భోజ్యేషు మాతా..........అనే విషయాన్ని గమనిస్తే,
మనుషులు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు కట్టలను తినలేరు కదా ! శరీరము, మనస్సు ఆరోగ్యంగా ఉండటానికి చక్కటి ఆహారం అవసరం.
భార్య భర్తకు చక్కటి ఆహారాన్ని ఆప్యాయంగా వండి వడ్డించాలంటారు.
తల్లి తన బిడ్డలకు ఎలా కొసరికొసరి వడ్డిస్తుందో అలా, చక్కటి ఆహారాన్ని ఆప్యాయంగా వండి వడ్డించాలంటారు.
...................................
శయనేషు రంభ....ఈ విషయాన్ని గమనిస్తే,
భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండటం వల్ల ఆ కుటుంబానికి ఎంతో మంచి జరుగుతుంది. బయటకు వెళ్తే ఎన్నో ఆకర్షణలు. ఇలాంటప్పుడు భార్యాభర్తలు అన్యోన్యంగా లేకపోతే కష్టాలు వచ్చే అవకాశం ఉంది. తద్వారా కుటుంబాల్లో కలతలు వస్తే కుటుంబానికీ ముప్పే . సమాజానికీ ముప్పే. ఇవన్నీ ఆలోచించే పెద్దలు ఇలా చెప్పి ఉంటారు.
స్త్రీలు పెద్దపెద్ద పూజలు చెయ్యకపోయినా, ఇంటిని చక్కదిద్దుకోవటం వంటి బాధ్యతలను సవ్యంగా నిర్వర్తిస్తే చాలు .....వారికి పుణ్యం వస్తుందని పెద్దలు తెలియజేసారు.
........................
భోజ్యేషు మాతా .... అని తలుచుకుంటే , ఈ రోజుల్లో కొందరు స్త్రీలకు తమ పిల్లలకు ఆప్యాయంగా వండి వడ్డించటానికే సమయం సరిపోవటం లేదు కదా ! అనిపించింది.
పాతకాలంలో అయితే, పురుషులు కుటుంబానికి అవసరమైన సంపాదన, కుటుంబ రక్షణ వంటి బాధ్యతలను నిర్వర్తిస్తే , స్త్రీలు కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం ఇంటిని శుభ్రంగా ఉంచటం, ఆరోగ్యకరమైన , పుష్టికరమైన, రుచికరమైన ఆహారాన్ని తయారుచేయటం, పిల్లలను దగ్గరుండి పెంచుకోవటం..... వంటి బాధ్యతలను నిర్వర్తించేవారు.
ఇప్పుడు స్త్రీలు , పురుషులు పోటీపడి సంపాదిస్తున్నారు. సంపాదన పెరిగింది కానీ, ఆ సంపాదనతో చక్కటి ఆహారాన్ని తయారుచేసుకోవటం, పిల్లలను దగ్గరుండి ఆప్యాయంగా పెంచుకోవటం.... అనే వాటికి సమయం సరిపోవటం లేదు.
ఏదో హడావిడిగా ఇంత వండుకోవటం, కొందరయితే, వారానికి ఒకసారి వండుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని తినటం, బ్రెడ్, నూడిల్స్, వంటివి హడావిడిగా నోట్లో కుక్కుకుని , ఏడుస్తున్న చంటిపిల్లలను కూడా , క్రెచ్లో ఉన్న ఆయాల దగ్గర వదిలి ఆఫీసులకు పరిగెట్టడం . లాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి.
తల్లితండ్రి ఉండి కూడా, చంటి పిల్లలకు పరాయి వ్యక్తుల వద్ద పెరగవలసిన పరిస్థితి బాధాకరం.. నోరుతెరిచి తమ బాధలను, భావాలను చెప్పుకోలేని పసిబిడ్డలను పరాయి చోట వదిలి వెళ్తున్నారు తల్లితండ్రులు.
పాతకాలంలో అయితే, తల్లులు చందమామ రావే ! అంటూ జాబిల్లిని చూపిస్తూ, ఎన్నో కధలు చెబుతూ పిల్లలకు నిదానంగా ఆహారాన్ని తినిపించేవారు. ఇప్పుడు అలాంటివి అరుదై పోయాయి.
కొందరు స్త్రీలు కెరీర్ అంటూ తాపత్రయపడుతుంటే , కొందరు స్త్రీలు ఇంట్లోనే ఉన్నా పిల్లల పనులను ఆయాలపై వదిలి టీవీ చానల్స్ను చూస్తూ,పార్టీలు , ఫంక్షన్లు అని కాలక్షేపం చేస్తుంటారు.
తల్లి పాలు త్రాగి పెరిగిన పిల్లలకు భవిష్యత్తులో ఎన్నో వ్యాధులు రాకుండా ఉంటాయని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు.
ఇంకా, చిన్నతనంలో బిడ్డలకు తల్లి ఆప్యాయతతో ఆహారాన్ని తినిపించటం, ఆప్యాయంగా కబుర్లు చెబుతూ పెంచటం వంటి జ్ఞాపకాలు బిడ్డలు ఎదిగిన తరువాత కూడా వారి వ్యక్తిత్వంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తాయట. బిడ్డలు బుడిబుడి అడుగులు వేయటం, వచ్చీరాని ముద్దుముద్దు మాటలు, ఇలాంటివెన్నింటినో కొందరు తల్లితండ్రులు కోల్పోతున్నారు.
నాకు తెలిసి ఒక ఆమె తనకు తన కెరీర్ ముఖ్యం ........ అంటూ చంటి బిడ్డను తల్లితండ్రుల వద్ద వదిలి వేరే ఊరు వెళ్ళిపోయింది.
పరిస్థితులు ఇలా మారటానికి కొందరు పురుషులు కూడా కారణమే. కొందరు పురుషులు , ఇంటిని సరిగ్గా పట్టించు కోకపోవటం వల్ల స్త్రీలు బయటకు వెళ్లి సంపాదించవలసి వస్తోంది.
మరి కొందరు పురుషులు అయితే, స్త్రీలు కూడా ఉద్యోగం చేయాలని , అప్పుడే సంపాదన సరిపోతుందని భావిస్తున్నారు.
ఇంటి పనులు చేయటం, ఆఫీసు పనులు ఇలా రెండింటినీ నిర్వర్తించటం అంటే మాటలు కాదు. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం లాగ ఎంతో కష్టం. దీనివల్ల అటు కెరీర్ కు, ఇటు ఇంటికి పూర్తి న్యాయం చేయలేక కొందరు స్త్రీలు అనారోగ్యాన్ని తెచ్చుకుంటున్నారు.
ఇంకా, సమయం లేక పిల్లలను చూసుకోలేకపోతున్నారు. వృద్ధులైన తల్లితండ్రి లేక అత్తామామ ఉంటే వారికి ఏమైనా అనారోగ్యాలు వస్తే వారిని చూసుకోవటానికి కుదరదు.
ఈ రోజుల్లో కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలు ఎలా ఉన్నాయంటే, ఎవరైనా ఆరోగ్యంగా ఉన్నంత వరకే పరిస్థితి బాగుంటుంది. . ఏ కొద్దిగా అనారోగ్యం వచ్చినా ఎవరు చూస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
పాత కాలంలో అయితే ఇంట్లో వాళ్ళకు అనారోగ్యం వస్తే కుటుంబసభ్యులు చక్కగా చూసుకునేవారు. ఇప్పుడు అందరూ బిజీ కదా ! కుటుంబసభ్యుల మధ్య అనుబంధాలకు తీరిక లేని ఈ సంపాదనలు ఎందుకు అని ప్రశ్నిస్తే ........
కొందరు తల్లితండ్రులు. ఏమంటారంటే, ఇలా డబ్బు సంపాదించి ఎన్నో సౌకర్యాలను పిల్లలకు అందిస్తున్నాం కదా ! అంటారు .
ఇలా పెరిగిన కొందరు పిల్లలు కూడా తాము పెద్దయ్యాక , ఎన్నో సౌకర్యాలతో కూడిన వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులను చేర్పిస్తున్నారు.
నేను చదివిన ఒక పుస్తకంలో పిల్లల మనోభావములు.... అనే విషయం గురించి రాసారు. పిల్లలు చిన్నతనంలో పెరిగిన పరిసరాలు, అలవాట్లు, పెంచిన వ్యక్తుల ప్రభావం... పెరిగి పెద్దయిన తరువాత వారిపై ఎంతో ఉంటుందట.
అందుకే , పిల్లల హృదయాలను పవిత్ర భావనలతో, పవిత్రాశయాలతో, పవిత్ర విద్యా విజ్ఞానాలతో నింపవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదనీ, యింత ధనం సంపాదించి వారికి అందించినంత మాత్రాన బాధ్యత తీరినట్లు కాదని వ్రాసారు.
.....................................
.Mitr, My Friend - Wikipedia, the free encyclopedia
.....................
ఇలా పెరిగిన కొందరు పిల్లలు కూడా తాము పెద్దయ్యాక , ఎన్నో సౌకర్యాలతో కూడిన వృద్ధాశ్రమాలలో తల్లితండ్రులను చేర్పిస్తున్నారు.
నేను చదివిన ఒక పుస్తకంలో పిల్లల మనోభావములు.... అనే విషయం గురించి రాసారు. పిల్లలు చిన్నతనంలో పెరిగిన పరిసరాలు, అలవాట్లు, పెంచిన వ్యక్తుల ప్రభావం... పెరిగి పెద్దయిన తరువాత వారిపై ఎంతో ఉంటుందట.
అందుకే , పిల్లల హృదయాలను పవిత్ర భావనలతో, పవిత్రాశయాలతో, పవిత్ర విద్యా విజ్ఞానాలతో నింపవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉన్నదనీ, యింత ధనం సంపాదించి వారికి అందించినంత మాత్రాన బాధ్యత తీరినట్లు కాదని వ్రాసారు.
.....................................
.Mitr, My Friend - Wikipedia, the free encyclopedia
.....................
"చెప్పడమే నాధర్మం వినకపోతే నీ కర్మం" అంటారు :)
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. .....మీరన్నది నిజమే.
Deleteఅయితే, నేను ఇలా టపాలు వ్రాస్తున్నందుకు నన్నెంత మంది తిట్టుకుంటున్నారో ..?
nice post andee..
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteఅనూరాధ గారు.. ఎవరో తిట్టుకుంటారని మీరు వ్రాయడం మానేస్తారా?
ReplyDeleteఈ మధ్య మీరు వ్రాసిన పోస్ట్లు అన్నీ చాలా చక్కని విషయాలు.
సమకాలీనంలో.. మీరు నడుస్తూ.. చూసినదే వ్రాసుకున్నారు.
మీరు వ్రాసిన విషయాలతో విభేదించ తగ్గ విషయాలు ఏవి లేవు. అందరు ఆలోచిన్చుకునేలా.. ఉన్న విషయాలే!
వ్రాస్తూ ఉండండి. అందువల్ల మీ నడవడిక మీ జీవన శైలి మీరు అనుకున్నట్లే మీరు కోరుకున్నట్లే జరుగుతాయి. ఆ ల్లైఫ్ స్టైల్ ఇతరులని ప్రభావితం చేస్తుంది. (అఫ్కోర్స్ మీ బిడ్డలకి అయినా) ఇది నా అనుభవం.
మీకు చెప్పాలనిపించింది. చెపుతున్నాను.
అలాగే భక్తి ,నమ్మకం అనేవి ఎవరికీ వారికే సంబంధించినవి.(వ్యక్తిగతమైనవి) వాటి గురించి ఇతరులకి చెప్పడం బావుండదు. అందువల్ల అనవసరవాదాలకి తావు ఇచ్చి మనకే మనపై విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉంది.
అభిమాన పూర్వకంగా చెప్పాలనిపించింది. అంతే!
నొప్పిస్తే క్షమించండి.
మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteఅయ్యో ! నేనేమీ నొచ్చుకోనండి.