koodali

Wednesday, October 3, 2012

అసభ్యకరమైన వస్త్ర ధారణ , దృశ్యాలు ....



 దుస్తులు  శరీర  రక్షణ  కోసం  వేసుకుంటారు.  ఇవి    ఎండ,  వాన,  చలి  నుంచి,  ఇంకా   ఇతరుల  దృష్టి  నుంచి   శరీరాన్ని  కప్పి  కాపాడతాయి.


అయితే,  ఈ  రోజుల్లో  కొందరు  స్త్రీలు  అసభ్యంగా  ఇతరులకు  శరీరాన్ని  ప్రదర్శించే  రీతిలో  దుస్తులు  వేసుకుంటున్నారు.  ఏమన్నా  అంటే  మాకు  నచ్చినట్లు    దుస్తులు  వేసుకుంటాము.  ఎవరికీ  అడిగే     హక్కు  లేదంటూ  దబాయిస్తున్నారు.  



 సమాజంలో   ప్రతిదానికి  కొన్ని    కట్టుబాట్లు    ఉంటాయి.   సమాజం  సజావుగా  సాగాలంటే  కొన్ని  కట్టుబాట్లు  ఉండాలి  కూడా.   నా  ఇష్టం  వచ్చినట్లు  రోడ్డు  పై  కారు  నడుపుతాను...... నా  ఇష్టం   వచ్చినట్లు  జీవిస్తాను.  అంటే    ఎవరూ   ఒప్పుకోరు.....  అంతా  మా  ఇష్టమే..  అంటే  కుదరదు  కదా  !



  బాంకుకు  డబ్బు  పట్టుకెళ్ళాలంటే  ఎంతో  జాగ్రత్తగా   సంచిలో  వేసి  ఎవరికంటా  పడకుండా  తీసుకెళ్తాం . అంతేకానీ,  అందరికీ   ఆ  డబ్బును   ప్రదర్శించుకుంటూ  తీసుకెళ్ళం  కదా !  దొంగలు  ఉంటారు ... బాంకులకు  వెళ్ళేటప్పుడు  డబ్బును  జాగ్రత్త  చేసుకోమని  పోలీసులు ,  ఇంట్లో  పెద్దవాళ్ళు  ఎన్నో  జాగ్రత్తలు  చెబుతారు. 


  మీరేమిటి  జాగ్రత్తలు  చెప్పేది  ?   అంతా  మా  ఇష్టం.....అని  వారిని  తూలనాడి ,  ఎవరిష్టం  వచ్చినట్లు  వాళ్ళు  ప్రవర్తిస్తే ,  ఏదైనా  జరగరానిది  జరిగితే ?..... మళ్ళీ  ఆ  పోలీసులను,  పెద్దవాళ్ళనే  సహాయం  కోసం  దేబిరించుకోవాలి.  మన మంచి  కోరి  చెప్పే  పెద్దవాళ్ళ  మాట  వింటే  మనకే  మంచిది.  డబ్బు ముఖ్యమైనదే  కానీ , స్త్రీ  జీవితం  మరింత  ముఖ్యమైనది.



కొందరు  ఏమంటారంటే,  నిండుగా  దుస్తులు  వేసుకునే  ఆడవారి  పట్ల   కూడా  అత్యాచారాలు  జరుగుతున్నాయి.  అసభ్యంగా  దుస్తులు  వేసుకోవటం  తప్పుకాదు ..... అంటూ  వాదిస్తున్నారు. ఆ  వాదన  తప్పు.



 డబ్బును  ఎంతో  జాగ్రత్తగా ఇనప్పెట్టెలో  పెట్టినా  ఒకోసారి  కొందరు  దొంగలు  ఇనప్పెట్టెను    పగలకొట్టి   దోచుకుపోతారు.  అలాగని  
ఇనప్పెట్టెలో  పెట్టటం  మానేయము  కదా  ! మరిన్ని తాళాలు వేసి  పెట్టెలో  దాస్తాము.



 చక్కగా  దుస్తులు  వేసుకున్న  స్త్రీలకు  కూడా,......
అనేక కారణాల  వల్ల , ఆపదలు  కలిగే  అవకాశం  ఉంది.  అంతమాత్రం  చేత    అర్ధనగ్నంగా  దుస్తులు  వేసుకు తిరిగితే  తప్పేమిటి  ?  అని  వాదించటం   హాస్యాస్పదం.  



ఈ  రోజుల్లో,    కొన్నికధలు,  కొన్నిసినిమాల్లో  అసభ్య  వస్త్ర  ధారణ,  అసభ్య  దృశ్యాలు  ఎన్నో  ఉంటున్నాయి.    ఆధునిక  విజ్ఞానం  వల్ల  సెల్ ఫోన్లు,   అంతర్జాలం,    టీవీ  చానల్స్  వల్ల  అర్ధరాత్రి,  అపరాత్రి  అని  లేకుండా  ఎప్పుడూ  ఈ  అసభ్య  దృశ్యాలు   అందరికీ  అందుబాటులోకి  వచ్చేసాయి.  ఇవి  చూసేవారి  మీద   ఆ  ఎఫెక్ట్  ఎంతో  ఉంటుంది.  



ఇక  ఆ  ప్రభావంతో   పసి పిల్లలు,  పండు వృద్ధులు,  చక్కగా  దుస్తులు  ధరించే  స్త్రీలు  అని  తేడా  లేకుండా  అత్యాచారాలకు  గురయ్యే  అవకాశం  ఉంది.   అసభ్యంగా  దుస్తులు  వేసుకునే  ఆడవాళ్ళు  కూడా  ఇందుకు  మినహాయింపు  కాదు.

 శారీరికంగా  స్త్రీలు  పురుషుల  కన్నా  బలహీనులు  కాబట్టి ,  ఎంత  డేరింగ్  నేచర్  ఉన్న  ఆడవాళ్ళకయినా  ఇబ్బందులు  వచ్చే  అవకాశం  ఉంది.



  కొందరు  ఆడవాళ్ళయితే  తాము  ఎలాగూ  దారి  తప్పాము  కాబట్టి,  మిగతా  వారెందుకు  మంచిగా  ఉండాలనే  ఉక్రోషంతో ....... ఆడవాళ్ళు  మగవాళ్ళతో    ఎప్పుడయినా , ఎలా  తిరిగినా .. ఫరవాలేదు.  అని   స్టేట్మెంట్స్  ఇస్తుంటారు.   ఇలా   స్టేట్మెంట్స్  ఇచ్చేవారికి  వారి  పిల్లలు  పెద్దయ్యాక  అప్పుడు  తెలుస్తుంది.       


     
        మరికొందరేమో ,  మగవాళ్ళు  ప్రాచీనకాలంలా   పంచలు  వేసుకుంటున్నారా  ?  మేమెందుకు  ప్రాచీన  కాలంలాగా  నిండుగా  దుస్తులు  వేసుకోవాలీ  ?  అని  ప్రశ్నిస్తుంటారు.

 మగవాళ్ళు  పంచలు  వేసుకోపోయినా  నిండుగా  పాంట్ షర్ట్  వేసుకుంటున్నారు.   కొందరు   ఆడవాళ్ళు  వేసుకునే  చిన్న  షార్ట్స్,  చిన్న  బనీను  అలా  నిండుగా  ఉండటం   లేదు  కదా  !

 ( ఉష్ణదేశాల్లోని  మగవారికి  పాంట్,  షర్ట్  కన్నా ,  పంచలే  ఆరోగ్యం  అట.  ఇది  వేరే  విషయం.  )


  అయినా  మగవారు  షార్ట్స్  మాత్రమే  వేసుకుని  వీధుల్లో  తిరిగినా  అసభ్యంగా  అనిపించదు.  ఆడవాళ్ళేమీ  వారిని  గమనించరు,  పట్టించుకోరు. 



  మగవాళ్ళు  పొట్టిదుస్తులు  వేసుకుని  తిరగటానికీ  ,   ఆడవాళ్ళు  మగవాళ్ళలా   పొట్టి  దుస్తులు  వేసుకుని   తిరగటానికీ   చాలా  తేడా  ఉంది  మరి.
 



  అసభ్యంగా  దుస్తులు  వేసుకుని  కనిపించే  సినిమాల్లోని  ఆడవాళ్ళని ,  మగవాళ్ళు  మెచ్చుకుంటూ   ప్రోత్సహించటం వల్ల  ఆనక  కష్టాలు  వస్తాయి.  అలా  ఉంటే  మగవాళ్ళకు  నచ్చుతుంది  కాబోలు .... అనుకునే  ఆడవాళ్ళూ  ఉంటారు.   అసభ్యంగా  దుస్తులు  ధరించే  అమ్మాయి  భార్యగా  వస్తే , అప్పుడు  అబ్బాయి   లబలబలాడటం  వల్ల  ఉపయోగమేమీ  ఉండదు.

  పరాయి ఆడవాళ్ళు అసభ్యకరమైన దుస్తులు వేస్తే చూడాలని ఉబలాటపడే మగవాళ్ళు కూడా తమ కుటుంబసభ్యులు వేసుకుంటే లబలబలాడతారు.
 అందరూ  ఇలాంటి  అసభ్య  వాతావరణాన్ని  గట్టిగా   వ్యతిరేకించినప్పుడే   ఇవన్నీ  తగ్గుతాయి.




27 comments:

  1. స్త్రీల అసభ్య వేషధారణ మీద చాలా చర్చలు జరిగేయి, జరుతున్నాయి, జరుగుతాయి కూడా. అలా వేషధారణ చేసేవారు మారినదీ లేదు. మారరు కూడా. దీనిగురించి ముఖ్యంగా వ్యక్తి స్వాతంత్రం గురించి మాటాడేవారు కూడా మీ స్త్రీలేనని గుర్తించండి. ముందు మిమ్మల్ని మీరు మార్చుకోండి తల్లులూ.

    ReplyDelete
  2. మీ వ్యాఖ్యకు మరియు మీ సలహాకు ధన్యవాదములండి.

    కానీ, అసభ్యంగా వస్త్రధారణ చేస్తే మెచ్చుకుంటూ ప్రోత్సహించే పురుషులు ఉండబట్టే , కొందరు స్త్రీలు అలా వస్త్రధారణ చేస్తున్నారేమో ? ఇక్కడ స్త్రీతో పాటు పురుషుని తప్పూ ఉంది.

    ఇలాంటి స్త్రీలతో సినిమాలు , కధలూ తీసే వారు పురుషులే.

    సాంప్రదాయపద్ధతులు కలిగిన చక్కటి భార్య ఉండగా , ఆధునిక పోకడలు పోయే స్త్రీల వెనక వెళ్ళే పురుషులూ ఎందరో ఉన్నారు మరి.

    ReplyDelete
  3. agree with you. good write up

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

      Delete
  4. ఒక బాగా చదువుకున్న అమ్మాయి, నా హద్దుల్లో నేనున్నప్పుడు నా ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ చేస్తా తప్పేంటీ అంటూంది. మగాళ్ళు బలవంత పెట్టలేదుగా సగం వస్త్రం మాత్రమే ధరించమని. మీరు మారితే మిమ్మల్ని ఎవరూ మారచలేరు.ఆ సినిమాలు ఎగబడి చూస్తున్నది మీరుకాదా!

    ReplyDelete
    Replies
    1. మీరు టపాను , వ్యాఖ్యలను సరిగ్గా చదివితే ఇలా రాయరు.

      1. ( మీరు చెప్పిన ఉదాహరణలో అమ్మాయి నా ఇష్టం వచ్చినట్లు వస్త్రధారణ చేస్తా తప్పేంటీ ...).........అంటే

      * నేనేమీ ఇలాంటి ఆడవాళ్ళను సపోర్ట్ చెయ్యలేదు కదా !

      2. ( ఆ సినిమాలు ఎగబడి చూస్తున్నది మీరుకాదా!...) ...అంటే

      * ఇలాంటి సినిమాలను చూసే వాళ్ళలో పురుషులు ఉండరని మీ అభిప్రాయం కాబోలు ?
      ......

      ** సమాజంలో జరుగుతున్న తప్పులలో స్త్రీలు, పురుషులు ఇద్దరి బాధ్యతా ఉందని నా అభిప్రాయమండి.

      Delete
  5. Replies
    1. మీ వ్యాఖ్యకు ధన్యవాదములండి.

      Delete
  6. పురుషులు మెప్పు కోసం ఏమైనా చేసేస్తారా? ఈ ఆరోపణ మరీ బాగుంది. 30లోపు స్త్రీలు మామిడి తోరణాలు(ఆకులు) కట్టుకుంటే మెచ్చుతామని పురుషులంటే, మామిడాకులు భారతి-వాల్మార్ట్ షెల్ఫ్‌లలో దర్శనమిస్తాయా?

    ReplyDelete
    Replies
    1. denikayina oka limit untundi boss. tanu rasina dani meeda emina sadwimarsa unte cheyandi kani danini vakreekarinchi vankara arthalu vetakatam baledu. ilantivi charchanu dari tappistayi.

      thanu edo manchi vishayam cheptunnaru. meeku aa alochana nachakapovachu kani kaneesam vankata tinkara alochanalni padi mandiki panchakunda unte ade padivelu.

      Delete
    2. మామిడి తోరణాలు(ఆకులు) ...గురించి అడిగిన వారికి,

      ఆకులతో శరీరాన్ని నిండుగా కప్పుకున్నారా.. లేక ప్రత్తి దారాలతో నేసిన దుస్తులతో కప్పుకున్నారా..లేక జనపనారతో చేసిన వస్త్రాలతో కప్పుకున్నారా.. అన్నది కాదండి సమస్య.

      సమస్య , అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని తెరగటం గురించి. దీనికి బాధ్యత వహించాల్సింది స్త్రీలు, పురుషులు ఇద్దరూ.. అని ఇంతకు ముందు కూడా చెప్పాను.


      Delete
    3. రెండవ Anonymous గారు, మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  7. చాలా మంచి విషయం మీద రాశారండి.
    మన సంప్రదాయాల్ని, కట్టుబాట్లని గౌరవించి వాటి ప్రకారం నడుచుకొనే మార్పు కోసం ఎదురుచూడడం తప్ప చేయగలిగిందేమీ లేదుకదండి?!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
      నిజమేనండి, మానవప్రయత్నంలా కొంతవరకూ మనం ప్రయత్నించగలం, తరువాత మనం ఏం చేయలేం.

      అయితే, దైవం, శిశుపాలుని నూరు తప్పల వరకు భరించి శిక్షించారు. పెడ పోకడలు పోతూ సమాజానికి హాని కలిగిస్తున్న వారిని ఎవరినీ , దైవం చూస్తూ ఊరుకోరు. సమయం వచ్చినప్పుడు వారికి తగ్గ శిక్షను వారికి విధిస్తారు.

      Delete
  8. చక్కగా రాసారండి. తప్పకుండా కొంత మందిలో అయినా దుస్తుల విషయంలో స్పష్టత వస్తుంది ఈ టపాతో. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  9. This comment has been removed by the author.

    ReplyDelete
  10. Nijame.. chese prathi paniki bhagavanthuniki samaadaanam cheppaali gaa mari. Mee maatalatho nenu poorthiga yekeevabisthunnaa.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete
  11. వస్త్రధారణ అనేది సంప్రదాయం, ఆధునీకతకన్నా.....సౌకర్యంగా ఉంటేనే సౌదర్యాన్నిస్తుందని నా అభిప్రాయం. మంచి పోస్ట్.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      నిజమేనండి, దుస్తులు వేసుకునే వారికి సౌకర్యంగా ఉండాలి కూడా. అందుకే చీరలు లేక కొద్దిగా వదులుగా కుట్టించుకున్న పంజాబి డ్రస్ వంటివి అందంగానూ ఉంటాయి. సౌకర్యంగానూ ఉంటాయి.

      లావు, సన్నం వంటి తేడాలను చీరలు , పంజాబి డ్రస్ వంటివి కనిపించకుండా చేస్తాయి. గర్భిణీ సమయంలోనూ ఎంతో సౌకర్యంగా ఉంటాయి.

      కొందరు సినీతారలు ఫంక్షన్స్ అప్పుడు అతిపొట్టి గౌన్లు వేస్తుంటారు. పదిమంది మధ్య నడిచేటప్పుడు ఆ డ్రస్ గాలికి పైకి ఎగిరితే ఎంతో ఇబ్బంది. ఇదంతా గమనించే మగవాళ్ళ కళ్ళు శరీరం మీద ప్రసరిస్తుంటే మరెంతో ఇబ్బంది. కూర్చుంటే ఆ గౌన్లు పైకి వెళ్ళిపోతుంటాయి. అందుకే కిందికి లాక్కుంటూ ఇబ్బంది పడుతుంటారు. ( కొందరయితే సరిచేసుకోరు. ) అలా డ్రస్ వేసుకున్నప్పుడు వంగాలన్నా ఇబ్బందే.

      Delete
  12. ఏమిటో..ఆ పొట్టి బట్టలు బాగానే ఉంటున్నాయ్ గా..మీకు చూడ్డం ఇష్టం లేకపోతే మానేయ్యండి..మా `కళ్ళ` మీద కొట్టకండీ!!!

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. అసభ్యంగా వస్త్రాలను ధరించే వారిని ఉద్దేశించి వ్యంగ్యంగా మీరు ఇలా వ్యాఖ్యానించారని నేను భావిస్తున్నాను.

      అసభ్యకరమైన దుస్తులు వేసుకునే విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరూ బాధ్యులే .


      అర్ధనగ్నంగా దుస్తులు ధరించటం వల్ల స్త్రీలు పురుషుల ముందు తమ గౌరవాన్ని తామే తగ్గించుకుంటున్నారు.

      ఈ విషయాన్ని గమనిస్తే, పురుషుల కన్నా మేము ఎందులో తక్కువ ! అని వాదించే స్త్రీలు ఇలా అర్ధనగ్నంగా దుస్తులు వేసుకుని పురుషుల ముందు తేలికై పోరు.

      Delete
  13. మొదట్లో అలా అనిపించినా క్రమంగా అలవాటు పడిపోతారు. ఆఖరుకు తమిళోళ్ళు కూడా పంజాబీ డ్రస్సులేసుకుంటున్నారు, అవి పని చేసేవారికి సులభంగా వుంటాయి. చీరలు కట్టే వాళ్ళు అసభ్యంగా కట్టూకోవచ్చు అని గణేష్ మండపాల్లో దర్శనమిచ్చిన ముంబాయి తారలను చూస్తే తెలుస్తుంది. దేశీ చోళీలను ఎంత అసభ్యంగా కావాలంటే అంతగా కుదించుకోవచ్చు. ఎదుటివారి మెప్పులకోసం అటుంచి, ఎవరి వారి అభిరుచులు కూడా వుంటాయి. ప్రకృతిలో మగ జంతువులు ఆడ జంతువులను ఆకర్షించడానికి ఎన్నో అవతారాలెత్తుతాయి(ex.నెమలిఫించం, సింహం జూలు, కోడిపుంజు కిరీటం), మనుషుల్లో అది రివర్సెందుకో అర్థం కాదు. ఆడవాళ్ళ డ్రస్సుల కన్నా మగవాళ్ళ డ్రస్సుల్లో మార్పు చాలా మందకొడిగా జరుగుతోందన్నది. టి-షర్ట్లు, ప్యాంట్లేసే ఆడాళ్ళున్నారు, గౌన్లు ,చీర-జాకెట్ కట్టే మగాళ్ళు దాదాపు వుండరు.

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      పంజాబి డ్రస్ కూడా భారతదేశపు వస్త్రధారణే.
      అసభ్యంగా శరీరమంతా కనిపించేటట్లు పల్చటి చీరలు ధరించటం కన్నా, కొంచెం వదులుగా పంజాబీడ్రస్ వేసుకుంటే చక్కగా ఉంటుంది.

      ** కొందరి అసభ్యకరమైన వస్త్రధారణ ఇతరులపై ప్రభావాన్ని చూపి కొన్ని నేరాలు జరగటానికి కారణమవుతోంది కాబట్టి, నా ఇష్టం వచ్చినట్లు నేను దుస్తులు వేసుకు తిరుగుతా... ఎవరూ ప్రశ్నించకూడదు.......అనే హక్కు ఎవరికీ లేదు.

      మానవ ధర్మాలు, లక్షణాలు వేరు, పశుపక్ష్యాదుల ధర్మాలు, లక్షణాలు వేరు.
      రాక్షసుల లక్షణాలు, దేవతల లక్షణాలు ...... ఇలా ప్రకృతిలో ఎవరికి వారికి వేరేగా ఉన్నాయి.

      అయినా, పశుపక్ష్యాదుల్లో కూడా కొన్ని జాతులు , జీవితాంతం ఒక్క జీవనసహచరితోనే ఉంటాయట. ఒకవేళ తమ జీవన సహచరి మరణిస్తే మరో తోడుకోసం వెతకకుండా అలాగే జీవిస్తాయట,

      పశుపక్ష్యాదుల్లో ఇలాంటి గొప్ప లక్షణాలు కూడా ఉన్నాయి.

      Delete
  14. chala bagaa vundandee mee post...

    ReplyDelete
    Replies
    1. మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.

      Delete