koodali

Wednesday, January 6, 2016

దేశం కోసం ..


దేశం కోసం ప్రాణాలను త్యాగం చేసిన  సైనికులకు నివాళులు. 



ఇకమీదట ఇలాంటి విషాద సంఘటనలు జరగకూడదని,  ప్రపంచమంతటా శాంతిభద్రతలు పెరగాలని కోరుకుంటున్నాను.

*దయచేసి క్రింద కామెంట్స్ వద్ద కూడా చదవగలరు.

4 comments:

  1. They did their job. It is not a sacrifice. It is their duty.

    ReplyDelete
    Replies
    1. దేశం కోసం ప్రాణాలను పోగొట్టుకున్న వాళ్ళను ప్రశంసించినా కూడా అభ్యంతరాలు చెప్పటం ఎంతో బాధాకరమైన విషయం.

      Delete

  2. ఎవరికైనా ప్రాణాలు ఎంతో ముఖ్యమైనవి.

    ప్రాణానికి ఎక్కువ రిస్క్ ఉన్న పనులు ఉన్నాయి. కొంచెం తక్కువ రిస్క్ ఉన్న పనులు ఉన్నాయి.

    అవసరమైతే ప్రాణాలనైనా పణంగా పెట్టవలసిన బాధ్యతాయుతమైన పనులలో సైనికులుగా పనిచేయటం ఒకటి. అందువల్ల ఇది రిస్క్ ఉన్న పని అనటంలో ఎటువంటి సందేహము లేదు.

    పోలీసు పని కూడా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని పనిచేయవలసి ఉంటుంది. పోలీసులది కూడా రిస్క్ ఉన్న పనే.

    వైద్యులు కూడా రోగులను పరిశీలించేటప్పుడు తమకు జబ్బులు అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్య వృత్తి కూడా రిస్క్ ఉన్న పనే.

    నర్సులు కూడా జాగ్రత్తగా ఉండాలి.నర్సింగ్ కూడా రిస్క్ ఉన్న పనే.

    వ్యర్ధాలను తొలగించే పారిశుద్ధ్యకార్మికులు కూడా జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వారిదీ రిస్క్ ఉన్న పనే.

    ఇళ్ళు, షాప్స్ వద్ద కాపలా ఉండే వాచ్ మెన్ కూడా రాత్రిసమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదీ రిస్క్ ఉన్న పనే.

    వాహనాలను నడిపే డ్రైవర్లు జాగ్రత్తగా లేకపోతే వారి ప్రాణంతో పాటు ప్రయాణికుల ప్రాణాలకు కూడా ఇబ్బందే. అడవులలో, సముద్రాలలో, ఆకాశంలో ఇబ్బందులు పడుతూ కూడా వాహనాలను నడుపుతూ సరుకులను రవాణా చేస్తుంటారు డ్రైవర్లు, క్లీనర్లు . ఇవీ రిస్క్ ఉన్న పనులే.

    అర్ధరాత్రి కూడా పెట్రొల్ బంకులలో పనిచేస్తూ ఉంటారు కొందరు. వీళ్ళవీ రిస్క్ ఉన్న పనులే.

    సమాజంలోని చెడుకు వ్యతిరేకంగా పోరాడే సంఘసేవకులది కూడా రిస్క్ ఉన్న పనే.

    ఎందరో ఆడపిల్లలను రక్షిస్తున్న సునీతాకృష్ణన్ లాంటి వాళ్ళు ఎంతో గొప్పవాళ్లు. ఇలాంటి సంఘసేవకుల పని కూడా రిస్క్ ఉన్న పనే.

    న్యాయమూర్తులు ఇతరుల బెదిరింపులకు భయపడకుండా తీర్పులను ఇవ్వవలసి ఉంటుంది.ఇదీ రిస్క్ ఉన్న పనే.

    ఇలా చూస్తే రిస్క్ ఉన్న పనులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ ఇక్కడ రాయలేదు.
    .............

    సమాజ క్షేమం కోసం ప్రాణాలు త్యాగాలు చేసిన వాళ్ళను త్యాగమూర్తులు అనే కదా అంటారు.

    ReplyDelete

  3. కొందరు సమాజం కోసం త్యాగాలు చేస్తుంటే.. మరికొందరు సమాజానికి హాని కలిగిస్తున్నారు.

    సమాజానికి హాని చేస్తున్న వాళ్ళు అన్ని రంగాలలోనూ ఉన్నారు.

    దేశంలో ఇంత పేదరికం ఉన్నా పట్టించుకోకుండా ..కొందరు తమ సొంతానికి సంపదను విపరీతంగా ప్రోగుచేసుకుని దాచుకుంటున్నారు.

    దేశంలో ఇంత పేదరికం ఉన్నా పట్టించుకోకుండా ..కొందరు ఉద్యోగస్తులు అదేపనిగా జీతాలు పెంచమంటూ ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతున్నారు.( ఎన్నో వేలరూపాయల జీతాలు వస్తున్నా కూడా..)

    దేశంలో ఇంత పేదరికం ఉన్నా పట్టించుకోకుండా.. కొందరు వ్యాపారస్తులు మరింత సంపాదన కోసం ధరలను అదేపనిగా పెంచుతున్నారు.

    దేశంలో ఇంత పేదరికం ఉన్నా పట్టించుకోకుండా .. కొందరు మరింత సంపాదన కోసం అవినీతి పనులు చేస్తూ సమాజానికి నష్టం కలిగిస్తున్నారు.

    కొందరు చెడ్దవాళ్ళు చేస్తున్న చెడ్ద పనుల వల్ల మంచివాళ్ళు కూడా ఇబ్బందులు పడవలసి వస్తోంది.

    ReplyDelete