koodali

Monday, December 3, 2012

కొన్ని విషయాలు.


మేము  కొంతకాలం  క్రిందట  అమర్నాధ్  యాత్రకు  వెళ్ళాము.  అమరనాధ్  హిమాలయాల  పర్వతాలపై  వెలసింది. అక్కడ  ప్రవహించే  సెలయేళ్ళలోని  నీరు  ఎంతో  స్వచ్చంగా  మినరల్  వాటర్ లా   ఉంది. 


 అమర్నాధ్  గుహలో  చాలా  చల్లగా  ఉంటుంది.   గుహ  అంటే  ఇరుకుగా  ఏమీ  ఉండదు.  చాలా  ఎత్తుగా,  విశాలంగా   ఉంటుంది.  భక్తుల  కాళ్ళకు  చల్లదనం  తగలకుండా ,  దేవస్థానం  వాళ్ళు  గుహలో  కొంతమేర  పట్టాలు  వేసారు. 


 పూర్వం  అమర్నాధ్  వెళ్ళాలంటే  ఎక్కువ  రవాణా  సౌకర్యాలు  ఉండేవి  కావట.  ఇప్పుడు  చాలా    సౌకర్యాలను  ఏర్పాటు  చేసారు.  



  హిమాలయాలపై    వైలెట్,  పసుపు  పూలతో  చిన్నచిన్న పువ్వుల మొక్కలు  భలే  ఉన్నాయి. ఒక  దగ్గర   నీరు  జలజల  ప్రవహిస్తూ   సూర్యకాంతి   వల్ల  ఇంద్రధనుస్సు  ఏర్పడింది.  ఇలాంటి  వింతలెన్నో  ఉన్న  అదొక  అద్భుతమైన  ప్రపంచం.   అమరనాధ్  యాత్ర అద్భుతమైన  యాత్ర.
..................................

పార్వతీ  వల్లభ  నీలకంఠాష్టకం.....


1.నమో  భూతనాధం  నమో  దేవదేవం  నమః కాలకాలం  నమో  దివ్యతేజం


నమః కామభస్మం  నమశ్శాంతశీలం  భజే పార్వతీవల్లభం  నీలకంఠం ..

2.సదా తీర్ధసిద్ధం  సదా  భక్తరక్షం సదా  శైవపూజ్యం సదా  శుద్ధభస్మం


సదా  ధ్యానయుక్తం  సదా  జ్ఞానతల్పం  భజే  పార్వతీవల్లభం  నీలకంఠం  ..

3.శ్మశానం శయానం  మహాస్థానవాసం  శరీరం  గజానం  సదా  చర్మవేష్టం


పిశోచం  నిశోచం పశూనాం  ప్రతిష్టం  భజే  పార్వతీ  వల్లభం  నీలకంఠం..

4.ఫణీ నాగకంఠే  భుజంగాద్యనేకం  గళేరుండమాలం   మహావీరశూరం


కటిం వ్యాఘ్రచర్మం  చితాభస్మలేపం  భజే పార్వతీవల్లభం  నీలకంఠం ..

5.శిరశ్శుద్ధ  గంగా శివా వామభాగం  బృహద్దీర్ఘకేశం  సదామాం  త్రినేత్రం


ఫణీనాగకర్ణం  సదా  బాలచంద్రం  భజే పార్వతీవల్లభం  నీలకంఠం  ..

6.ఉదాసం  సుదాసం  సుకైలాస వాసం  ధరానిర్ధరం  సంస్థితం  హ్యాదిదేవం  


అజా హేమకల్పదృమం  కల్పసేవ్యం  భజే  పార్వతీవల్లభం  నీలకంఠం ..

7.మునీనాం  వరేణ్యాం  గుణం  రూపవర్ణం  ద్విజానాం  పఠంతం  శివం  వేద  శాస్త్రం


అహో దీనవత్సం  కృపాలం  శివం  హి భజే పార్వతీవల్లభం  నీలకంఠం..  


8.సదా  భావనాధ  స్సదా  సేవ్యమానం  సదా  భక్తిదేవం  సదా  పూజ్యమానం


  సదా తీర్ధవాసం  సదా  సేవ్యమేకం  భజే  పార్వతీవల్లభం  నీలకంఠం   ..

ఫలం :  ఇష్టకామ్యార్ధ సిద్ధి,  ఆధ్యాత్మికాభివృద్ధి.  


వ్రాసిన  వాటిలో   ఏమైనా  పొరపాట్లు,  అచ్చుతప్పులు  వంటివి  ఉన్నచో ,   దైవం  దయచేసి  క్షమించాలని  ప్రార్ధిస్తున్నాను. 


4 comments:

  1. యాత్ర గురించి మరి కొంత రాయల్సింది ,..

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      మరి కొన్ని వివరాలను రాస్తానండి.

      Delete
  2. మీరు అక్కడికి ఏ విధంగా చేరుకున్నారో..అక్కడికి వెళ్లే ముందు ఏమి ఏర్పాట్లు చేసుకున్నారో కొంచెం వివరంగా వ్రాయగలరు ఇంకొక టపాలో.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      ఇంకొక టపాలో మరికొన్ని వివరాలను రాస్తానండి.

      Delete