ఇక యయాతి దేవయానిల సంతానమైన యదు , తండ్రి యొక్క
వృద్ధాప్యాన్ని స్వీకరించటానికి నిరాకరించటం వల్ల శాపానికి
గురౌతారు.
యయాతి శర్మిష్టల సంతానమైన పురు , తండ్రి అయిన యయాతికి శాపవశాత్తు సంక్రమించిన వృద్ధాప్యాన్ని కొంతకాలం స్వీకరించి తద్వారా రాజ్యపాలనకు అర్హతను పొందారు.
( ఏమైనా, పురు ఇలా వృద్ధాప్యాన్ని స్వీకరించటమనేది గొప్ప విషయమే. )
నాకు తెలిసినంతలో..........
పురు వంశంలో క్రమంగా ...... శంతనుడు....... శంతనుని కుమారుడైన భీష్ముడు , తండ్రి కొరకు ప్రతిజ్ఞ చేసి రాజ్యపాలనకు దూరమై అవివాహితుడుగా ఉండిపోవటం, శంతనునికి సత్యవతిదేవి వల్ల జన్మించిన కుమారులిద్దరూ వారసులు లేకుండానే మరణించటం, తరువాత వ్యాసుని వల్ల అంబిక ,అంబాలికలు సంతానాన్ని పొందటం, కౌరవులు , తరువాత పాండవులు జన్మించటం ఇలా .......కధ జరిగింది.
యదు వంశంలో క్రమంగా...... ...... దేవకీదేవి వసుదేవులకు శ్రీకృష్ణుడు జన్మించటం , అంతకుముందే దేవకీ గర్భం నుంచి సంకర్షించబడి రోహిణీదేవి గర్భాన బలరాముడు జన్మించటం ఇలా...... కధ జరిగింది.
పాండవులను శ్రీకృష్ణుడు ఎన్నోసార్లు ఆదుకున్నారు. ఆ క్రమంలో గాంధారి వల్ల శాపాన్ని కూడా పొందారు.
ఇవన్నీ గమనిస్తే ఎన్నో విషయాలు మనకు అర్ధమవుతాయి..ఎన్నో మనస్తత్వాలు., ఎన్నో విషయాలు, ఎన్నో చిత్రవిచిత్రమైన మలుపులతో భారతగాధ అద్భుతంగా సాగిపోయింది. ఈ గాధనుండి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఇన్ని గొప్ప విషయాలను అందించిన పెద్దలకు ధన్యవాదాలు..
No comments:
Post a Comment