ఈ విషయం శిరిడి శ్రీ సాయిబాబా జీవితచరిత్రము లో చెప్పబడినదండి.
ఒకానొకప్పుడు బాంద్రాలో నుండు బాబా భక్తుని కొమార్తె వేరొక గ్రామమున ప్లేగు జ్వరముతో బాధపడుచుండెను.
తనవద్ద ఊదీ లేదనియు, కనుక ఊదీ పంపుమనియు నానాసాహెబు చాందోర్కరు గారికి అతడు కబురు పంపెను. ఈ వార్త నానాసాహెబుకు ఠాణా రైల్వేస్టేషను వద్ద తెలిసెను.
అప్పుడతడు భార్యతో కూడ 'కల్యాణ్' పోవుచుండెను. వారివద్ద అప్పుడు ఊదీ లేకుండెను. కావున రోడ్డు పైని మట్టిని కొంచెము తీసి, సాయి నామజపము చేసి, సహాయము నభ్యర్ధించి నానాసాహెబు తన భార్య నుదిటిపై రాసెను.
ఆ భక్తుడిదంతయు జూ చెను. అతడు తన కొమార్తె యింటికి పోవుసరికి మూడురోజులనుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబు తనభార్య నుదిటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గెనని విని మిక్కిలి సంతసించెను.. ..
No comments:
Post a Comment