జగన్మాతాపితరులు ఒక చక్కటి ప్రణాళిక ప్రకారం ఈ సృష్టిని నడిపిస్తుంటారు.
దేవతలు ఒకరికొకరు శాపాలు ఇచ్చుకోవటం వల్ల లోకానికి మాత్రం మేలే జరిగింది అనిపిస్తుంది. . ఉదా...ఒకానొక శాపం వల్ల గంగాదేవి భూమిపై అవతరించటం వల్ల ( గంగా జలం లభించి ) లోకానికి మేలే జరిగింది కదా !
విష్ణుమూర్తిని భృగు మహర్షి శపించటం ... ..రామాయణ , భారత గాధలు జరగటం ...ఇలా పురాణేతిహాసాల ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది.
పురాణేతిహాసాల ద్వారా రాబోయే తరాలకు దిశానిర్దేశం చేశారు పెద్దలు అనిపిస్తుంది.
మనకు ఎన్నో విషయాలు సరిగ్గా తెలియవు. ఉదాహరణకు .... మన మనస్సు నిర్మాణం గురించి మనకే సరిగ్గా తెలియదు.
ప్రపంచంలో ఎన్నో వింతలు, విశేషాలు, రహస్యాలు ఉన్నాయి. వాటి గురించీ సరిగ్గా తెలియదు.
ఈ లోకంలో ఇప్పుడు జరుగుతున్న విషయాల గురించే మనకు సరిగ్గా తెలియనప్పుడు, దైవరహస్యాల గురించి, పురాణేతిహాసాలలోని అర్ధాలు, అంతరార్ధాల గురించి పూర్తిగా తెలుసుకోవటం ఎంతో కష్టం కదా !
మన శక్తి మేరకు , విషయాలను తెలుసుకుని, ధర్మాన్ని ఆచరిస్తూ , మనల్ని సరైన మార్గంలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమోత్తమం..
***************
రాధాకృష్ణులు గోలోకాధిపతులు. రాధా దేవి శ్రీకృష్ణుని అర్ధాంగి. గోలోకం గురించి గ్రంధాలలో ఎంతో గొప్పగా వర్ణించారు. గోలోకంలో వైకుంఠం ఒక భాగమట.
గోలోక శ్రీకృష్ణుని అర్ధాంగి రాధాదేవి ( రాధిక ) , వైకుంఠంలోని చతుర్భుజ నారాయణుని అర్ధాంగి లక్ష్మీదేవి.
గోలోకం గురించి , గోలోక శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి గురించి శ్రీదేవీ భాగవతము గ్రంధంలో ఎన్నో వివరములున్నాయి..
*********
శ్రీదేవీ భాగవతము , శ్రీ పాద శ్రీ వల్లభ సంపూర్ణ చరితామృతము , ఒక యోగి ఆత్మ కధ ..... గ్రంధములలో ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.
మన శక్తి మేరకు విషయాలను తెలుసుకుని, ధర్మాన్ని ఆచరిస్తూ , మనల్ని సరైన మార్గంలో నడిపించమని దైవాన్ని ప్రార్ధించటం ఉత్తమోత్తమం....
రాధాదేవి శ్రీకృష్ణుని అర్ధాంగి కాదండి, please refer the link
ReplyDeletehttp://prabhupada.krishna.com/internal-potency-radharani
శశి గారు వ్యాఖ్యానించినందుకు కృతజ్ఞతలండి.
Deleteరాధాదేవి శ్రీకృష్ణుని అర్ధాంగి అని శ్రీదేవీభాగవతంలో ఉంది.
అయితే ఈ శ్రీకృష్ణుడు ద్వారకలోని శ్రీకృష్ణుడు కాదు. గోలోక ప్రభువైన శ్రీకృష్ణుడు .
గోలోక శ్రీకృష్ణుని పత్ని రాధాదేవి అని చెప్పారు. గోలోకం గురించి , రాధాకృష్ణుల గురించి శ్రీదేవీభాగవతంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలున్నాయి.
గోలోక శ్రీకృష్ణుని అర్ధాంగి రాధాదేవి , వైకుంఠంలోని చతుర్భుజ నారాయణుని అర్ధాంగి లక్ష్మీదేవి....... ఇలా చెప్పారు.
Deleteఇవన్నీ చదివిన తరువాత నాకు అర్ధమయ్యింది ఏమిటంటే ,
గోలోక శ్రీ కృష్ణుడు , ద్వారకలోని శ్రీకృష్ణుడు వేరు అని. వేరు అంటే గోలోక శ్రీకృష్ణుడు, చతుర్భుజ నారాయణుడు, ద్వారకలోని శ్రీకృష్ణుడు ..... ఒకే అంశ అయినా మళ్ళీ ఎవరికి వారే కావచ్చు అని. అంటే , ఉదాహరణకు విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటూనే రామునిగా అయోధ్యలో ఉన్నారు కదా ! అలా...అన్నమాట.
ఈ విషయాలు ఇందాకే టపాలో వ్రాద్దామనుకుని ఎందుకులే అని ఊరుకున్నానండి. .. వ్రాసిన విషయాల్లో పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించమని దైవాన్ని ప్రార్ధిస్తున్నాను..
ఆ గోలోక శ్రీ కృష్ణుడే ద్వాపర యుగం లో జన్మించిన యశోదానందనుడు
Deleteశశిగారూ ! ద్వారకలోని లోని శ్రీకృష్ణుడు, గోలోక శ్రీకృష్ణుడు వేరు అని శ్రీదేవీ భాగవతము లో స్పష్టంగా చెప్పలేదు.
Deleteఅయితే, గోలోకవర్ణన ఇంకా రాధాకృష్ణుల గురించి చదివిన తరువాత ద్వారక లోని శ్రీకృష్ణుడు, గోలోక శ్రీకృష్ణుడు వేరు అని నాకు అనిపించింది.
శ్రీ దేవీ భాగవతములో గోలోక శ్రీకృష్ణుని గురించి వైకుంఠంలోని చతుర్భుజ నారాయణుని గురించి చాలా వివరములు ఉన్నాయి.
ద్వాపర యుగంలో జన్మించిన శ్రీకృష్ణుడు గోలోక శ్రీ కృష్ణుడా లేక చతుర్భుజ నారాయణుడా వంటివి క్లిష్టమైన విషయములే..
వారందరూ ఒక్కరే అయినా మళ్ళీ వేరువేరు అనిపిస్తుంది........అవతారాలలో అంశావతారాలు, కళాంశావతారాలు, కళాంశాంశావతారాలు ... ఇలా ఎన్నో రకాలు ఉంటాయట.
గోలోకములో వైకుంఠం ఒక భాగం అని లేదండీ. గోలోకానికి అవతల ప్రక్క వైకుంఠం ఉంది అని చెప్పబడింది. అయితే దానిని వేరే లోకం అని చెప్పనందున, వైకుంఠం కూడా గోలోకంలో భాగమనుకుంటూ ఉంటారు. ఒక సారి ఇది చూడండి.
ReplyDeletehttp://navarasabharitham.blogspot.com/2011/08/blog-post_22.html
రసజ్ఞ గారు మీరు శ్రీకృష్ణుని గురించి రాసిన కవిత బాగుందండి.
Deleteనేను వ్యాఖ్యలో గోలోకములో వైకుంఠం ఒక భాగం. అని వ్రాసాను నిజమేనండి. . అయితే నేను గ్రంధంలో చూసి ఉన్నదున్నట్లుగా ఆ వాక్యాన్ని రాయలేదు.
మీ వ్యాఖ్య చదివిన తరువాత గ్రంధంలో చూస్తే , .......ఈ విశ్వంలో గోలోకం నిత్యం. అందులో ఒక ప్రదేశమే వైకుంఠం....అని ఉందండి.