ఇహపరాలలో ఉద్ధరించబడాలంటే మానవులు ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించకూడదో అనే విషయాలను అనాది కాలం నుంచీ ఎందరో తెలియజేస్తున్నారు.
మన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచే మనము ఎన్నో పాఠాలను నేర్చుకోవచ్చునంటారు పెద్దలు. శ్రీ దత్తాత్రేయ స్వామి వారు 24.. గురువుల గురించి చెప్పటం జరిగింది.
ఆ విషయాలు ఈ లింక్ లో చూడవచ్చు.....
24 GURUS (TEACHERS) OF SRI DATTATREYA SWAMI!
జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఎలా ప్రవర్తిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ..... అన్న వాటి గురించి అనేక విషయాలను పురాణేతిహాసాల ద్వారా కూడా పెద్దలు తెలియజేసారు.
ఎంతో జాగ్రత్తగా చక్కగా జీవించటం ద్వారా , సమాజంలో చక్కటి గౌరవాన్ని పొందే వ్యక్తిని ఉదాహరణగా చూపించి , అలా జీవించటం నేర్చుకొమ్మని పెద్దలు పిల్లలకు చెప్పటం ఎక్కువగా జరుగుతుంటుంది.
ఇంకా, వ్యక్తులు పొరపాట్లు చేసి జీవితంలో కష్టాలను అనుభవించిన సంఘటనల ద్వారా కూడా ఇతరులు పాఠాలు నేర్చుకోవచ్చు.
ఇతరులలోని మంచి లక్షణాలను చూసి మనం మంచిగా ఉండటాన్ని నేర్చుకోవచ్చు.
ఇతరులు పొరపాట్లు చేసి, కష్టాలు అనుభవించినప్పుడు , అటువంటి పొరపాట్లను మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని నేర్చుకోవచ్చు..
ఇలాంటి ఎన్నో సంఘటనలను పురాణేతిహాసాల ద్వారా కూడా పెద్దలు మనకు అందించారు.
................................
ఈ విషయం వేరే విషయం.
ఈ రోజు ఈనాడు పేపరులో ......రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల గురించి ఒక ఫోటో వేసి క్రింద వ్యాఖ్య రాసారు.
ఆ వ్యాఖ్యలో కొంత భాగం..........వర్షాలు కురవడం ప్రస్తుత సీజన్లో సాధారణమే అయినా ... ఎలాంటి అల్పపీడనం, వాయుగుండం, ఉపరితల ఆవర్తనం వంటివేవీ లేకుండానే విస్తారంగా వర్షాలు కురుస్తుండడం వాతావరణ నిపుణులనూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అని రాసారు.
నిజమే , ఈ మధ్య వరకూ రాష్ట్రంలో వానలు లేవు. అందువల్ల ఈ మధ్య చాలామంది వరుణయాగాలను కూడా నిర్వహించటం జరిగింది.
కొంతకాలం క్రిందట చెన్నైలో వర్షాలు లేక వరుణయాగం నిర్వహించినప్పుడు కూడా కొద్ది రోజుల్లోనే వర్షాలు పడ్డాయి.
ఎవరి నమ్మకాలు వారివి. ఇదంతా నమ్మటం నమ్మకపోవటం విషయంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఎలాగైతేనేం దైవం దయ వల్ల వానలు కురుస్తున్నాయి....
MAMCHI VIVARAnA
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
Deleteవ్యాసం ప్రధమ భాగం తో ఏకీభవిస్తున్నాను.మీరు సమాజం లో మంచిని పెంచే విధంగా వ్రాయటం అభినందనీయం.
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDelete