ఓం.
....శ్రీ శనేశ్వరులు నికృష్ఠు , వికృత రూపుడు కాడు. తపోగ్నిచే దహించబడిన స్వర్ణ కాంతి కాయుడు సర్వాంతర్యామి, సర్వ సాక్షీభూతుడు. పరిపూర్ణ అహింసామూర్తి...
..." తన కర్మ శేష ఫలితముగా అయితేనేమి, కుకర్మల కారణముగా నైతేనేమి మానవుడు రోగి లేక భోగి అవుతున్నాడు మానవుల కుకర్మల ఫలితమే రోగము. రోగము నుండి విముక్తి పొందాలంటే వైద్యున్ని ఆశ్రయించాలి. రోగమూలము నిర్ధారణ చేసి వైద్యము చేసి రోగి నుండి రోగాన్ని పారద్రోలడమే వైద్యుని కర్తవ్యము. కాని రోగితో గాని రోగముతో గాని వైద్యునికి ఎలాంటి సంబంధము లేదు. ఈ విధంగానే బహుబంధాలు , బహుబాధలు మానవ జనిత కర్మ ఫలములే. కాని శని కృతము కాదు. గ్రహదేవుడు బాధిస్తాడా ? వేధిస్తాడా ? ఎంతటి అజ్ఞాన భావన. వీటినుండి ముక్తి పొందాలంటే గ్రహదేవుని పాదాల కడ సమర్పణ భావముతో ప్రార్ధించడం ఉత్తమం...."
.( ఈ విషయములు శ్రీ శనేశ్వర దేవతా మహాత్యము గ్రంధము లోనివి. )
....ఈ గ్రంధ కర్త శ్రీ మహాజన్ స్వామి రావు గారు. వీరు షిరిడి సాయిబాబా గారి భక్తులు కూడానట. ఈ గ్రంధము శింగణాపూర్ శ్రీ శనేశ్వరాలయము పబ్లిక్ ట్రస్ట్ వారి సౌజన్యముతో ముద్రితమైనదట. ఈ గ్రంధములో శనిదేవుని గురించిన మహిమలు ఉన్నాయి.
...............................
కొందరు ఏమనుకుంటారంటే, శనిదేవుడు ప్రజలను శిక్షిస్తారు అంటారు. అలా అనుకోవటం తప్పు. నాకు ఏమనిపిస్తుందంటే,
శనిదేవుడు న్యాయ పరిరక్షకుడు. కాబట్టి , ఎవరైనా పాపాలు చేస్తే వారికి తగ్గ శిక్షను విధించి, తద్వారా వారిని మంచి మార్గానికి తీసుకు వస్తారు.
లోకంలో శిక్షలంటూ లేకపోతే ప్రజలలో పాపభీతి తగ్గిపోతుంది కదా ! న్యాయస్థానాలలో జడ్జీలు కూడా శిక్షలను విధిస్తారు .
.............................
శ్రీ శనిదేవుడు శ్రీ క్షేత్ర శింగణాపూర్ లో వెలిసారు.
మేము ఒకసారి షిరిడి వెళ్ళినప్పుడు శ్రీ శని శింగణాపూర్ కూడా వెళ్ళి వచ్చాము... .
ఈ ఊరిలోని అంగళ్ళకు తాళములు వేయరట.
ఇక్కడ దొంగతనములు జరగవు.
................
శింగణాపూర్ సందర్శించే భక్తులకు కొన్ని ముఖ్య సూచనలలో కొన్ని .....
భక్తులు తమ వెంట మద్యమాంసాదులు తీసుకెళ్ళుట దైవాపరాధము అని చెప్పబడింది....
ఇక్కడ కుల, మత , వర్ణ ,వర్గ వ్యత్యాసాలు పాటించతగదని పెద్దలు తెలియజేసారు.
పవిత్ర ప్రసాదమును మూఢభావాలతో తిరస్కరించడము దైవాపరాధమని పెద్దలు తెలియజేసారు.
............
ఎన్నో ప్రత్యేకతలున్న క్షేత్రము శ్రీ శని శింగణాపూర్....
ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఊరు ఉన్నదని ఎందరో ఆస్తికులు, నాస్తికులు కూడా ఈ ఊరును దర్శిస్తుంటారట..
..............
వ్రాసిన విషయాలలో ఏమైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించాలని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను...
శని దేముడు ఏమిటండీ!? ఆయన ఒక గ్రహము. పరమేశ్వరుని కింకరుడు ఆయన. "శనైశ్చరుడు" సరి అయిన పదం. చాలా మంది శనీశ్వరుడు అంటారు. అది తప్పు. గ్రహములకు ఈశ్వరుని అంత స్థాయి లేదు. ఈశ్వరుని అనుఙ్ఞ మేరకు గ్రహములు మనని ప్రభావితం చేస్తాయి. రాజు క్రింద పనిచేసే వారందరినీ రాజా అని పిలవడం సరికాదు కదా!
ReplyDelete* మీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి. నేను మీ వ్యాఖ్యను కొద్దిసేపటి క్రితమే చూసాను.. రిప్లై ఇవ్వటం ఆలస్యమైనందుకు దయచేసి క్షమించండి..
ReplyDelete* నాకు తెలిసిన విషయాలు తక్కువ....నాకు తెలిసినంతలో రాసానండి.
* ఆదిపరాశక్తిపరమాత్మ అయిన ఆది దైవం అన్నింటికీ మూలం.
* దైవాన్ని ఎలాగైనా పూజించుకోవచ్చునని పెద్దలు చెబుతుంటారు. దైవాన్ని కొందరు ఒక్క నామము, ఒక్క రూపంతో భావించి ఆరాధిస్తారు. మరి కొందరు రకరకాల నామములు, రూపాలతో దైవాన్ని భావించి ఆరాధిస్తారు. ఎవరి ఓపిక , ఆసక్తి వారిది.
* ఒక్క నామంతో ఒక్క రూపంతో దైవాన్ని ఆరాధించినా లేక విభిన్న నామములతో రూపములతో ఆరాధించినా ఫలితం ఒకటిగానే వస్తుంది. భగవంతుని మెప్పించేది భక్తి మాత్రమే.
* కొందరు ఆదిపరాశక్తి అయిన పరమాత్మను ఆరాధిస్తారు. కొందరు శివుణ్ణి ఆరాధిస్తారు. కొందరు విష్ణువును ఆరాధిస్తారు. కొందరు సూర్యుణ్ణి ఆరాధిస్తారు. కొందరు హనుమంతుని ఆరాధిస్తారు. కొందరు చాలా దేవతలను ఆరాధిస్తారు.
* సంధ్యావందనం చేయటం, గాయత్రిని అర్చించటం మాత్రం చాలా మంది చేస్తారు.
* సీతాదేవిని తీసుకురావటం కోసం లంకకు వెళ్ళేముందు విష్ణుమూర్తి అంశ అయిన రాముడు ఆదిత్యహృదయం ద్వారా సూర్యుని ఉపాసించారట.
* రాముడంతటి వారే సూర్యదేవుని ఆరాధించినప్పుడు సామాన్య మానవులు సూర్యుని దేవునిగా ఆరాధించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆ సూర్యదేవుని పుత్రుడే శనిదేవుడు.
* శివుడు, విష్ణుమూర్తి శనిదేవునికి గురువులట.......సూర్యుడు హనుమంతునికి గురువట. శనివారం హనుమంతుని పూజించిన వారిని శని బాధించరట.
* నవగ్రహాల అధిపతులు దేవుళ్ళుగా నవగ్రహ పూజ పెద్దలు ఏర్పరిచిందే కదండి.
* సత్యనారాయణస్వామి వారి పూజలో కూడా నవగ్రహ పూజ జరుగుతుంది.
* శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళిఃలో ఇలా ఉన్నాయండి.
ఓం సూర్యమండల మధ్యస్థాయై నమః
ఓం చంద్రమండల సంస్థితాయై నమః
ఓం వహ్ని మండల మధ్యస్థాయై నమః
ఓం వాయు మండల మధ్యస్థాయై నమః
* ఇవన్నీ గమనిస్తే దైవం సర్వాంతర్యామి అని తెలుస్తోంది. ఎవరి ఓపికను బట్టి వారు దైవాన్ని ఆరాధించుకోవచ్చు.
* ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా ఆ పరమదైవాన్ని ఆరాధించినట్లే. ఎందుకంటే ఆదిదైవం నుంచే అన్ని దైవరూపాలూ వచ్చాయి కాబట్టి....
* ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. నన్ను పరీక్షించటానికి ఇలా వ్యాఖ్యానించారని నేను భావిస్తున్నాను. తప్పులుంటే దయచేసి క్షమించండి.
శివుడు, విష్ణుమూర్తి శనిదేవునికి గురువులట.......సూర్యుడు హనుమంతునికి గురువట. శనివారం హనుమంతుని పూజించిన వారిని శని బాధించరట....
Delete.(...శనిదేవుడు శ్రీ కృష్ణునికి భక్తులట.)
chala baga vivarincharandi........
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete