ఈ రోజుల్లో నీటి విలువ గురించి అందరికీ తెలిసినా కూడా చాలామంది నీటిపొదుపును పాటించటం లేదు.
కొందరు పెద్దవాళ్ళు బట్టలు ఉతికినంత సేపు పంపును అలాగే వదిలేస్తుంటారు. పెద్ద ధారతో నీళ్లు పోతూ ఉంటాయి.
వాకిలి కడగటానికి కొద్దిగా నీళ్లు చాలు. అయితే చాలామంది పైపుతో బోలెడు నీళ్లు గుమ్మరించి కడిగేస్తుంటారు.
అసలే నీటికొరత బాగా ఉన్న ఈ రోజుల్లో నీళ్ళు ఉన్నవాళ్ళు ఇలా ధారాళంగా వాడేస్తుంటే క్రమంగా ఆ ప్రాంతంలో భూగర్భనీటిమట్టం పడిపోయి అందరికీ నీటి కొరత ఏర్పడుతుంది.
ఈ రోజుల్లో ఇళ్లలో ప్రతి గదికి పంపులు ఉంటున్నాయి.
చాలా మంది ఇళ్లలో పంపులు లూజ్ అయి ఒక్కొక్క బొట్టూ నీరు పోతూ ఉంటుంది . వాటిని రిపేర్ చేయకుండా అశ్రద్ధ చేస్తారు.
ఒక్కొక్క బొట్టు పోతున్న పంపు క్రింద బకెట్ పెడితే గంటలో బకెట్ నిండిపోతుంది. ఇలా ఎంతో నీరు వృధాగా డ్రైనేజ్లోకి పోతుంటుంది.
పాతకాలంలో అయితే గదిగదికీ పంపులు ఉండేవి కాదు, నీళ్లను బయటనుంచి మోసుకుని తెచ్చుకోవాలి కాబట్టి , నీళ్ళను వృధాగా పారబోసేవారు కాదు.
వాషింగ్ మెషిన్ వల్ల నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది. వేసవికాలం వాషింగ్ మెషీన్ వాడకం కొంత వరకూ తగ్గించుకుంటే మంచిది.
కొన్ని దుస్తులు చేతితో ఉతుక్కుంటే నీరు పొదుపు అవుతుంది.
నీటిని వృధాచేయవద్దని ఎందరు చెబుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.
డ్రైనేజ్ నీటిని శుద్ధి చేసి ,టాంకర్లతో తరలించి రోడ్ల ప్రక్కన పెంచే మొక్కలకు పోయవచ్చు.
అందరూ బాధ్యత వహించితేనే నీటిసమస్యలు తగ్గుతాయి.
బాధ్యతగల పౌరులు ఎక్కువగా ఉన్న దేశం బాగుపడుతుంది .

వేసవిలో సాయంకాలం.. మొక్కలకు నీరు పోయాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
ReplyDeleteపంపు తిప్పగానే వచ్చే మొదటి నీరు వేడిగా ఉంటుంది. కొద్దిసేపటి తరువాత చల్లటి నీరు వస్తుంది. ఆ చల్లటి నీరు మొక్కలకు పట్టాలి.
మొదట వచ్చిన వేడినీటితో వాకిలి కడుక్కోవచ్చు. లేక బకెట్లో పట్టుకుని ఇతరపనులకు వాడుకోవచ్చు.