ఈ రోజుల్లో ఎన్నో రంగాలలో ఉపాధి లభించటం చాలా సమస్యగా ఉంది. ఉపాధి లభించకపోవటం వల్ల ఆదాయం లేక ఎందరో ఇబ్బందులు పడుతున్నారు.
ఒక్కో రాష్ట్రం నుంచి ప్రతి సంవత్సరము ఇంజనీరింగ్ కాలేజీల నుండి ఎన్నో వేలమంది వరకూ పట్టాలు పుచ్చుకుని బయటకు వస్తున్నారు. దేశం అంతటా కలిపితే ఎన్నో లక్షల మంది ఉంటారు.
పరిశ్రమల ద్వారా కొందరికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి. ఆ ఉద్యోగస్తులు కొన్ని సంవత్సరాలు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తారు.
ఇలాంటప్పుడు , ప్రతి ఏటా కాలేజీల నుండి బయటకు వచ్చే లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాలంటే ఎలాగో తెలియదు.
ప్రతి సంవత్సరం ఎన్నని కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయగలరు ?
నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలు తగ్గాలంటే ఆర్ధిక అసమానతలు తగ్గించటమే పరిష్కారం.
కొందరి వద్ద విపరీతంగా సొమ్ము ఉండటం ....కొందరి వద్ద సొమ్ము లేకపోవటం వల్ల ఆర్ధిక అసమానతలు ఏర్పడతాయి.
ప్రపంచంలోని వనరులపై అందరికీ హక్కుంది. అయితే, బలవంతులు, తెలివిగలవాళ్ళు సంపదను తమ చేతుల్లో ఉంచుకుని బలహీనులకు అన్యాయం చేస్తున్నంత వరకూ సమాజంలో ఆర్ధిక అసమానతలు , నిరుద్యోగం, పేదరికం ఉంటూనే ఉంటాయి.
ప్రభుత్వాల వద్ద సంపద ఉండటం వల్ల ఎన్నో ఉద్యోగాలను సృష్టించుకోవచ్చు. సంపద ఉండాలంటే సమాజంలో ఆర్ధిక అసమానతలు తగ్గించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి.
నల్లడబ్బును అరికట్టటం, అన్ని రంగాలలో ధరలను అదుపులో ఉంచటం ..వంటి విషయాలలో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి.
అందరికీ కనీస అవసరాలు తీరటం ఎంతో అవసరం. ముఖ్యంగా ఆహారం లభించకపోతే ప్రజలలో నేరప్రవృత్తి పెరిగే అవకాశం ఉంది.
నిరుద్యోగం, పేదరికం వంటి పరిస్థితులు చక్కదిద్దటానికి ప్రభుత్వాలకు సమయం పడుతుంది. అంత వరకూ ప్రజలకు ఆకలిబాధలు లేకుండా ప్రభుత్వాలు తక్కువ ధరకు ఆహారాన్ని అందించాలి.
కొన్ని రాష్ట్రాలలో ప్రభుత్వం వాళ్ళు తక్కువ ధరకే భోజన సదుపాయం కల్పిస్తున్నారు.
ప్రభుత్వాలు ప్రజలకు చేరువ కావాలన్నా తక్కువ ధరకే భోజనసదుపాయం కల్పించటం అనేది ఒక చక్కటి మార్గం.

ఈ బ్లాగ్ ను ప్రోత్సహిస్తున్న అందరికి కృతజ్ఞతలండి.
ReplyDelete