koodali

Wednesday, June 8, 2016

రాష్ట్రం అభివృద్ధి...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కొరకు అందరూ కృషిచేయవలసి ఉంది. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతాలు అభివృద్ధి చెందలేదు.

 ఆంధ్రప్రదేశ్లో ఎంతో సముద్ర తీరం ఉన్నా,   పోర్టులు అంతగా అభివృద్ధి చేయబడలేదు. అరకు, తలకోన వంటి ఆహ్లాదకర ప్రాంతాలు ఉన్నా ఎవరూ అభివృద్ధి చేయలేదు.

 ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులు , ప్రజలు కూడా  రాజధాని అనే ఉద్దేశంతో హైదరాబాద్లోనే ఎక్కువగా తమ పెట్టుబడులను పెట్టారు. 

దురదృష్టం ఏమిటంటే విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్కు అన్యాయమే జరుగుతోంది.

 విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చటం లేదు. 

  ఆర్ధికంగా మిగులు ఉన్న రాష్ట్రాలు అభివృద్ధి పధకాలు ప్రకటించటంలో  గొప్పేం లేదు. 

 ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తే అది గొప్పవిషయం.  

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందటానికి రాజకీయపార్టీలు, అధికారులు, ప్రజలు అందరూ ఐకమత్యంగా కృషిచేయాలి.

 ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వారే కానీ... వారిలో కొంత మందికి ఐకమత్యం, సొంత రాష్ట్రం అంటే అభిమానం అంతగా ఉన్నట్లు అనిపించదు.  

వ్యక్తిగతంగా ఆర్ధికాభివృద్ధి, సౌకర్యాలు ఉంటే చాలదు ..ఆత్మాభిమానం  కూడా ఉండటం అవసరం. 

 ఆంధ్రప్రదేశ్కు చెందిన పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పెట్టుబడులను పెట్టాలి.

  ఆంధ్రప్రదేశ్ వాళ్ళు .....  ఆత్మాభిమానం, ఐకమత్యంతో    రాష్ట్ర అభివృద్ధి కొరకు  ఎవరి పరిధిలో వారు చిత్తశుద్ధితో కృషిచేయవలసి ఉంది.

ఆంధ్రప్రదేశ్కు జరుగుతున్న అన్యాయానికి ధీటుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి  చెందాలి. అందుకు  అందరూ పౌరుషంగా కృషిచేయాలి.

 పాలకులు, అధికారులు, ప్రజలు అందరూ చిత్తశుద్ధితో కృషిచేస్తే త్వరలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది.
**************
 
ఆంధ్రరాష్ట్రంలో ఎన్నో వనరులున్నాయి. తెలివైన ప్రజలున్నారు.  సాయంచేయమంటూ ప్రతిదానికి అందరినీ అడగటం మాని మనరాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. 
 
 
మరీ బాగా అభివృద్ధి జరిగినా కొన్ని సమస్యలు వస్తాయి. ఏ ప్రాంతం అయినా బాగా అభివృద్ధి అయితే, ఇతరులు కూడా అక్కడికొచ్చి స్థానికులకు ఉపాధి దొరకని పరిస్థితి వస్తుంది. మనవాళ్ళు కూడా ఇతరప్రాంతాలకు పోవటం వల్ల అక్కడివారికి ఉపాధి పోతోందని అక్కడవాళ్ళు అంటున్నారు కదా.. అందువల్ల అన్ని ప్రాంతాలు, అన్నిదేశాలు అభివృద్ధి చెందాలి.


 కొందరు ఇతరప్రాంతాల వాళ్ళు ఇక్కడికొచ్చి సెటిల్ అయ్యి, తరతరాలుగా స్థానికులైన వారికి నష్టం జరిగేటట్లు ప్రవర్తిస్తారు. వేరే ప్రాంతాల వాళ్ళంటే నాకు కోపం ఏమీలేదు. అయితే, ఎవరైనా మంచిగా ప్రవర్తించాలి.  కొందరు ఎంతో మంచివారు ఉంటారు. ఉదా..సర్ ఆర్ధర్ కాటన్ మహాశయులు వేరేదేశం వారయినా ఇక్కడకొచ్చి ఎంతో సహాయం చేసారు. అలాంటి వారిని తరతరాలుగా మంచిగా గుర్తుంచుకుంటారు. చెడుచేసేవారు, అసూయ, అత్యాశ..వంటి గుణాలున్నవారు  స్థానికులైనా, ఇతరులైనా.. వారు నిందార్హులే.  అందువల్ల, అందరూ మంచిగా ఉండాలి.


No comments:

Post a Comment