గోవు సకల దేవతాస్వరూపం కాబట్టి, నూతన గృహప్రవేశ సమయంలో ఆవును తీసుకు వచ్చి గృహప్రవేశం చేయిస్తే మంచిదంటారు. .
పాతకాలంలో అపార్ట్మెంట్స్ లేవు కదా ! అప్పుడు గోవు గృహప్రవేశానికి ఏమీ ఇబ్బంది ఉండేది కాదు.
అయితే ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ పుణ్యమాని ఎన్నో అంతస్తుల ఎత్తున ఇళ్ళు ఉంటున్నాయి .
అయినా మనవాళ్ళు ఊరుకోరు ..... . కొందరు ఆవును పైవరకు తీసుకెళ్ళి మరీ గృహప్రవేశం చేయిస్తున్నారు.
ఇవన్నీ చూసే ఈ కాలం పిల్లలు పూర్వులు ఇలాంటి ఆచారాలను ఎందుకు పెట్టారో ! అనుకునే అవకాశం ఉంది. పూర్వీకులు ఈ ఆచారం పెట్టినప్పుడు ఇలాంటి అపార్ట్ మెంట్స్ లేవు కదా !
మా చిన్నతనంలో మేము ఒక గృహం కొన్నాము. . గృహప్రవేశానికి తెల్లవారు ఝామున ముహూర్తం కుదిరింది.
గృహప్రవేశానికి మేము తెల్లవారు ఝామున వెళ్ళగా ఇంటి ఆవరణలో ఒక ఆవు దూడకు జన్మ ఇచ్చింది. ఆ ఆవు ఎవరిదో మాకు తెలియదు. రోడ్డు మీద కొన్ని ఆవులు తిరుగుతుంటాయి కదా ! ఎవరి ఆవో మరి.
అలా ఆ ఆవు దాని కదే రావటం, దూడ పుట్టడం ... చాలా శుభ సూచకమ్ అన్నారు. అలా జరగటం మాకు కూడా చాలా ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించింది.
నూతన గృహప్రవేశ సమయంలో ఆవు యొక్క ప్రవేశం మంచిది ... అని పెద్దలు చెప్పిన మాట నిజమే కానీ ,
మారిన కాలమాన పరిస్థితుల్లో ఎంతో ఎత్తైన అపార్ట్మెంట్స్ ను బలవంతానా ( మెట్ల మీద ) ఎక్కించి ఆవుదూడలను ఇబ్బంది పెట్టటం అనేది ఎంతవరకూ భావ్యమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.
ఇలా పెద్దలు చెప్పిన ఎన్నో ఆచారాలు రూపు మారి పోతున్నాయి కొందరు ప్రజల విపరీత ధోరణి వల్ల......
పాతకాలంలో అపార్ట్మెంట్స్ లేవు కదా ! అప్పుడు గోవు గృహప్రవేశానికి ఏమీ ఇబ్బంది ఉండేది కాదు.
అయితే ఈ రోజుల్లో అపార్ట్మెంట్స్ పుణ్యమాని ఎన్నో అంతస్తుల ఎత్తున ఇళ్ళు ఉంటున్నాయి .
అయినా మనవాళ్ళు ఊరుకోరు ..... . కొందరు ఆవును పైవరకు తీసుకెళ్ళి మరీ గృహప్రవేశం చేయిస్తున్నారు.
ఇవన్నీ చూసే ఈ కాలం పిల్లలు పూర్వులు ఇలాంటి ఆచారాలను ఎందుకు పెట్టారో ! అనుకునే అవకాశం ఉంది. పూర్వీకులు ఈ ఆచారం పెట్టినప్పుడు ఇలాంటి అపార్ట్ మెంట్స్ లేవు కదా !
మా చిన్నతనంలో మేము ఒక గృహం కొన్నాము. . గృహప్రవేశానికి తెల్లవారు ఝామున ముహూర్తం కుదిరింది.
గృహప్రవేశానికి మేము తెల్లవారు ఝామున వెళ్ళగా ఇంటి ఆవరణలో ఒక ఆవు దూడకు జన్మ ఇచ్చింది. ఆ ఆవు ఎవరిదో మాకు తెలియదు. రోడ్డు మీద కొన్ని ఆవులు తిరుగుతుంటాయి కదా ! ఎవరి ఆవో మరి.
అలా ఆ ఆవు దాని కదే రావటం, దూడ పుట్టడం ... చాలా శుభ సూచకమ్ అన్నారు. అలా జరగటం మాకు కూడా చాలా ఆశ్చర్యాన్ని , ఆనందాన్ని కలిగించింది.
నూతన గృహప్రవేశ సమయంలో ఆవు యొక్క ప్రవేశం మంచిది ... అని పెద్దలు చెప్పిన మాట నిజమే కానీ ,
మారిన కాలమాన పరిస్థితుల్లో ఎంతో ఎత్తైన అపార్ట్మెంట్స్ ను బలవంతానా ( మెట్ల మీద ) ఎక్కించి ఆవుదూడలను ఇబ్బంది పెట్టటం అనేది ఎంతవరకూ భావ్యమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి.
ఇలా పెద్దలు చెప్పిన ఎన్నో ఆచారాలు రూపు మారి పోతున్నాయి కొందరు ప్రజల విపరీత ధోరణి వల్ల......
నేను సుభద్ర కీర్తి గారి టపాలో వ్రాసిన వ్యాఖ్యను గురించి మరికొన్ని వివరాలు రాయాలనుకుంటున్నానండి.
ReplyDeleteసుభద్రకీర్తి గారు , మీరు మీ బ్లాగులో " శ్వేతకేతు అనే వాడు బహుభర్త వ్యవస్థ ని రద్దు పరచి ఏకపత్ని వ్యవస్థను ప్రారంభించాడు. " అని రాసారు.
శ్వేతకేతు మహా భారత కాలం నాటి వ్యక్తి అనుకుంటున్నాను. ( నాకు తెలిసినంతలో ) .
కానీ, మహాభారతం కన్నా ప్రాచీనకాలం నాటి రామాయణ కాలంలోనే ఏకపత్నీవ్రతం ఉంది . ఇంకా సనాతనమైన వేదాల్లోనే చక్కటి కుటుంబవ్యవస్థ గురించి , భార్యాభర్తల విధుల గురించి చెప్పబడిందంటారు.
బహుశా శ్వేతకేతు వారి సమయంలో పరిస్థితుల ప్రాబల్యం వల్ల సమాజంలో కొన్ని వింత ఆచారాలు ఉండి ఉండవచ్చు. అప్పుడు శ్వేతకేతువు ఏకపత్నీవ్రతాన్ని పునరుద్ధరించి ఉండవచ్చు.
అంతేకానీ, ఏకపత్నీవ్రతం అనేది శ్వేతకేతువు నుంచే ప్రారంభమవలేదు అన్నది నా అభిప్రాయం.
( నాకు తెలిసినంత వరకు , ఈ శ్వేతకేతు తాతగారు అయిన అరుణుడు ధౌమ్యుని శిష్యులట. ధౌమ్యుడు పాండవుల కాలం నాటి వారని అంటారు కదా ! )
ఇంకా మీ టపాలో ఈ బహు భర్త వ్యవస్థ పై చార్వాకులు ( దేవుణ్ణి నమ్మని వారు ) తమదైన అలోచన చేశారు. ...............అంటూ శివపార్వతుల గురించి .............కొన్ని బాధాకరమైన విషయాలను రాసారు.
నా అభిప్రాయాలను కొద్దిగానైనా వివరించకపోతే అందరూ నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. అందుకే ఇవన్నీ రాయవలసి వచ్చింది. ఇదంతా మళ్ళీ వివరించటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా తప్పనిసరి పరిస్థితిలో ఇవన్నీ వివరించవలసి వచ్చింది. దయచేసి అపార్ధం చేసుకోవద్దని కోరుకుంటున్నానండి.
నా అభిప్రాయాలను తెలపటానికే కానీ ఎవరినీ నొప్పించటానికి ఇవన్నీ రాయలేదని మనవిచేసుకుంటున్నాను...
మీరు దయచేసి ఒకసారి " Rahul Sankrityayan " గారి గురించి వికీపిడియాలో చదవండి.
అనురాధ గారు మరలా మరొక్కసారి చెపుతున్నాను మీరు అచారవంతమైన స్త్రీ గా బాధ పడుతున్నారు. మీ ఆలోచనలు మీవి మిమ్ములను నేను తప్పు అనటం లేదు.
ReplyDeleteఅలాగే రాహుల్ సా౦క్రుత్యాయన్ గారి వోల్గా సే గంగా చదివారా? వికీపీడియా లో వారి జీవిత చరిత్ర వుంటుంది కాని ఈ పుస్తకం తాలూకు సవివరం వుండదు.వేదాలు,ఉపనిషత్ లు, పురాణాలు వేరు వేరు గా చూడాలి. అవి ఉద్భవించిన కాలాన్ని పరిగణలోకి తీసుకోవాలి.నేను పైన తెలిపిన పుస్తకంలో అ౦త్రొపాలజి బేస్ గా మానవ జీవ పరిణామములో నాగరికత ఎలా మార్పు చెందినది.ఆటవిక జివనాల ను౦చి మాతృ స్వామ్య వ్యవస్థ లు మీదగా పితృ స్వామ్య వ్యవస్థలతో పాటు, ఆటవిక సమూహ జీవనాలు,గణ వ్యవస్థలు,రాజరిక జివనలాలు తో పాటు స్వాతంత్ర పోరాటాలు దాక వర్ణించిన గ్రంధం.మీకు తప్పు ఇబ్బంది అనిపించినది అతిధి దగ్గర ప్రస్తావన. అది వున్నది అన్నది సత్యం.
అయ్యా ! మిమ్మల్ని " Rahul Sankrityayan " గారి గురించి ఎందుకు చదవమన్నానంటే, వారు మార్క్సిస్ట్ సోషలిజం భావజాలాన్ని కూడా కలిగిన వారట. ఈ విషయాన్ని మీరు గమనిస్తారని చదవమన్నాను.. అంతేనండి.
Deleteనాగరికత , జీవ పరిణామం సంగతి అలా ఉంచితే రామాయణ కాలం , భారత కాలం , శ్వేతకేతు నాటి కాలం ....... ఈ కాలాలన్నీ మానవులు ఆటవిక దశను దాటి నాగరికతను సాధించిన కాలాలే. అనటంలో ఎటువంటి సందేహం లేదు.
శ్వేతకేతు వల్ల బహు భర్త వ్యవస్థ పోయి ఏకపత్ని వ్యవస్థ వచ్చింది , అని మీరు వ్రాసారు. కానీ, శ్వేతకేతు కన్నా ముందే ఏకపత్ని వ్యవస్థ గురించి , చక్కటి కుటుంబ వ్యవస్థ గురించి ప్రజలకు తెలుసు అన్నది చెప్పాలని నా అభిప్రాయం. అంతేనండి.
అలాగే మీరు ఒక పేరు వివిధ కాలాల్లో వివిధ వ్యక్తులకు వుంటుంది. ధౌమ్యుడు పాండవుల పురోహితుడు. అంతకు తప్ప అతనికి పెద్ద క్రియ భారతంలో లేదు.కొద్ది పాత్ర మాత్రమే వున్నది.
ReplyDeleteఇక చార్వాకుల గురించి మీరు చదవలేదని తెలిసిపోతున్నది. వాళ్ళకు శివపార్వతులు దేవుళ్ళు కాదు వుంటే గింటే వ్యవస్థలోని వ్యక్తులుగా చూస్తా౦ అనే తత్వం.మీరు తెలుగులో వచ్చిన తాత్విక పుస్తకాలు ఏమి చదివారో ఒక్కసారి నాకు మెయిల్ చేయండి. అలాగే మీకు వీలు వెంబడి ఈ విషయం పై వివరంగా మెయిల్ ఇస్తాను. అన్యాద భావించ వలదు.
rameshsssbd@gmail.com
ధౌమ్యుని శిష్యుడు అరుణి, అరుణి కుమారుడు ఉద్దాలకుడు, ఉద్ధాలకుని కుమారుడే శ్వేతకేతు అని అంతర్జాలంలో ఉంది.
Deleteచార్వాకులు అంటే , దేవుణ్ణి నమ్మని వారని మీరే చెబుతున్నారు. దేవుణ్ణి నమ్మని వారు దేవుణ్ణి గురించి చెప్పే భావాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు.
నేను బోలెడు గ్రంధాలు చదవ లేదండి. . నేను గృహిణిని. నాకు బోలెడు గ్రంధాలు చదివేంత సమయం ఉండదండి.
చార్వకులు దేవుడిని నమ్మక పోయినా చక్షువులకు దర్శన మైన మానవుని వాడి పురాతన చరిత్ర పై చర్చ లకు ఉదాహరణ లు తప్ప ముఖ్య వస్తువులుగా స్వీకరించరు. ఉదాహరణకు కారణం సామాన్యులకు దగ్గరగా వుంటాయని అని మాత్రమే.
Deleteఅవకాశం ఉంటే చదవండి. రామాయణ కల్ప వృక్షం ఎంత ఇష్టం తో చదువుతారో అంతే భాద్యత తో విష వృక్షం చదవండి. అయితే రాముడు దేవుడు కాడు అనే వెటకార తిరస్కార భావ జాలాన్ని మనస్సు కు ఎక్కించు కొనరాదు.
మీరు సాధారణ గృహిణి అయినా ఆసక్తి వున్నది అదే తెలుసు కోవటానికి మొదటి మెట్టు. ఇక మధ్యలో వచ్చే ఇటు వంటివి అన్ని చిన్న చిన్న ప్రతి బంధకాలే
వివాదం అని కాదు ఆచారాలు కాల మాన పరిస్థితులను బట్టి మారుతుంటాయి. ఒకనాడు యజ్ఞయాగాదులలో బ్రాహ్మణులు బలి ఇచ్చి వారు అన్నది మీ కద ద్వార మీరే వొప్పు కుంటున్నారు. మరి కొన్ని సమయాల్లో బ్రాహ్మణులు మాంసం తినే వారు అన్నది నిజమాకాదా! అంత దాక ఎందుకు నేటికి బెంగాల్,అస్సాం లోని ఈ వర్గాలు చేపను ఆరగిస్తారు. రామకృష్ణ పరమహంస పుస్తకాల్లో చేపల పులుసు నైవేద్యం పెట్టినట్లు వున్నది. మరి మనకు అది అనాచారం.ఇలా అనేకం వున్నాయి గమనించండి.రామాయణం లో రాముడు తన ధర్మం గా ఆచరించాడు అంతే తప్ప అదే వున్నది అనటం సరికాదు.అది ఆనాడే వుంటే అతని తండ్రి ముగ్గురు భార్యలకు భర్త ఎలాగుఅవుతాడు.
ReplyDeleteబలి ఇవ్వకుండా తపస్సులు చేసి దేవుని వద్ద వరాలు పొందిన వారు కూడా ఎందరో ఉన్నారు .
Deleteజీవహింసతో కూడిన యజ్ఞాలు , యాగాలు చేయకుండానే భక్తి ద్వారా మోక్షాన్ని పొందిన భక్తులూ ఎందరో ఉన్నారు.
జడభరతుడు ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఎంతో సామాన్యంగా జీవించి కూడా అంత్యకాలంలో దైవసాయుజ్యాన్ని పొందారు.
రామాయణ కాలం నాటికే మాతృస్వామ్య వ్యవస్థ కాకుండా పితృస్వామ్య వ్యవస్థ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది కదా !
ఈ మాట వాస్తవమే అయినా మొదట్లో బలి ప్రక్రియ వున్నది. తదనంతర పరిణామాల్లో బలి ప్రక్రియను రకరకాలు గా మార్చారు.ఆజ్యం,హవిస్సులు,యజ్ఞసమిధల్లో మార్పులు,యజ్ఞ ఆహార బలులు ఇలా అనేక రకాల మార్పులకు లోనైనది. ఇప్పటికి తంత్ర ప్రక్రియలో బలి ఉన్నది.మార్పు అనేది నిరంతర ప్రక్రియ దానిని నిరోధించటం అనేది అసాధ్యం.మనం ఇన్ని కాలాలు దాటిన తరువాత దూరం నుంచి ఒక బిందు రూపం లో మాత్రమే చూడ గలుగుతున్నాం తప్ప పరామర్శ చేయలేము. ఇక సమీక్ష అనేది అసాధ్యం. కారణం సమీక్షకు వస్తువు యొక్క స్వభావం పై పూర్తి అవగాహన ఉండాలి. అది కృష్ణుని వల్ల తప్ప మన వల్ల కాదు.
Deleteమనం చేసేవి,చూసేవి అన్ని మాయ అనేది అందుకే.
* మానవులు తమ స్వార్ధ ప్రయోజనాలకు అనుగుణంగా పెద్దలు ఏర్పరిచిన ఆచారాలను కూడా మార్చుతున్నారు అనిపిస్తుంది.
Deleteఇక బలుల విషయానికి వస్తే,
* బలి ప్రక్రియ అనవసరం అని .....పెద్దలు గ్రంధాల ద్వారా చెప్పటం జరిగింది.
* ఈ రోజుల్లో అయితే వేలాది జీవులను మటన్ షాపులో , చికెన్ షాపులో బలి ఇచ్చి వాటి మాంసాన్ని తింటున్నారు.
* ఏదైనా జీవహింసే కదా !
వేదాల్లో వున్నది జీవన విధానం అన్నది సత్యమే కాని వేదాల్లో అనేకం వివరించారు.
ReplyDelete"నా అభిప్రాయాలను కొద్దిగానైనా వివరించకపోతే అందరూ నన్ను అపార్ధం చేసుకుంటున్నారు. అందుకే ఇవన్నీ రాయవలసి వచ్చింది. ఇదంతా మళ్ళీ వివరించటం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది"
ఈ మాటలు మీరు వ్రాసారు. మీ బ్లాగ్ లో కాని, నా బ్లాగ్ లో కాని ఇంకా ఎవరన్నా అభ్యంతరాలు వ్యక్తం చేసారా?లేదే కొద్దిగా శా౦తి౦చ౦డి, నెమ్మది౦చం౦డి ఆపై ఆలోచించండి
నేను ఇవన్నీ నెమ్మదిగా ఆలోచించే రాసానండి.
ReplyDeleteఏమైనా మీ అభిప్రాయాలు మీవి. నా అభిప్రాయాలు నావి.
మీరు వ్రాసిన టపా వల్ల నాకు ఎన్నో కొత్త విషయాలు తెలిసాయి. ఇందుకు మీకు కృతజ్ఞతలండి....
జరిగినదంతా ఒక మంచి చర్చగానే నేను భావిస్తున్నాను.
నేను కూడా ఎవరినీ అపార్ధం చేసుకోవటం లేదండి. మీకు మరొక్కసారి కృతజ్ఞతలండి.
శ్వేతకేతు ఏర్పాటు చేసినది ఏకపత్నీ వ్రతం కాదు, నా బ్లాగులో అద్దె గర్భాలు టపా రాశా, చూడండి.10.10.2011 and 11.10.2011
ReplyDeleteమీ వ్యాఖ్యకు కృతజ్ఞతలండి.
ReplyDeleteమీరు వ్రాసిన విషయం తప్పక చూస్తానండి.
మీరు వ్రాసిన టపాలు చదివానండి.
Deleteఆ నాటి సంఘటనల నుంచీ ..... ఈ నాటి టెస్ట్ ట్యూబ్ బేబీలు , సర్రొగేట్ మదర్స్ వరకు ...... సంతానం కొరకు తరతరాల నుంచి ....ఎన్నో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయని తెలుస్తోంది...
.........
( గర్భిణిఅయిన యుతద్యుడనే ముని భార్య మమతను దేవరన్యాయంగా బృహస్పతి సంతతికోసం సంగమం కోరుతాడు. గర్భస్థుడైన బాలకుడిది అన్యాయమని ఎదిరిస్తాడు. .).....ఈ విషయం కొంచెం అయోమయంగా ఉందండి .
అప్పటికే గర్భవతి అయిన స్త్రీ వల్ల మరల సంతానాన్ని ఎలా పొందగలరో తెలియటం లేదు.
ఇవన్నీ చదివిన తరువాత నాకు ఏమనిపిస్తుందంటే,
ReplyDeleteవివాహం జరిగిన తరువాత స్త్రీ " అర్ధాంగి " అవుతుంది. .......అంటే భర్తలో అర్ధ భాగం అని. పెద్దలు చెప్పటం జరిగింది.
సనాతనమైన వేదాలలోనే ఏకపత్నీ, ఏకపతీ........గురించి చెప్పబడిందట.
వివాహమంత్రాలు ఇంకా " నాతిచరామి ........ " వంటివి గమనిస్తే భార్యాభర్తలు విషయంలో పెద్దల అభిప్రాయం అర్ధమవుతుంది.
పర స్త్రీని తల్లిలా గౌరవించాలని కూడా పెద్దలే తెలియజేసారు.
అలాంటప్పుడు పరాయి స్త్రీని కోరుకునే ఆచారాలు సమాజంలో ఏర్పడటానికి కారణం ప్రజల ఆశలు, కోరికలే......
ప్రజలు తమ కోరికలకు అనుగుణంగా ఆచారాలను మార్చివేస్తారని అర్ధమవుతోంది.
..........................
నేను చదివిన కొన్ని విషయాలను ఇక్కడ ప్రచురిస్తున్నాను.
* ' ఈ పురాణాలు మధ్య యుగం లో జరిగిన కొన్ని ఘర్షణల వలన పరివర్తన చెందాయి అనే వాదన కూడా లేక పోలేదు. కొన్ని శ్లోకాల రచన శైలి వ్యాస మహర్షి రచన శైలిని గమనిస్తే ఆ విషయం అవగతం అవుతుంది. " .....అని కొందరు అంటారు.
* ఏది అసలైన విషయమో భగవంతునికే తెలియాలి....