ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎందరో రైతులు ప్రకృతి వ్యవసాయం పట్ల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రకృతి వ్యవసాయాన్ని ప్రొత్సహిస్తున్న ప్రభుత్వం ఎంతో మంచిపని చేస్తోంది.
ప్రకృతి వ్యవసాయం గురించి కొన్ని వివరాలను ఈ లింక్ వద్ద తెలుసుకోవచ్చు.
oka link..Margadarshi - Subhash Palekar - YouTube
oka link..సేంద్రియ పద్ధతి..
..........................
marikonni vishayaalu..
రైతులకు కొన్ని సమస్యలున్నాయి. పరిశ్రమల వాళ్ళు చిన్న వస్తువు తయారు చేసినా దానికి వారికి నచ్చినట్లు ధర చెబుతారు. ఈ రోజుల్లో రైతులకు తను పండించే పంటకు ధరను స్వంతంగా చెప్పుకునే హక్కు ఉందా? వ్యవసాయంలో సరైన ధరరాక రైతులెందరో కష్టపడుతున్నారు.
కూరగాయలు, పండ్లు పండించాలంటే, విత్తనం వేసి మొలకెత్తి, పెరిగి చీడపీడలకు తట్టుకుని, తుఫాన్లు వచ్చి పాడవకుండా పంట చేతికి అందాలంటే ఎంతో కష్టం ఉంటుంది. అలా పంట చేతికొస్తే, దళారులు, వినియోగదారులు తక్కువ ధరకు అడుగుతారు.
గోడవున్లలో ఆహారపదార్ధాలు పాడవకుండా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాలి.కొంత తక్కువధరకు పేదవారికి ఇవ్వవచ్చు.
...................................
ఐటి వంటి వారికి నెలకు కొన్నివేలు, కొందరికి లక్ష వరకు ఆదాయం వస్తోంది. రైతులకు కొన్నివేలు, లక్ష ఆదాయం రావాలంటే సంవత్సరం పడుతుందేమో?
ఐటీవాళ్లకు ఎంత కష్టపడి పని చేసినా కూడా, ఉద్యోగాలు ఎన్నాళ్లుంటాయో చెప్పలేము. చాలామంది ఉద్యోగాలు ఉన్నప్పుడే సంపాదించుకుని దాచుకుంటారు. ఒక ఉద్యోగం పోయినా ఇంకో ఉద్యోగానికి వెళ్తారు.
రైతులకు ఉద్యోగం పోతుందని భయం ఉండదు. కాని,ఉద్యోగాల వాళ్లతో పోలిస్తే ఆదాయం తక్కువ ఉంటుంది. చక్కగా ప్రణాళిక వేసుకుంటే చక్కటి ఆహారం, ప్రకృతి మధ్య జీవితం ఉంటుంది.
..............................
ఈరోజుల్లో పల్లె జీవితం ఎక్కువమందికి నచ్చటం లేదు. సిటీలే నచ్చుతున్నాయి..చాలామంది వ్యవసాయం చేయటం కన్నా, ఉద్యోగాలే కావాలంటున్నారు.
ఉద్యోగాలు చేసేవాళ్ళు నెలకు వేలరూపాయలు సంపాదిస్తుంటే, రైతులు తక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయం చేస్తూ కష్టాలు పడుతూ అందరికి అన్నం పెట్టాలంటే కష్టం కదా.. రైతులు వ్యవసాయం మానకుండా ఉండాలంటే, రైతులకు కూడా ఆదాయం బాగుండాలి కదా.
..............................
పాతకాలంలో పల్లెల్లో వ్యవసాయంచేస్తూ చక్కటి ఆహారం తింటూ, పత్తితో దుస్తులు నేసేవాళ్లు నేస్తుంటే, ఆ దుస్తులు కొనుక్కుని, వృత్తివిద్యలు చేసేవాళ్లు చేసే పరికరాలను కొనుక్కుని ఉన్నంతలో చక్కగా జీవించేవారు.
పాతకాలంలో వృత్తివిద్యలు ఉన్నప్పుడు చదువు, ఉద్యోగం అని వేరే ఊళ్లకు వెళ్ళి హాస్టల్స్ లో ఉండటం తక్కువగా ఉండేది . పిల్లలు తమ పెద్దవారినుంచి వృత్తివిద్యలు నేర్చుకుని ఉన్నఉళ్లోనే ఉండేవారు. కాలేజీల్లో సీట్లకొరకు, ఉద్యోగాల కొరకు ఎదురుచూపులు ఉండేవికాదు.
...............................
పాతకాలంలో ఆధునిక టెక్నాలజి లేదు. సినిమాలు, టీవీ సీరియల్స్, సెల్ఫోన్లు, కార్లు, క్లబ్బులు, పబ్బులు, రెస్టారెంట్స్, ఆధునిక విలాసాలు లేవుకదా..ఇప్పుడు ప్రజలు చాలామంది ఇవన్నీ అలవాటుపడ్దారు.
పల్లెలకు కొంతదూరంలో సిటీలు ఉంటే, పల్లెలో వ్యవసాయం చేసి అప్పుడప్పుడు సిటీకి వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు. పిల్లలకు స్కూల్స్, కాలేజిలు ఒకసమస్య అంటారు కానీ, ఈ రోజుల్లో ఉన్నఊళ్లోనే అందరికి సీట్లు లభించటం లేదు కదా..చాలామంది హాస్టల్స్లో ఉంటున్నారు.
ఇప్పుడు చాలామందికి సిటీల్లో ఇళ్లు, కార్లు, విలాసవంతమైన ఇళ్ళు, ఆధునికటెక్నాలజి, రకరకాల కొత్తవస్తువులు కావాలి.
టెక్నాలజి వద్దని నా అభిప్రాయం కాదు. పర్యావరణసహిత టెక్నాలజి మంచిది. టెక్నాలజిని అతిగా కాకుండా, ఎంతవరకు అవసరమో అంతవరకు వాడుకోవాలి.
....................................
ఉపాధి అవకాశాలు సిటీల్లోనే ఉండటం వల్ల అక్కడకు వలసలు వెళ్ళి పొల్యూషన్ మధ్య బ్రతకవలసి వస్తోంది.
పరిశ్రమలు అన్ని సిటీల్లోనే కాకుండా, సిటీలకు కొంతదూరంగా చిన్ననగరాల్లో కూడా ఏర్పాటు చేసి అక్కడకూడా మంచి స్కూల్స్, కాలేజీలు, హాస్పిటల్స్, పార్కులు..ఏర్పాటుచేస్తే సిటీల్లో భారం తగ్గుతుంది.

కొందరు సిటీల్లో పొల్యూషన్ ఇష్టపడక, సిటీకు దూరంగా ప్రకృతి వ్యవసాయంతో
కూరగాయలు, పండ్లమొక్కలు, పువ్వుల మొక్కలు.. పెంచుకుంటూ, ఆధునిక వసతులతో కూడా చక్కగా నివసిస్తున్నారు.
No comments:
Post a Comment