నేను కొంత కాలం క్రిందట హరిశ్చంద్రుని గురించి వ్రాయటం జరిగింది. మరల ఈ రోజు ( కొన్ని కారణాల వల్ల ) ఈ టపాలు వెయ్యాలనిపించి వేస్తున్నానండి.
july 12, 2010
july 12, 2010
పురాణములలో ఉన్నది అధర్మం కాదు అంతా ధర్మమే.....పురాణములు ఎంతో గొప్పవి నాలుగవ భాగం ........ ...
ఇవాళ ఇంకో విషయం చెప్పుకుందామండి.
ఓం నమః శివాయః దుర్గాదేవికి నమస్కారములు..
కొంతమంది ఇలా అంటుంటారు. ఒకాయన తన మాట కోసం ఆలిని అమ్మేసాడు, ఒకాయన ఆలిని అగ్ని పరీక్షకు గురిచేశాడు అని , ఒకాయన జూదం లో ఆలిని పణంగా పెట్టాడు అని.....దీని గురించి కొంచెం చెప్పుకుందామండి.
హరిశ్చంద్రుడు ఉన్నారు. ఒకానొక సందర్భములో ఆయన సత్యవాక్పరిపాలన కోసం విశ్వామిత్రులవారికి తన రాజ్యాన్నిఇచ్చివేయాల్సి వచ్చింది. దక్షిణ కోసం కొన్ని బారువుల బంగారాన్నీ ఇవ్వటం మిగిలింది. దానికోసం ఆయన తనభార్యను, కుమారుని అమ్మిన మాట వాస్తవమే.
ఇది కొంచెం విచారించదగ్గ విషయమే, కానీ అప్పటి ప్రత్యేకమయిన సందర్భములో ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అప్పటికి తమకు తోచిన ఈ మార్గాన్ని ఎంచుకున్నారు... ధర్మరక్షణ కొరకు మాత్రమే వారు అన్ని కష్టాలను అనుభవించారు..
అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. వివాహ సందర్భములో భార్యాభర్తలు తాము జీవితములో కష్టసుఖాలనుకలసి పంచుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు కదా.....ఉదాహరణకు సంపదలు బాగా ఉన్నప్పుడు కుటుంబసభ్యులు అందరూసుఖభోగాలను అనుభవిస్తారుగదా! అలాగే ఆపదలలో వచ్చే కష్టాలను అందరూఎదుర్కోవాలి కదా.....
.అలాగే హరిశ్చంద్రుడు కష్టములో ఉన్నప్పుడు భార్యగా చంద్రమతీ దేవి హరిశ్చంద్రునితో తానే సలహా చెప్పటం జరిగింది ....తననిపరిచారికగా ఎవరికయినా ఇచ్చి వచ్చే సొమ్ముతో రుణం తీర్చమని... నిజంగా ఆవిడ ఎంత ఉత్తమ ఇల్లాలు. తానుపుట్టింటికి పోయి భర్త యొక్క పరిస్థితి చక్కబడ్డాక రావచ్చులే అని ఆమె అనుకోలేదు .. . ఆ సందర్భములో వారు ఎంతోబాధపడ్డారు. అయినా కూడా ఆ దంపతులు ధర్మాన్ని వీడలేదు.
కాశీలోని ఒక పండితునికి బార్యాబిడ్డలను అమ్మిన సందర్భములో హరిశ్చంద్రుడు పడ్డ బాధ వర్ణనాతీతం తన వలనసుకుమారులయిన తన భార్యాబిడ్డలు ఇంత కష్ట పడుతున్నారుగదా అని ఎంతగానో విలపించారు. ఆ తరువాతఆయనేమీ వారిమానాన వారిని వదిలేసి తాను రాజభోగాలను అనుభవించలేదు. ఇచ్చిన మాటకోసం తానుకూడాచండాలుని రూపంలో ఉన్న యమధర్మరాజుకు కాటికాపరిగా అమ్ముడుపోయారు.. . ఆతరువాత కొంతకాలానికి వారికుమారుడు పాముకాటుతో చనిపోవటంతో అందరూ శ్మశానములో కలుసుకున్నప్పుడు విరక్తితో శరీర త్యాగం చేసుకోబోతుంటే వారి సత్యవాక్పరిపాలనకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమయ్యి వారి కుమారుని బ్రతికించి అందరినిఅనుగ్రహించారు.
ఆ రోజుల్లో మరి సత్యం అంటే అంత గౌరవంతో పాటు మాట తప్పితే అందరికి కష్టాలు వస్తాయని కూడా ఆ నాటి వారుభావించేవారు. .. .... ఇంతటి సత్యవాక్పరిపాలన , త్యాగం ఈ రోజుల్లో మనవల్ల కానిపని .... కానీ ఇందులో ఏ కొద్దిగాపాటించినా చాలు లోకం ఎంతో బాగుపడుతుంది.
ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య చిన్న గొడవలకే హత్యలు, ఆత్మహత్యలు ఆ తరువాత పిల్లలు అనాధలవటం ఇలాంటివితగ్గుతాయి. అనాధలు ఎక్కువ కావటానికి తల్లిదండ్రుల మధ్య గొడవలు కూడా ఒక కారణమని నా అభిప్రాయం....
.ఇందులో మనము అయ్యో హరిశ్చంద్రుడు భార్యను ఎంత ఇబ్బంది పెట్టాడు అనుకోకుండా .... భార్యాభర్తలుసంపదలలోనే కాదు,....ఆపదలు వచ్చినప్పుడు కూడా అంతే ఐకమత్యముగా ఉండాలని.. పెద్దలు మనకు చెప్పారనిఅనుకోవచ్చు కదా...............
అయితే ఇది కలికాలం కాబట్టి అమ్ముడుపోవటం లాంటి సాహసాలు ఏమీ ఆడవాళ్ళు చెయ్యక్కర్లేదు కానీ భార్యా భర్తలు అన్యోన్యంగా ఉంటే చాలు.........
*********************
పురాణములలో ఉన్నది అధర్మం కాదు ....అంతా ధర్మమే..... పురాణములు ఎంతో గొప్పవి .... ఐదవ భాగము.........
ఓం శ్రీ సాయి.
హరిశ్చంద్రుల వారి కధ నుండి నాకు తోచిన ఇంకొన్ని విషయాలు చెప్పుకుందామండి. ఈ కాలం వాళ్ళు కొంతమంది అనుకుంటారు..... సత్యవాక్పరిపాలన ఇంత గట్టిగా పాటించాలా అని ....
ఇప్పుడు ఆ కధలో ..... .... కాశీ పండితులవారు తన భార్య సుకుమారి కాబట్టి, పిల్లలతో... పని అంతా చేసుకోలేకపోతోంది అని చెప్పి హరిశ్చందులవారి భార్యను, కుమారుని పరిచారకులుగా కొనుక్కున్నారు గదా.....ఇలా భార్యను, కుమారుని అలా అమ్మటం చాలా దారుణమైన విషయమని హరిశ్చంద్రుల వారికీ తెలుసు. దానికి వారు ఎంతో బాధపడ్డారని కూడా మనం చెప్పుకున్నాం.
అయితే రాజంతటి వారే మాట తప్పితే ఇక ప్రజలు సత్యం అన్నది పాటించరని ........ ఇక ప్రజలందరు రోజూ అబధ్ధాలే చెబుతూ ఒక అబధ్ధం కప్పిపుచ్చటానికి ఇంకో అబధ్ధం ....... ఇలా చెప్పుకుంటూ పోతే లోకంలో ఇక ధర్మం నిలబడదు. అంతా అధర్మం, అవినీతి మయం అయిపోతుంది. ఇన్ని ఆలోచించి ఆయన ప్రజలనందరిని పాపాత్ములను చేయకుండా ఉండటానికే తన కుటుంబం అష్టకష్టాలు పడినా భరించారు. అప్పటి పాలకులు ప్రజలను అలా చూసుకునేవారు.
ఇంకో విషయమండి. ప్రజలు చేసే పాపంలో పాలకులకు ఇంతని వాటా వస్తుందట. ఆ ప్రజలు చేసే పాపం పాలకులను పరలోకంలో కూడా పట్టి పీడిస్తుందట. . అందుకే అప్పటి మంచి పాలకులు ప్రజలు పాపపు పనులు చెయ్యకుండా పనికట్టుకుని చూసుకునేవారట. ఇది పెద్దలు చెప్పిన విషయం. ఇంకోటి అసలు హరిశ్చంద్రులవారు విశ్వామిత్రుల వారికి కావాలని రాజ్యాన్ని దానం చెయ్యలేదు.
ఒకప్పుడు హరిశ్చంద్రుల వారు ఆపదలో ఉన్నప్పుడు విశ్వామిత్రుల వారు మారు వేషములో ఆయనను రక్షించారు. ఆ సంతోషములో ఆయన ఏదైనా కోరుకో ఇస్తానని అంటే విశ్వామిత్రుల వారు ఇంత పెద్ద కోరిక కోరుకున్నారు. దానికి వేరే కారణాలున్నాయని మనకి తెలుసు కదా....అది ఇంకో కధ.
హరిశ్చంద్రుడు ఆ తపస్వి ఏదో సాధారణ దానం అడుగుతారని అనుకున్నారు గాని ఇదంతా ఊహించలేదు. ఒకోసారి అంతే. ఇలాగే జరుగుతుంది. అయితే విశ్వామిత్రుల వారి వల్ల హరిశ్చంద్రునికి మంచే జరిగింది. వారి పేరు ఈ నాటికి మనము చెప్పుకుంటున్నాము.
అందుకే అందరూ మంచిపనులు చేస్తూ దైవాన్ని నమ్ముకుంటే ఎప్పుడూ మనము రక్షించబడతాము.. .........

No comments:
Post a Comment