కొందరు ఏమంటారంటే.. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళు ఇరుగుపొరుగుతో తీరికగా పిచ్చాపాటి మాటలు చెప్పుకుంటూ టైం వేస్ట్ చేస్తుంటారు.... అంటూ ఉద్యోగం చేయకుండా ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళ జీవితాలు వృధా అన్నట్లు మాట్లాడుతుంటారు.
ఆడవాళ్ళు ఇంటిపట్టున ఉంటే ఎన్నో లాభాలున్నాయి. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళు తమ చంటిపిల్లలను క్రెష్లో వేయకుండా తామే చక్కగా చూసుకోవటానికి సమయం ఉంటుంది. పిల్లలను స్వయంగా పెంచుకున్నామనే తృప్తీ ఉంటుంది.
ఎదిగే వయసులో పిల్లలను దగ్గరుండి చూసుకోవటం , పిల్లలకు చక్కటి సమతులాహారాన్ని ఇవ్వటం ఎంతో అవసరం.
చక్కటి పోషణలో పెరిగిన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు డబ్బుకన్నా ఆరోగ్యాన్ని అందించటం ఎంతో అవసరం.
ఎదిగే వయసులో పిల్లలకు తల్లితండ్రుల ప్రేమానురాగాలు, పర్యవేక్షణ కూడా అవసరం.
హాస్టల్స్లో పిల్లలు సరైన సమతులాహారాన్ని తీసుకుంటారా ?
హాస్టల్స్లో ఎవరైనా వేధిస్తుంటే ఏం చేయలేక పిల్లలు తమలో తామే క్రుంగిపోతారు. వీలైనంతవరకూ పిల్లల్ని ఇంట్లో ఉంచి చదివించుకోవటమే మంచిది.
ఇంకో విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో ఉన్న కొద్ది ఉద్యోగాల కోసం స్త్రీలు, పురుషులు పోటీపడుతున్నారు కదా! ఇంటిపట్టున ఉండే ఆడవాళ్ళ స్థానంలో కొందరు మగవాళ్ళకు ఉద్యోగాలు లభిస్తాయి.
ఇంటిపట్టున ఉండే స్త్రీలను చిన్నచూపు చూడటం తగదు.
.......................
ఆడ వాళ్ళు ఇంటి నుంచి బయటకు రావాలని రప్పించారు. బాగానే ఉంది. మరి బయటకు వచ్చిన స్త్రీలు అందరూ కష్టాలు లేకుండా హాయిగా ఉన్నారా ?
బడికి వెళ్లే చిన్నపిల్ల వద్ద నుంచి ఆఫీసుకు వెళ్ళే పెద్ద ఆమె వరకూ ఎప్పుడు ఏ మగవాళ్ళ వేధింపులు ఎదురవుతాయో తెలియక భయపడుతూనే ఉన్నారు.
వార్తాపత్రికలు చూస్తే .. ఆడవాళ్ళ పట్ల జరుగుతున్న ఎన్నో దారుణమైన వార్తలను వింటున్నాము. ఇక వార్తలలో రాకుండా ఉన్నవి ఎన్ని దారుణాలు ఉన్నాయో ?
ఆడవాళ్ళు ఇళ్ళు వదిలి బయటకు రావాలి అంటున్నవారు ...బయటకు వచ్చిన ఆడవాళ్ళకు రక్షణ కల్పించగలరా ?
రక్షణ కల్పించనప్పుడు... స్త్రీలు ఇంటి నుండి బయటకు రండి అని అనటం దేనికి ?
...............
కొందరు ఆడవాళ్ళకు ఉద్యోగం చేయటం ఇష్టం ఉండదు. అయితే, ఈ రోజుల్లో మగవాళ్ళు కూడా ఉద్యోగం చేసే అమ్మాయిలనే వివాహం చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందువల్ల అమ్మాయిలు తప్పనిసరిగా ఉద్యోగాలు చేయవలసి వస్తోంది.
పాతకాలంలో స్త్రీలపై ఆర్ధిక భారం ఉండేది కాదు. ఈ రోజుల్లో ఇంటిపనితో పాటు కుటుంబ ఆర్ధిక భారాన్ని కూడా స్త్రీల నెత్తిన పడేసారు.
ఇటు పిల్లలను సరిగ్గా చూసుకోలేక బయట ఆఫీసులోనూ పనివత్తిడితో సతమతమవుతూ చాలామంది స్త్రీలకు అనారోగ్యాలు వస్తున్నాయి.
ఈ రోజుల్లో స్త్రీల కష్టాలు మరింత పెరిగినట్లు ఉన్నాయి. పిల్లలకు కూడా కష్టాలు వచ్చి పడ్డాయి.
మారిన విధానంలో సమాజంలో ఎన్నో కొత్త కష్టాలు పుట్టుకువచ్చాయి.
స్త్రీలకు ఆర్ధికభద్రత కల్పించేవిధంగా చట్టాలు చేయాలని స్త్రీలందరూ కలిసి ఐకమత్యంగా ఉద్యమాలు చేయాలిగానీ..ఆర్ధికభద్రత కోసం అంటూ స్త్రీలు ఇంటాబయటా కూడా కష్టపడటం తెలివితక్కువతనం కదూ!

ReplyDeleteఆడవాళ్ళు వంటింటి కుందేలుగా పడి ఉండాలా ? అంటున్నారు కొందరు.
తమకోసం, తమ కుటుంబసభ్యుల కోసం వంట చేయటం, కన్న వాళ్ళను చూసుకోవటం, పిల్లలకు చక్కగా వండిపెడుతూ దగ్గరుండి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకోవటం తప్పెలా అవుతుంది ?
స్త్రీలకు ఇంటిపని అయిపోయిన తరువాత ఖాళీ సమయం ఉంటే తోటి స్త్రీలతో కలసి కొంత సమయాన్ని సమాజ సేవకు కేటాయించ వచ్చు కదా !
మరికొందరు ఏమంటారంటే, పాతకాలంలో స్త్రీలను అణచివేసారని అంటారు. ఇది నిజం కాదు.
ReplyDeleteసమాజం బాగుండటం కోసం పూర్వీకులు చక్కటి కుటుంబవ్యవస్థను ఏర్పరిచారు. స్త్రీలు, పురుషుల విషయాలను దృష్టిలో ఉంచుకుని పని విభజన చేసారు.
స్త్రీలు, పురుషుల శారీరిక, మానసిక విషయాలకు అనుగుణంగా స్త్రీలకు కొన్ని బాధ్యతలను, పురుషులకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. అంతేకానీ స్త్రీలను అణగత్రొక్కటం ఏమీలేదు.
స్త్రీలకు రజస్వల కావటం, గర్భం దాల్చటం..వంటి శారీరిక లక్షణాలు ఉన్నాయి . ఇంకా స్త్రీలు శారీరికంగా కొంచెం బలహీనులు కాబట్టి బయటకు వెళ్తే మగవాళ్ళ నుంచి రక్షణ అనేది కూడా ఒక సమస్య.
ఇవన్నీ ఆలోచించి వారికి ఇంటిపట్టున ఉండి కుటుంబాన్ని చూసుకునే బాధ్యతను అప్పగించారు.
మగవాళ్ళు శారీరికంగా స్త్రీలకన్నా బలవంతులు కాబట్టి వారికి కుటుంబానికి అవసరమైన సంపాదన వంటి బాధ్యతను అప్పగించారు.
స్త్రీలు, పురుషులు బయట పనిచేసుకుని రాత్రికి ఇంటికి వచ్చి ఇద్దరూ ఇంటిపని చేయాలనేది ఆచరణలో సరిగ్గా జరిగే విషయం కాదు.
ఇంటిపని , పిల్లలను చూసుకోవటం.. పార్ట్ టైం పనులు కావు. చాలా సమయాన్ని కేటాయించవలసిన పనులు.
స్త్రీలు ఇంటిపట్టున ఉండి కుటుంబాన్ని చూసుకుంటే పగలు కొంచెంసేపైనా విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.
పురుషులు పగలంతా పనిచేసుకుని ఇంటికి వచ్చి సాయంకాలం కొంచెంసేపైనా విశ్రాంతి తీసుకోవటానికి అవకాశముండేది.
ఈ రోజుల్లో స్త్రీలు,పురుషులు ఇద్దరూ పగలంతా పనిచేసి అలసిపోయి రాత్రికి ఇంటికి వస్తున్నారు. ఈ పద్ధతిలో ఎవరికీ విశ్రాంతి లభించటం లేదు.