koodali

Monday, December 10, 2012

. కొన్ని యాత్రా విశేషాలు...మూడవభాగం...మరియు ....ఉమామహేశ్వర స్తోత్రము.

 
* అమర్నాధ్  గుహలో  ప్రధాన  మంచులింగం  మాత్రమే  కాకుండా  ఇంకా  రెండు     చిన్న   మంచుమూర్తులు    కూడా  ఉంటాయి. ఆ  మంచుమూర్తులను    పార్వతీ  దేవి,  వినాయకుడుగా   భావిస్తారు .

* అయితే,  శివలింగం  యొక్క  పానమట్టాన్ని  పార్వతీదేవిగా  భావిస్తారని  పండితులు  చెబుతారు. అమరనాధ్ లో   కూడా  మంచుశివలింగంవద్ద పానమట్టంలా  మంచు  ఉంటుంది.  అందువల్ల  మంచుశివలింగం  యొక్క  పానమట్టాన్ని  కూడా  పార్వతీదేవిలా  భావించవచ్చని  నాకు  అనిపించిందండి.

* గుహలో  కొన్ని  పావురాలు   కనిపిస్తాయి. వాటిని  దర్శించుకుంటే   మంచిదంటారు.  మేము  వెళ్ళినప్పుడు  చూశాం. గుహలోపల  పావురాలు   ఎగురుతూ  తిరుగుతున్నాయి.

* అమర్నాధ్  గుహలో  కాళ్ళ క్రింద  చాలా చల్లగా  ఉంటుంది.  గుహలో అంత చల్లగా ఉన్నా , ఒక రాతి పలక దగ్గర మాత్రం   చాలా చాలా వేడిగా ఉంటుందట. ఈ విషయం  అక్కడి వారికి కూడా చాలామందికి తెలియదని ఒక పుస్తకములో చదివాను.

* కానీ తీరా అక్కడికి వెళ్ళాక , నేను  ఆ విషయమే  మర్చిపోయాను. ఇలాంటప్పుడు ఏమని అనిపిస్తుందంటే,  మనం ఎంత తాపత్రయపడినా మనకు ఎంత ప్రాప్తమో  అంతే ప్రాప్తిస్తుందని   తెలిసివస్తుంది.

* మేము కేవలం దైవ భక్తితో మాత్రమే కాక,  లౌకికపరమైన కోరికలతో కూడా ఈ యాత్రలు  చేశాములెండి.

ఇంకో విషయం చెప్పాలండి .....ఈ రోజుల్లో చాలా దేవాలయాల్లో    రద్దీ  వల్ల,  క్యూ లైన్లలో త్వరత్వరగా   దైవదర్శనం  చేసుకోవలసి  వస్తోంది  కదా ...

* మనలో చాలామందికి ఒక అలవాటుంది. గుడిలో దేవుని వద్దకు వెళ్ళగానే ,  టపీమని  కళ్ళుమూసుకుని దేవునికి నమస్కరించటము చేస్తుంటాము.

* దీనివల్ల  దైవం ముందు ఉన్న ఆ కొద్దిసమయములో దేవుని  సరిగ్గా చూడలేము. అలా కాకుండా ఆ కొద్దిసేపు   దేవుని   చక్కగా  చూడాలి.   కావాలంటే తరువాత ప్రక్కకు వచ్చి  కళ్ళు మూసుకుని  దైవాన్ని ప్రార్దించుకోవచ్చు.


* ఇంకో ముఖ్యమైన విషయం  ఏమిటంటేనండి     ,  దైవదర్శనం చేసుకునేటప్పుడు    వీలైనంతవరకు వేరే  ఆలోచనలు    లేకుండా     దైవదర్శనం చేసుకుంటే , ఆ భగవంతుని చక్కగా చూడగలం.   చూసిన  దైవస్వరూపాన్ని   చక్కగా  గుర్తుపెట్టుకోగలం.

* అమర్నాధ్ యాత్ర కు   చాలామంది ఆడవాళ్ళు,   చిన్నపిల్లలు కూడా వచ్చారండి. కొంతమంది కాళ్ళు సరిగ్గా లేనివాళ్ళు కూడా కర్రల సహాయంతో   లేక  చేతుల  సహాయంతో ఆ మంచులో వెళ్ళటం చూశాక   ఏమనిపించిందంటే ...  ప్రపంచంలో  ఎందరో  గొప్ప  భక్తులున్నారు.  మనమే  గొప్ప  భక్తులం  అనుకోకూడదు. అని.


* అమరనాధ్  యాత్ర  గురించి  అంతర్జాలంలో  ఎన్నో  వివరాలున్నాయి.  వీడియోలు  కూడా  చాలా  ఉన్నాయి.   అందులోని  ఒక  వీడియోను    ఈ  లింక్  ద్వారా  చూడవచ్చు........

Virtual Amarnath Yatra Pilgrimage - YouTube

* లేక  మీరు  ఎంచుకున్న  వీడియో ద్వారా    కూడా   చూడవచ్చు. అంతర్జాలంలో  తక్కువ  సమయం  ఉన్న వీడియోలు  కూడా  ఉన్నాయి.

* ఈ  బ్లాగ్  ను  ప్రోత్సహిస్తున్న  సభ్యులకు  మరియు  అందరికి  అనేక  కృతజ్ఞతలండి.
.......... 

* ఉమామహేశ్వర  స్తోత్రము.

1. నమశ్శివాభ్యాం  నవయౌవనాభ్యాం  పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం

నాగేంద్రకన్యా  కేతనాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీభ్యామ్   ....


2. నమశ్శివాభ్యాం  సరసోత్సవాభ్యాం  నమస్కృతాభీష్ట వరప్రదాభ్యాం


సురా
Z సురేంద్రా నార్చిత  పాదుకాభ్యాం
నమోనమశ్శంకరపార్వతీభ్యామ్   ....

3. నమశ్శివాభ్యాం  వృషవాహనాభ్యాం  విరించి  విష్ణ్వింద్ర సురపూజితాభ్యాం


విభూతిపాటీర విలేపనాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

4. నమశ్శివాభ్యాం  జగదీశ్వరాభ్యాం  జగత్పతిభ్యాం  జయవిగ్రహాభ్యాం


జంభారిముఖ్యై  రభివందితాభ్యం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్ ....

5. నమశ్శివాభ్యాం  పరమౌషధాభ్యాం  పంచాక్షరీ  పంజర  రంజితాభ్యాం


ప్రపంచసృష్టి స్థితి  సంహృతాభ్యాం    నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

6. నమశ్శివాభ్యా   మతిసుందరాభ్యాం  అత్యంత  మాసక్తహృదయాంబుజాభ్యాం


అశేషలోకైక  హితంకరాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

7.  నమశ్శివాభ్యాం  కలినాశనాభ్యాం  కంకాళ  కళ్యాణ  వపుర్ధరాభ్యాం


కైలాసశైల  స్థిత దేవతాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

8.  నమశ్శివాభ్యా  మశుభాపహాభ్యాం  అశేషలోకైక విశేషితాభ్యాం


అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్ ....

9. నమశ్శివాభ్యాం  రధవాహనాభ్యాం  రవీందు  వైశ్వానర లోచనాభ్యాం


రాకా శశాం కాభ  ముఖాంబుజాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

10.   నమశ్శివాభ్యాం  జటిలం  ధరాభ్యాం  జరామృతిభ్యాం చ వివర్జితాభ్యాం


జనార్ధ నాబ్జోద్భవ  పూజితాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

11. నమశ్శివాభ్యాం  విషమేక్షణాభ్యాం  బిల్వచ్చ దా మల్లిక దా మభృద్భ్యాం


శోభావతీ  శాంతవతీశ్వరాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

12. నమశ్శివాభ్యాం  పశుపాలకాభ్యాం  జగత్రయీ  రక్షణ  బద్ధహృద్బ్యాం


సమస్తదేవాసుర  పూజితాభ్యాం  నమోనమశ్శంకరపార్వతీ
భ్యామ్  ....

స్తోత్రం  త్రిసంధ్యాం  శివపార్వతీభ్యాం  భక్త్యా  పఠన్  ద్వాదశకం  నరో  యః
స  సర్వసౌభాగ్యాఫలాని  భుం క్తే  శతాయు రంతే  శివలోక  మేతి.


* ఇతి  శ్రీ మత్పరమహంస  పరివ్రాజకాచార్యవర్య   శ్రీ మచ్చంకరాచార్య  విరచితం   శ్రీ  ఉమామహేశ్వర  స్తోత్రము.

ఫలం  : ఎవరైతే  రోజూ  మూడుపూటలా  భక్తితో  ఈ  స్తోత్రాన్ని జపిస్తారో  ..వాళ్ళు  నిండు  నూరేళ్ళూ  బ్రతుకును  పండుగలా  జరుపుకుని...అంత్యంలో  శివసాన్నిధ్యం   పొందుతారు.


* వ్రాసిన  విషయాలలో ఏమైనా  పొరపాట్లు లేక  అచ్చుతప్పుల  వంటివి  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.
 

6 comments:

  1. అన్నీ ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు:)

    ReplyDelete
  2. Chinni గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
  3. మీ పుణ్యంలో మాకూ పాలు పంచేసేరు. బాగుంది

    ReplyDelete
  4. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    అమరనాధ్ వంటి గొప్ప ప్రదేశాలకు స్వయంగా వెళ్ళలేకపోయినా , వాటి గురించి మనసులో తలచుకున్నా, విన్నా, వీడియోల ద్వారా చూసినా కూడా ఎంతో పుణ్యం వస్తుందండి.

    తీర్ధయాత్రలు చేసినా, చేయలేకపోయినా భగవంతుని యందు భక్తి ప్రధానం అనిపిస్తుందండి..
    ...........

    మీ బ్లాగ్ లో, రుద్రాభిషేకం చేసుకోలేకపోయినా మహాన్యాసం వినండి. అని మహాన్యాసం వినిపించారు కదా !

    నేను నిన్న మీ బ్లాగ్ లోని మహాన్యాసం విన్నానండి. మహాన్యాసం అందించినందుకు మీకు కృతజ్ఞతలండి.

    ReplyDelete
    Replies
    1. చాల సంతోషమండి.ఈ కార్తీకమాసంలో 'అమరనాద్ నుని మనోనేత్రం తో మాకు దర్శనం చేయించారు. అంతకు మించిన భాగ్యం ఏవుంది చెప్పండి.
      నిన్ననే మా ఇంట్లో 'మహాలింగార్చన' కూడా జరిగింది.

      హరహరమహాదేవ

      Delete
  5. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

    అమరనాధ్ వంటి గొప్ప ప్రదేశాలకు స్వయంగా వెళ్ళినా, వెళ్ళలేకపోయినా , వాటి గురించి మనసులో తలచుకున్నా, విన్నా, వీడియోల ద్వారా చూసినా కూడా ఎంతో పుణ్యం వస్తుందండి.

    తీర్ధయాత్రలు చేసినా, చేయలేకపోయినా భగవంతుని యందు భక్తి ప్రధానం అనిపిస్తుందండి..

    అమరనాధ్ యాత్ర చేసినప్పటి సంగతులను మళ్లీ తలచుకోవటం నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. అంతా దైవం దయ.

    'మహాలింగార్చన' జరిపించుకోవటం గొప్ప అదృష్టమండి. అంతా దైవం దయ.

    ReplyDelete