జీవితంలో చిత్రమైన అయోమయ పరిస్థితులు ఏర్పడినప్పుడు, మానసికంగా క్రుంగిపోయి ఆత్మహత్యలు వంటి నిర్ణయాలను తీసుకోకుండా , తీర్ధయాత్రలు, దైవపూజలు, దానధర్మాల వంటి సత్కర్మలను ఆచరించటం వల్ల పరిస్థితులు చక్కపడే అవకాశం ఉంది.
అయితే పరిస్థితి తీవ్రతను బట్టి , పుణ్యకార్యాలను మిక్కుటంగా చేస్తేనే మంచి ఫలితాలు లభిస్తాయి.
తీర్ధయాత్రలు చేసే శక్తి లేకపోయినా భక్తి ఉంటే చాలు . దైవం తానే దర్శనమిస్తారు. ( కలలో కావచ్చు, ఇలలో కావచ్చు.) భక్తి ముఖ్యం.
భక్తి అంటే, పాపాలు చేస్తూ భగవంతునికి పాపపుసొమ్మును కానుకగా సమర్పించే నాటకీయమైన భక్తి కాదు. స్వచ్చమైన ప్రేమ భక్తి.
భగవంతునికి జీవులంటే ఎంతో ప్రేమ. ఎన్నో తప్పులను చేసిన వారికి కూడా మంచిగా మారటానికి మళ్ళీమళ్ళీ అవకాశాలను కల్పిస్తారు.
ఎన్ని అవకాశాలను కల్పించినా పట్టించుకోకుండా పాపాలను చేస్తూ ఉంటే అప్పుడు లోకహితం కొరకు, దైవం పాపాత్ములను శిక్షిస్తారు.
పాపాలు చేసిన వారు కూడా చేసిన తప్పులు తెలుసుకుని పశ్చాత్తాపపడి మంచిగా మారితే దైవానుగ్రహానికి పాత్రులే.
Bhakthi margarm manchide...
ReplyDeleteAumPrakash గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteస్వచ్చమైన ప్రేమే భక్తి...... చక్కగా చెప్పారు. పోస్ట్ చాలా బాగుదండి.
ReplyDeleteభారతి గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Delete