ఈ మధ్య ఊరు వెళ్లి వచ్చాము. ఎక్కడ చూసినా జనసమ్మర్దమే.
మంది ఎక్కువయితే మజ్జిగ పలచన అవుతాయని సామెత ఉంది కదా . జనాభా పెరిగేకొద్దీ వనరులు సరిపోవు.
మన దేశ జనాభాకు తోడు ఇతరదేశాల నుండి కూడా జనం ఇక్కడకు వస్తున్నారంటున్నారు.
(అయితే, మన దేశం వాళ్లు కూడా ఇతరదేశాలకు వెళ్తున్నారు లెండి. )
ఇవన్నీ గమనిస్తే ఏమనిపిస్తుందంటే ...దేశం బాగా అభివృద్ధి చెందినా ప్రమాదమేనేమో అనిపిస్తోంది.
( అలాగని పేదరికం ఉండటం మంచిది కాదు.)
దేశం బాగా అభివృద్ధి చెందితే ఎక్కడెక్కడి వాళ్ళో వస్తారు. జనాభా బాగా పెరిగిపోతుంది. సమస్యలూ పెరుగుతాయి.
పాతకాలంలో భారతదేశపు సంపద చూసే కదా విదేశీయులు వచ్చి దాడులు చేశారు.
ఇంకా ఏమనిపిస్తోందంటే.. దేశంలో మరీ ఎక్కువ అభివృద్ధి జరగక పోయినా ఫర్వాలేదు.
అందరికీ నిత్యావసరాలకు లోటు లేకుండా ఉండాలి.
అవసరమైనంత వరకు ఆధునిక టెక్నాలజీ ఏర్పరుచుకోవాలి.
దేశ రక్షణ కొరకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి..అనిపిస్తోంది.
No comments:
Post a Comment