి ప్రమోషన్ తో బదిలీ తీసుకోవటం జరిగింది.
అలా నా భర్త వేరే ఊరిలో ఉద్యోగంలో చేరటం జరిగింది .
పిల్లలు చదవటానికి అక్కడ సరైన అవకాశాలు లేవు.
ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టునే ఉండే స్త్రీ భర్తకు బదిలీ అయితే భర్తతో పాటు వెళ్ళే అవకాశం ఉంది.
అయితే ఈ రోజుల్లో పిల్లల చదువులు ఉన్నాయి కదా !
అబ్బాయిలను హాస్టల్లో వేయాలి అనుకుంటే...ఈ రోజుల్లో ఆడపిల్లలూ చదివి ఉద్యోగాలు చేయాలంటున్నారు.
ఈ రోజుల్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా .. ఎవర్నీ హాస్టల్లో వేయాలన్నా ఆలోచించవలసిన పరిస్థితి ఉంది.
మా బంధువులు, ఫ్రెండ్స్ నాతో ఏమనేవారంటే.. నువ్వు పిల్లల్ని హాస్టల్లో వేసి భర్త వద్దకు వెళ్ళవచ్చు కదా ! అంటూ ఎన్నో సలహాలను ఇస్తుండేవారు.
నా అభిప్రాయం ఏమిటంటే .. పెద్దవాళ్ళు ఎలాగైనా ఉండగలరు...
పిల్లల్ని హాస్టల్లో వేస్తే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశముందని నా అభిప్రాయం.
పిల్లలు ఎదిగే వయసులో సరైన పౌష్టికాహారం తీసుకోవాలి . హాస్టల్లో సరిగ్గా ఆహారం తీసుకుంటారో లేదో తెలియదు.
ఇక హాస్టల్స్లో ర్యాగింగులు.. వంటి ఎన్నో సమస్యల గురించి వింటున్నాం.
(హాస్టల్ బయట ఉన్నా కూడా ర్యాగింగులు ఉండే అవకాశం ఉంది కానీ.. హాస్టలో మరింత ఎక్కువ సమస్యలు ఉండే అవకాశం ఉంది కదా!)....
ఇవన్నీ కూడా ఆలోచించి ఉన్న ఊరిలోనే ఉండటం జరిగింది.
ఇలా దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు జరుగుతుండగా .. దైవం దయ వల్ల నా భర్తకు బదిలీ జరిగి మేము ఉన్న ఊరికి రావటం జరిగింది. ఇందుకు దైవానికి అనేక కృతజ్ఞతలు.
ప్రస్తుతానికి ప్రమోషన్ తీసుకోవాలని అనుకోవటం లేదు. ఇబ్బందికరంగా బదిలీ వస్తే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవటం మంచిది అని నా అభిప్రాయం.
ఏమైనా ఈ రోజుల్లో మారిన వ్యవస్థ వల్ల అనేక ఇబ్బందులు వస్తున్నాయి. పాతకాలంలో ఇన్ని సమస్యలు ఉండేవి కాదనిపిస్తుంది.

No comments:
Post a Comment