koodali

Wednesday, May 16, 2012

సూర్య ప్రభ, చంద్ర శోభ ....సూర్యప్రభ, చంద్ర ప్రభ.


దేవతల గురించి పెద్దలు చెప్పిన విషయాల్లో అర్ధాలు నిగూఢంగా ఉంటాయట. మనం వాటి    పైపై విషయాన్ని చూసి ఒక నిర్ణయానికి వచ్చెయ్యకూడదు.


గోలోకానికి అధిపతులు .... శ్రీకృష్ణుడు రాధాదేవి. .  శ్రీకృష్ణుడురాధాదేవి  దంపతులు.

ఒక సందర్భంలో శ్రీకృష్ణుని   రాసలీలల గురించి ,   రాధాదేవి శ్రీ కృష్ణుని  అడిగిన  సందర్భంలోని  కొన్ని విషయాలు ఇలా ఉన్నాయి. .......


శోభ అనే గోపిక శరీరం విడిచిపెట్టి చంద్రమండలంలోకి వెళ్ళిపోగా ...... శ్రీకృష్ణుడు ఆవిడ తేజస్సును విభజించి కొంత రత్నానికి, బంగారానికి, స్త్రీల ముఖాలకీ,చిగురాకులకీ  , పువ్వులకీ, పక్వ ఫలాలకీ, పంటలకీ, రాజదేవమందిరాలకీ, శిశువులకీ, క్షీరానికీ, పంచిపెట్టారట.


 
ప్రభ అనే గోపిక సూర్యమండలానికి వెళ్ళిపోయింది...... ఆ ప్రభను కృష్ణుడు కొంత తన కన్నులలో దాచుకున్నారట. కొంత అగ్నికీ., యక్షులకీ, పురుష సింహాలకీ, దేవతలకీ, విష్ణుజనులకూ, నాగజాతికీ, బ్రాహ్మణులకూ, మునులకీ, తపస్వులకూ, సౌభాగ్యవతులకూ, యశస్వంతులకూ విభజించి ఇచ్చారట.



శాంతి అనే గోపిక శరీరాన్ని విడిచి కృష్ణునిలో లీనమయ్యిందట. .......... శాంతిని విభజించి కొంత బ్రహ్మకూ, కొంత రాధాదేవికీ, లక్ష్మీదేవికీ, కృష్ణుని మంత్రోపాసకులకూ, శాక్తేయులకూ, తపస్వులకూ, ధర్ముడికీ పంచిపెట్టారట.


క్షమ అనే గోపిక ప్రాణాలు విడిచి భూమిలో కలిసిపోయిందట. ............... అప్పుడు కొంత భాగాన్ని విష్ణువుకీ, వైష్ణవులకీ, ధార్మికులకీ, ధర్ముడికీ, దుర్బలులకీ, తపస్వులకూ, వేదపండితులకూ, పంచి ఇచ్చినట్లు చెప్పబడింది.

.............................................

ఇవన్నీ చదివితే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

ఈ విషయములలోని అంతరార్ధములు నాకు అంతగా తెలియవు కానీ ,


శాంతి అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ,క్షమ అనే గుణం ఎవరిలో ఎక్కువగా ఉంటుంది,   ఇత్యాది విషయాలు తెలుసుకోవచ్చని నాకు అనిపించిందండి.


 ఇంకా, ,

 శోభ కూ ప్రభకూ ఉండే తేడా  గురించి ,  ....ఏవి ఎక్కడ ఉంటాయి ,...ఇత్యాది విషయాలు తెలుసుకోవచ్చని నాకు అనిపించిందండి.


ఉదా... చంద్రునికి ఉండే తత్వాన్ని  శోభ అంటారనీ, సూర్యునికి ఉండే 
తత్వాన్ని  ప్రభ అంటారని తెలుస్తోంది.  
 

అప్పుడు  సూర్య ప్రభ,  చంద్ర శోభ  అని  అనాలి.  కాని  పూర్వీకులైన  పెద్దలు   సూర్య ప్రభ,  చంద్ర ప్రభ అని  కూడా  అన్నారు.   సూర్య ప్రభ  వాహనం,  చంద్ర  ప్రభ  వాహనం  అని  అంటారు  కదా  !

 

అయితే,   సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి , భూమికి చేరుతుంది ....అలా   సూర్యుని  కాంతి  (  ప్రభ )   చంద్రునిపై  పడటం  కూడా    వెన్నెల వెలుగుకు  ఒక  కారణం  అని  ఆధునికులు  కూడా    అంటున్నారు  కదా  !



 అలా  చూస్తే  సూర్యప్రభ, చంద్ర  ప్రభ  అని    కూడా  అనవచ్చు.  సూర్యప్రభ  వాహనం,  చంద్రప్రభ  వాహనం అని  పెద్దలు   అన్నది    సరైనదే. ( పెద్దలకు   కూడా  ఈ  విషయాలన్నీ  తెలుసు  అనిపిస్తుంది.) 


ద్వాదశార్యాసూర్యస్తుతిః లో.. 9 వ శ్లోకం ద్వారా.. సూర్యుని కిరణాలు చంద్రునిపై పడి రాత్రి వేళ వెన్నెలకాంతి వెలువడటం అనే విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు. 

..................
 ఇలా  ...   శ్రీ  కృష్ణుని  రాసలీలలు   ద్వారా    ఎన్నో  విషయాలు  కూడా   తెలుసుకోవచ్చు.
.................

వ్రాసిన  విషయాలలో  పొరపాట్లు  ఉంటే  దయచేసి  క్షమించమని  దైవాన్ని  ప్రార్ధిస్తున్నాను.

అంతా  దైవం  దయ..శ్రీపాద శ్రీవల్లభ స్వామివారికి  నమస్కారములు.....




No comments:

Post a Comment