ఈ క్రింద వ్రాసిన విషయాలను ఈ పోస్ట్ వేసిన తరువాత చాలాకాలానికి వ్రాసి, ఇక్కడ పోస్ట్ చేసానండి.
.............
ప్రాచీనులు ఏర్పాటు చేసిన వ్యవస్థలో చాలా విషయాలున్నాయి.
పాతకాలంలో చాలామంది, వృత్తివిద్యలను కుటుంబంలో పెద్దవాళ్ళనుండి నేర్చుకుని జీవనోపాధి పొందేవారు. ఎవరి బతుకులు వాళ్ళు బతికేవారు.
కొందరు విదేశీయాత్రికుల రచనల ప్రకారం భారతదేశంలో ఆ రోజుల్లో పేదరికం లేదని, అందరూ చక్కగా జీవించేవారని తెలుస్తుంది.(అంటే,అన్ని వర్గాల వారు చక్కగా జీవించారనే అర్ధం కదా..)
అయితే, కాలక్రమంలో కొందరు స్వార్ధపరులైన వారు గ్రంధాలలో మార్పులుచేర్పులు చేసి, సమాజంలో అసమానతలను వ్యాపింపజేసారు. అలా వ్యవస్థను పాడుచేసారు.
................
అప్పట్లో సంస్కృతము.. మొదలైనవి నేర్పించటానికి కొన్ని గురుకులాలు ఉండేవి. ఇతర విద్యలు నేర్పించటానికి కూడా కొన్ని విద్యాలయాలు ఉండేవి.
ఉదా.. నలందా విద్యాలయము వంటివి. అయితే, అవి అందరికి అందుబాటులో ప్రతి ఊరిలో ఉండటం కాకుండా, కొన్నే ఉండేవి కావచ్చు.
చాలామంది పెద్దవారికి అనేక కారణాలతో తమ పిల్లలను విద్యాభ్యాసం కొరకు వేరే ప్రాంతానికి పంపటం ఇష్టం ఉండదు.
పాతకాలంలో చాలామంది పెద్దవాళ్లు తమకు చక్కగా వచ్చిన వృత్తి విద్యలను, అందులో మెలకువలను తమ పిల్లలకు నేర్పించి, వారిని ఆ విద్యలలో నిష్ణాతులుగా చేసేవారు కావచ్చు.
ఇందువల్ల, పిల్లలకు కూడా విద్య కొరకు ఎక్కడికో వెళ్ళటం, అక్కడ ఆహారం, వసతి గురించి ఇబ్బందులు లేకుండా ఉండేది.పెద్దవాళ్ళకు.. దూరంగా ఉన్న పిల్లలు చక్కగా ఉన్నారో? లేక చెడు సావాసాలతో తిరుగుతున్నారో? అని భయాలూ లేకుందా ఉంటాయి.
అయితే, వంశానుచారం వచ్చే వృత్తులు నేర్చుకునే వారికి, వేరే వృత్తి నేర్చుకోవాలంటే అంత కుదరదు, మరల వేరే వాళ్ల దగ్గరకు వెళ్లి నేర్చుకోవాలి.
ఇలా కొన్ని కారణాల వల్ల కూడా వంశపారంపర్యంగా కొన్ని వృత్తివిద్యలు అలా కొనసాగిఉండవచ్చు.
..............
ఎన్నో వృత్తివిద్యలుంటాయి. ఒక్కోదానికి కాలేజీలను ప్రతి ఊరిలోనూ ఏర్పాటుచేయాలంటే ఏ రోజుల్లో అయినా కష్టమే.
..............
ఈ రోజుల్లో కూడా కొందరికి అనేక కారణాల వల్ల తమకు ఇష్టమైన విద్య చదవటానికి సీట్ లభించక వేరే చదువు చదువుతారు.
ఈ రోజుల్లో మాత్రం అంతా సుఖంగా ఉందా? చిన్నప్పటినుంచి స్కూల్స్లో సీట్ల కొరకు పోటీలు, బోలెడు ఫీజులు, పెద్దయ్యాక.. ఉన్న ఊళ్ళో కాలేజీలో కోరుకున్న చదువులో సీట్ లభిస్తుందో? లేదో? అని టెన్షన్, తరువాత చదివిన చదువుకు ఉపాధి ఎప్పుడు లభిస్తుందో ? అనే టెన్షన్, ఉద్యోగం లభిస్తే పోకుండా ఎంతకాలం ఉంటుందో? అని భయాలు.
ఇప్పటి వాళ్ళు కొందరు విద్యకొరకు వేరే ప్రాంతాలలో స్కూల్స్, కాలేజీలలో సీట్ల కొరకు ఎంతో కష్టపడి చదివి సీట్లు సంపాదించి హాస్టల్స్లో లేక బయట రూంస్ లో ఉండి చదువుతుంటారు. కొందరు అక్కడ ఆహారం సరిగ్గా బాగుండక ఇబ్బందులు పడుతుంటారు.
పాతకాలంలో వాళ్ళు చాలామంది తమ పెద్దవాళ్ల ద్వారా వృత్తివిద్యలు నేర్చుకుని ఉపాధి పొందేవారు.
అదొక పరిస్థితి..ఇదొక పరిస్థితి. కొన్ని లాభాలు..కొన్ని నష్టాలు.రెండింటి లోను కొన్ని సంతృప్తులు..కొన్ని అసంతృప్తులు.
...............
ఆధునికకాలంలో ఎక్కువమంది చదువు, ఉద్యోగాల కొరకు ప్రభుత్వాల పైనో, కార్పొరేట్ కంపెనీలపైనో ఆధారపడి, తమకు ఉపాధి కల్పించమని వారిని అడిగే పరిస్థితి ఉంది.
పాతకాలంలో సమాజానికి అవసరమైనవి ఇక్కడే తయారుచేసి వాడుకునేవాళ్లం. ఆహారపప్పుదినుసులు కూడా ఇక్కడి విత్తనాలే వాడేవాళ్లం. అందువల్ల, ఇతరులపై ఆధారపడే అవసరం లేకుండా, ఆర్ధికాభివృద్ధి ఉండేది. ఇప్పుడు ఎన్నో వస్తువులు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాము.
అప్పట్లో యంత్రాలు లేవు కాబట్టి, ఒక వస్తువు తయారుకావటానికి కొన్ని రోజులు పట్టేది. ఇప్పుడు ఒక గంటలోనే చాలా వస్తువులు తయారుచేస్తున్నారు. ఇందువల్ల, నిరుద్యోగసమస్య పెరిగి, ప్రకృతివనరులు త్వరగా తరిగిపోవటం, పర్యావరణసమస్యలు ఉంటాయి. కొన్ని కష్టమైన పనులకు యంత్రాలను ఉపయోగించవచ్చు.
..................
పాతకాలంలో స్త్రీలు కుటుంబబాధ్యతలను చూసుకుంటే, పురుషులు బయటకెళ్లి, సంపాదన వ్యవహారాలను చూసుకునేవారు.ఉన్నదాంట్లో పొదుపుగా తృప్తిగా జీవించేవారు.
అయితే, అప్పట్లో వృత్తిపనులు చేసే మగవారు కొందరు ఇంటి వద్దే పనులు చేసేవారు.అప్పటి స్త్రీలు కొందరు ఇంటి పనుల తరువాత ఖాళీ సమయం ఉంటే కొంత రెస్ట్ తీసుకుని, మగవారికి వృత్తిపనులలో సాయం చేసేవారు.
పగలు పురుషులు పని చేసి, తరువాత విశ్రాంతి తీసుకునేవారు. స్త్రీలు ఇంటిపట్టున ఉండి, హడావిడి లేకుండా ఇంటిపనులు చూసుకునేవారు. వారికి పగలు కొంత విశ్రాంతి తీసుకునే సమయం కూడా ఉండేది.
ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఇద్దరూ ఉద్యోగాలని బయటకెళ్ళి, రాత్రికి ఇంటికి వచ్చి ఇంటి పనులు చేస్తూ ఎవరికీ విశ్రాంతి ఉండటం లేదు. పనివత్తిడి వల్ల ఇద్దరూ గొడవలు పడుతున్నారు.
...........
పాతకాలంలో చాలా ఉమ్మడికుటుంబాల్లో స్త్రీలకు ఒకరిపై ఒకరికి అభద్రతాభావం, తమదే పై చేయి కావాలనే పెత్తందారి ధోరణి వల్ల స్త్రీలు గొడవలు పడేవారు.
స్త్రీలలో ఐకమత్యం లేకపోవటం వల్లకూడా పురుషాధిక్యత పెరిగింది. ఇవన్నీ కలసి కుటుంబాల్లో గొడవలు జరిగేవి. ఆ విధంగా ఆ వ్యవస్థ బలహీనమయ్యింది.
చతురాశ్రమాల గురించి పెద్దలు తెలియజేసారు. వానప్రస్థంలో, సన్యాసాశ్రమాల్లో అడవులకు వెళ్ళకుండా కుటుంబాలతో ఉన్నా కూడా, కుటుంబ లంపటాలను తగ్గించుకుని దైవస్మరణ, అందరితో మంచిగా ఉండటం చేయాలి.
అలా కాకుండా, అప్పుడు కూడా కుటుంబం గురించి తీవ్రమైన కాంక్షతో ప్రాకులాడటం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి.
ఉదా..కుటుంబంలో అందరూ తాము చెప్పినట్లే విని తీరాలి.. అనుకుంటే కష్టం.
ఈ రోజుల్లో చాలావరకు చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. స్త్రీలు ఉద్యోగాలు చేస్తున్నారు. వివాహం అయ్యాక ఇంటాబయటా పనివత్తిడి ఎక్కువ అయ్యి, భార్యాభర్త గొడవలు పడటం, సమయం లేదని బయట ఆహారం తినటం, ఇలా చాలామందికి అనారోగ్యాలు వస్తున్నాయి.
ఉద్యోగాల వల్ల కొందరు తమ చిన్నపిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. కొందరు తమ పిల్లల్ని చదువులంటూ చిన్నతనంలోనే హాస్టల్స్ లో వేస్తున్నారు.
బాగా చదివి, బోలెడు జీతాలున్న ఉద్యోగాలు సంపాదించి, చాలా ఇళ్ళు, బోలెడు బంగారం, రకరకాల వస్తువులు కొనాలనే కోరికల వల్ల ఎంత డబ్బూ సరిపోదు. కొనేవాళ్లు పెరిగేసరికి వ్యాపారస్తులు వస్తువుల ధరలను బాగా పెంచేస్తున్నారు.
ఇలా వ్యవస్థలు మారిపోయాయి. పాపాలు చేసి అయినా, డబ్బు సంపాదించాలని అనుకునేవారు పెరిగారు. ఎన్ని చేసినా మనశ్శాంతిగా బతికే వారెందరు?
oka link...గృహిణిగా ఉండటం ఎంతో గొప్ప విషయం. .
ఈ రోజుల్లో కొందరు స్త్రీలు స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. సాటి స్త్రీలను కూడా ఇబ్బందిపెడుతున్నారు. పురుషులు కూడా తమ స్వేచ్చ అంటూ అతిగా ప్రవర్తిస్తున్నారు. విడాకులు ఎక్కువయ్యాయి.
అక్రమసంబంధాలు ఉన్నవాళ్ళ వల్ల.. వారిని వివాహం చేసుకున్న పురుషులు స్త్రీలు ఇద్దరికి ఇబ్బందే. కొందరు స్త్రీలు, పురుషులు తమ అక్రమసంబంధాలకు అడ్డుగా ఉన్నారని సొంత పిల్లల్ని కూడా కొట్టిన వార్తలను విన్నాము.
వివాహమైన పిల్లలకు, పెద్దవాళ్ళకు సరిగ్గా పడకపోతే , ఒకే ఇంట్లో కాకుండా పక్కపక్క ఇళ్ళలో ఉండవచ్చు.ఎవరి ప్రైవసి వారికుంటుంది. అవసరమైనప్పుడు ఒకరికొకరు సాయపడవచ్చు. అలా కుదరదు అంటే, ఒకే ఊరిలో దూరంగా ఉండవచ్చు. ఇంకా కాదంటే, వేరే ఊళ్లలో ఉండవచ్చు.
భార్యాభర్తకు పడనప్పుడు సాధ్యమైనంతలో సర్దుబాట్లు చేసుకుంటూ జీవించటానికి ప్రయత్నించాలి. పిల్లలుంటే వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవర్తించాలి. ఇంకా భరించలేని పరిస్థితి ఉంటే.. కేసులు, గొడవలు కాకుండా, మధ్యవర్తులను (సైకాలజిస్టులు..)ఉంచి మాట్లాడుకుని విడిపోవటం తప్ప ఏం చేయగలరు?
పిల్లలకు తల్లితండ్రి ఇద్దరితో కలసి ఉండాలని ఉంటుంది. పిల్లలు అమ్మనాన్నతో కలసి తమ ఇంట్లో జీవించాలనుకుంటారు. అయితే, ఈరోజుల్లో కొందరు పేరెంట్స్ విడాకుల తరువాత వేరే వివాహం చేసుకుంటున్నారు.
పిల్లలకు తల్లి దగ్గర వేరేనాన్న, తండ్రి దగ్గర వేరే తల్లి ఉంటారు. పిల్లలకు ఇది బాధగా ఉంటుంది. అయితే, పెద్దవాళ్ళ హక్కుల గురించే అందరూ మాట్లాడతారు కానీ, పిల్లల హక్కులు, వారి ఆశల గురించి ఎంతమంది తల్లితండ్రి ఆలోచిస్తున్నారు?
ఇక పిల్లలు వాళ్ల అమ్మమ్మతాత లేక నాన్నమ్మతాత లేక హాస్టల్స్లో ఉండవలసి ఉంటుంది. వాళ్లు అప్పటికే వృద్ధులు అయి వాళ్ళకు ఎక్కువ ఓపిక ఉండదు.ఇక ఆ పిల్లలను ఏం సరిగ్గా చూసుకోగలరో?
ఈ రోజుల్లో స్త్రీలు, పురుషులు ఉద్యోగాల వల్ల పనివత్తిడి బాగాపెరిగింది. అలసిపోయి చిన్న మాటకే గొడవలు పెరుగుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే, అమ్మాయి అబ్బాయి తరపు పెద్దవాళ్ళు కూడా కొందరు పంతాలు, పట్టింపులకు పోయి గొడవలు పెంచుతున్నారు.
కొందరు ఫ్రెండ్స్, బంధువులు, చుట్టుపక్కల వాళ్లు కూడా ఎందుకు తగ్గాలి, ఎందుకు సర్దుకుపోవాలంటూ గొడవలు పెంచుతున్నారు.
పాతవ్యవస్థలోనూ ఇప్పటి వ్యవస్థలోను కొన్ని సర్దుబాట్లు చేసుకుంటూ ఉండాలి.ఇప్పడు కుటుంబవ్యవస్థ ప్రమాదంలో ఉంది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియటం లేదు.వ్యవస్థను బాగుచేసుకోవాలి.
........
oka link..

ఇన్ని శుభకాంక్షలు అవసరమా?
ReplyDeleteశుభం జరగాలని కోరుకోవటం అవసరమే కదండి.
ReplyDeleteమీకు మరియు అందరికి మరొక్కసారి శుభాకాంక్షలు.